Thu Jul 18 2024 13:20:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన స్క్రీన్ షాట్ 'ఫేక్'
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. టీడీపీ తరపున యువ గళం పాదయాత్రకు ఇటీవలే నాయకత్వం వహించారు.
Claim :టీడీపీ నేత నారా లోకేష్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ట్విట్టర్ ఖాతాలో బ్రేకింగ్ న్యూస్ షేర్ చేసింది.
Fact :వైరల్ చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు. ఇది ABN ఆంధ్రజ్యోతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్షాట్ కాదు. నారా లోకేష్ అరెస్ట్ వార్త ఫేక్ న్యూస్ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. టీడీపీ తరపున యువ గళం పాదయాత్రకు ఇటీవలే నాయకత్వం వహించారు.
నారా లోకేష్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిన కారణంగా బిడెన్కు మద్దతును ఇవ్వకూడదని తెలుగు ప్రవాసులకు చంద్రబాబు పిలుపును ఇచ్చారని బ్రేకింగ్ న్యూస్ని చూపుతున్న ABN ఆంధ్రజ్యోతి స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నారా లోకేష్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారంటూ పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టులు వైరల్ అయ్యాయి. మనీలాండరింగ్ కేసులో నారా లోకేష్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారనే వాదనతో పోస్టులు పెట్టారు.
“అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్___అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్___ప్రస్తుతం అమెరికాలో పోలీసుల ఆధీనంలో ఉన్న నారా లోకేష్____NaraLokesh _YuvaGalam _ChadraBabu _AndhraPradesh _Politics _LooterLokesh” అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏబీఎన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఆ టీవీ ఛానల్ లో నారా లోకేష్ అరెస్ట్ అంటూ ఎలాంటి కథనం కూడా రాలేదు.
వైరల్ ట్వీట్ కు సంబంధించిన పోస్టులను పరిశీలించినప్పుడు. ABN తెలుగు (@ABNNewsLive) కు సంబంధించిన X (Twitter) ఖాతా ABN ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ అధికారిక సోషల్ మీడియా ఖాతా కాదని మేము కనుగొన్నాము. ఈ అకౌంట్ ను నవంబర్ 2022లో ప్రారంభించారు. కేవలం 380 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా కేవలం 484 ట్వీట్లు మాత్రమే ఉన్నాయి. ఇది మోసపూరితమైన ఖాతాగా మేము గుర్తించాం.
ABN Andhrajyothi ఛానల్ ట్విట్టర్ ఖాతా @abntelugutv అని ఉంటుంది. 223.4k ఫాలోవర్లు ఉన్నారు. ఏప్రిల్ 2011 నుండి ఈ ఖాతా యాక్టివ్ గా ఉంది.
ABN ఆంధ్రజ్యోతి ఫేస్బుక్ పేజీ వైరల్ పోస్టును ఫేక్ న్యూస్గా కొట్టిపారేసింది. ఇలాంటి పోస్టుల ద్వారా ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
నారా లోకేష్ని అమెరికాలో అరెస్టు చేశారన్న వార్తల కోసం వెతికితే.. ఆ వాదనలను ధృవీకరించే ప్రామాణికమైన వార్తలేవీ కనుగొనలేకపోయాము. ఏ అంతర్జాతీయ, స్థానిక వార్తా వెబ్సైట్లు నారా లోకేష్ అరెస్ట్ అయ్యారంటూ వార్తలను ప్రచురించలేదు.
ఫ్యాక్ట్ చెక్ టీడీపీ ట్విటర్ ఖాతా ఫేక్ అంటూ వైరల్ పోస్టులను కొట్టిపారేసింది.
నారా లోకేష్ను అమెరికాలో అరెస్టు చేశారన్న వార్తను ఫేక్ న్యూస్ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ కూడా కొట్టిపారేసింది.
నారా లోకేష్ ఎక్కడ ఉన్నారు, అమెరికాలో ఏం జరిగిందనే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ షాట్ ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది. ABN తెలుగు TV ఛానెల్ ను పోలి ఉన్న ఫేక్ పోస్టు అని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

News Summary - Viral image of ABN Andhrajyothi claiming Nara Lokesh’s arrest in USA is FAKE
Claim : ABN Andhrajyothi TV channel’s Twitter account shared breaking news that Nara Lokesh was arrested by American police in the USA
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story