About: http://data.cimple.eu/claim-review/9047aca5db532087f7e70d0ffa1e7ce0739ce7b84ae68080bbd3b8d2     Goto   Sponge   Distinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Aug 16 2024 16:43:08 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: పోల్ ఆఫ్ పోల్స్ అంటూ NDTV ఎటువంటి సర్వేను ప్రచురించలేదు, వైరల్ అవుతున్న పోస్టులు నకిలీవి తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది.. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో Claim :వైరల్ అవుతున్న చిత్రంలో NDTV పోల్ ఫలితాలను ప్రచురించిందని చూపిస్తుంది, తెలంగాణలో అధికార BRS కంటే కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వస్తాయని చూపుతోంది Fact :NDTV అటువంటి పోల్ ఆఫ్ పోల్స్ సర్వేను ప్రచురించలేదు. ప్రచారంలో ఉన్న వైరల్ చిత్రం నకిలీది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది.. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకంతో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. మొత్తం 119 రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగనుంది. ఎన్డిటివి చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే అంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇందులో బీఆర్ఎస్పై కాంగ్రెస్ విజయం సాధించబోతోందని చెబుతున్నట్లు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో ప్రతి పార్టీ పొందబోతున్న సీట్ల సంఖ్యను చూపుతున్న NDTV పోల్ ఆఫ్ పోల్స్, ABP C ఓటర్ పోల్, ది సౌత్ ఫస్ట్అంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలను ఈ చిత్రం చూపిస్తుంది. “Breaking: NDTV Poll of Polls tips the scales in favor of Congress in Telangana! Amidst widespread anti-incumbency against the KCR government, most polls signal a massive setback for BRS. Today's NDTV tracker forecasts a historic win for Congress, eyeing an impressive 75 seats. #TelanganaElections #NDTVPolls #CongressVictory” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఫేవర్ గా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అందులో చెప్పారు. బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారంటూ NDTVలో తెలిపారని ప్రచారం చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. NDTV అలాంటి ఎగ్జిట్ పోల్స్ ను ప్రచురించలేదు. NDTV సంస్థ వెబ్సైట్లో పోల్ ఆఫ్ పోల్స్ కోసం సెర్చ్ చేయగా.. ఆ సంస్థ ప్రచురించిన ఎటువంటి ఎగ్జిట్ పోల్ కూడా మాకు కనిపించలేదు. మేము NDTV ప్రచురించిన సోషల్ మీడియా పోస్ట్లను సెర్చ్ చేయగా.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి NDTV ఎటువంటి పోల్లను నిర్వహించలేదని పేర్కొంటూ మాకు ఒక పోస్ట్ కనిపించింది. దయచేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని అందులో తెలిపారు. కొంతమంది ట్విటర్ వినియోగదారులు కూడా ఇది నిజమేనని ఒక పోస్ట్ను పంచుకున్నారు. ఓ కాంగ్రెస్ ప్రతినిధి.. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయనుంది! అని తెలిపారు. దీనికి NDTV సంస్థ స్పందించింది. క్షమించండి, మేము ఎలాంటి పోల్ పోల్ నిర్వహించలేదు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని తెలిపింది. Latestly.com కూడా వైరల్ అవుతున్న పోస్టును ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్డిటివి పోల్స్ వివరాలు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.కాంగ్రెస్ నాయకులు దానిని వైరల్ చేస్తున్నారని తెలిపింది. ఈ పోల్స్ ఫోటో ఫేక్ అని ఎన్డీటీవీ వార్తా సంస్థ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం పోల్ ఆఫ్ పోల్స్ పేరుతో NDTV ఎటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయలేదు. వైరల్ అవుతున్న చిత్రం నకిలీది. కాబట్టి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం పోల్ ఆఫ్ పోల్స్ పేరుతో NDTV ఎటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయలేదు. వైరల్ అవుతున్న చిత్రం నకిలీది. News Summary - Poll of Polls was not published by NDTV, it is fake Claim : The viral image shows Poll of Polls published by NDTV, which shows Congress getting more seats in Telangana than the ruling party Claimed By : Social media users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software