schema:text
| - Tue Jan 28 2025 14:36:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జరిపిన మీటింగ్ చిత్రం తప్పుడు వాదనతో వైరల్ అవుతోంది
భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025, శనివారం నాడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్
Claim :బడ్జెట్ కు ముందు ఆర్థిక నిపుణులతో నిర్మలా సీతారామన్ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు
Fact :జూలై 2024లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు
భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025, శనివారం నాడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పించనున్నారు. పార్లమెంట్లో సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఎనిమిదో బడ్జెట్ ఇది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఆదాయపు పన్ను రేట్లు, ఆదాయపు పన్ను స్లాబ్లలో అనేక మార్పులు వచ్చాయి.
మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ముఖ్యంగా హైవేలు, భారతీయ రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయిస్తూ వస్తోంది. ఈ బడ్జెట్ లో కూడా అదే తరహాలోనూ, వెల్నెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు, గ్రీన్ ఇనిషియేటివ్లు, ఉద్యోగాల కల్పనలో కీలకమైన మూలధన వ్యయాన్ని ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్లో దేశీయ, ఇన్బౌండ్ టూరిజం రెండింటికీ గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడానికి రూ.7,500 కంటే ఎక్కువ ధరలు ఉన్న హోటల్ గదులకు GSTని 18% నుండి 12%కి తగ్గించాలని కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. బడ్జెట్ 2025 ప్రెజెంటేషన్ను పార్లమెంటు అధికారిక ఛానెల్లు, దూరదర్శన్, సంసద్ టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కార్యాలయంలో కూర్చుని ఉండగా.. ఆమె చుట్టూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్న ఫోటో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లు రిషి బాగ్రీతో కలిసి నిర్మలా సీతారామన్ కూర్చున్నారు. ఈ చిత్రాన్ని ఆర్థిక నిపుణులతో నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. “this sycophant is an economic expert??? no wonder the tax terrorism” అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టారు.
ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఇది ఇటీవలి ఫోటో కూడా కాదు. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి చిత్రాన్ని వెతికినప్పుడు, ఈ చిత్రం జూలై 2024 నుండి ఆన్లైన్లో ఉన్నట్లు కనుగొన్నాము.
పల్లవి CT అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లను కలిసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెబుతూ పలు చిత్రాలను పంచుకున్నారు.
"#NirmalaSitharaman called social media influencers from across Instagram, YouTube, and X to discuss their concerns regarding the #UnionBudget on July 28" అంటూ డెక్కన్ హెరాల్డ్ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో జూలై 29, 2024న ఈ చిత్రాన్ని పోస్టు చేసింది. అయితే, ఈ సమావేశంలో కేవలం రైట్ వింగ్ కు చెందిన ఇంఫ్లుయెన్సర్లతో కలిశారంటూ నెటిజన్లు ఆరోపించారు.
జూలై 28న కేంద్ర బడ్జెట్కు సంబంధించి సూచనలు చర్చించడానికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లాంటి ప్లాట్ ఫామ్ లకు చెందిన సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారని డెక్కన్ హెరాల్డ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం కేవలం వర్గానికి చెందిన ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రమే కలుస్తోందని నెటిజన్లు ఆరోపించారని కథనంలో ఉంది. పల్లవి C T X బయో ప్రకారం, BJP ముంబై యూనిట్ IT సెల్ కో-కన్వీనర్ గా ఉన్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న చిత్రం ఇటీవలిది కాదు, జూలై 2024 నాటిది. బడ్జెట్ 2025కి ముందు ఆర్థిక మంత్రి సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లతో సమావేశమయ్యారని, వారి నుండి ఆర్థిక సలహాలు తీసుకుంటున్నారనే వాదన సరైనది కాదు. జూలై 2024లో నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కలిసిన చిత్రం మరోసారి వైరల్ అవుతూ ఉంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
News Summary - Nirmala sitaraman video
Claim : బడ్జెట్ కు ముందు ఆర్థిక నిపుణులతో నిర్మలా సీతారామన్ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story
|