Wed Feb 12 2025 16:42:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అత్యంత ఎత్తైన వంతెన చీనాబ్ నదిపై ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ఎత్తైన రైల్వే ట్రాక్ పై రైలు వెళుతున్న వీడియో వైరల్గా మారింది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉందంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఎత్తైన రైల్వే ట్రాక్ పై రైలు వెళుతున్న వీడియో వైరల్గా మారింది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉందంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. రెండు పర్వతాల మధ్య ఎత్తైన వంతెనను మనం చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:చీనాబ్ నదిపై ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నారని చెబుతూ వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు.జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఎత్తైన వంతెనకు సంబంధించిన వివరాల కోసం వెతికాం. నిర్మాణంలో ఉన్న వంతెనకు సంబంధించిన వివరాలు మార్చి 26, 2023న అనేక వార్తా నివేదికలలో ప్రచురించబడినట్లు మేము కనుగొన్నాము.
ఈ వార్తా నివేదికల ప్రకారం నదిపై బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉంది.హిందూస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ వంతెనపై భద్రతా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. డిసెంబర్ 2023-జనవరి 2024 నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుంది.నివేదికల ప్రకారం వంతెన ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించడం లేదని మేము నిర్ధారించగలము.
వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన చిత్రాన్ని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి శోధించినప్పుడు, వైరల్ వీడియో బీపాంజియాంగ్ రైల్వే వంతెనకు సంబంధించినదని మేము కనుగొన్నాము.బీపాంజియాంగ్ వంతెనకు సంబంధించిన చిత్రాలు వికీమీడియా కామన్స్, megaconstrucciones.netతో సహా అనేక వెబ్సైట్లలో ప్రచురించారు. ఇందులో వంతెనకు సంబంధించిన ఫోటోలు వివిధ కోణాలలో ఉండడం మనం గమనించవచ్చు.highestbridges.com వెబ్సైట్ ఈ వంతెన 2001లో ప్రారంభించారని 275 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. ఇది చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లోని లియుపాన్షుయ్, బైగావోలను కలుపుతూ ఏర్పాటు చేశారని తెలిపారు.
ddpcp.cn వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వీడియోలలో వంతెన పైన రైలు ప్రయాణిస్తున్న వైరల్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. వైరల్ అవుతున్న వీడియోను.. ఒరిజినల్ వీడియో సరిపోలాయని మేము కనుగొన్నాము.
News Summary - Viral video of high-altitude railway bridge shows visuals from China, not of River Chenab in India
Claim : The video shows a high-altitude railway bridge under construction on Chenab river in Jammu and Kashmir
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story