About: http://data.cimple.eu/claim-review/17e7b136b674671999ca59b7f267477639198674881d4961dd1f9fed     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Sat Nov 30 2024 14:22:56 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: వీడియోలో కరాటే విన్యాసాలు చేస్తున్న వ్యక్తి తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కాదు క్రీడలు మరియు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. Claim :ఆంద్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే స్టేజీ మీద స్టంట్స్ చేయడానికి ప్రయత్నించి గాయపడిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి Fact :2014లో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఓ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నప్పటిది ఈ వీడియో క్రీడలు మరియు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 1, 2023న కార్యక్రమానికి సంబంధించిన వీడియో, బ్రోచర్ విడుదల కార్యక్రమంలో క్రీడల మంత్రి రోజా, సాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి కరాటే విన్యాసాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి తన తలతో నిప్పులతో ఉన్న పలకలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుండగా, అతని జుట్టుకు మంటలు అంటుకున్నాయి. అతనికి సహాయం చేయడానికి స్టేజీ మీద ఉన్న వ్యక్తులు పరిగెత్తారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అనే వాదనతో వైరల్ వీడియో ప్రచారంలో ఉంది. “ఆడుదాం ఆంధ్రా” అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. “శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రా" ప్రోగ్రాం లో భాగంగా తన విజ్ఞానాన్ని (కరాటే ప్రతిభను) పై విధంగా ప్రదర్శించారు....ఇంకా నయం గోరంట్ల మాధవ్ ఆడే ఆట ప్రదర్శించ లేదు” అంటూ పోస్టులు పెట్టారు. “శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రా" ప్రోగ్రాం లో భాగంగా తన విజ్ఞానాన్ని (కరాటే ప్రతిభను) పై విధంగా ప్రదర్శించారు....ఇంకా నయం గోరంట్ల మాధవ్ ఆడే ఆట ప్రదర్శించ లేదు” అంటూ పోస్టులు పెట్టారు. ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న వీడియో ఎక్కడా కనిపించలేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి అనే పేరుతో వెతికితే ఇంటర్నెట్లో అలాంటి వీడియోలేవీ కనిపించలేదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వివరాలను వెతికితే, ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి ఆర్కే రోజా, సాప్ (ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, సాప్ ఎండీ ధ్యానచంద్ర మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గురించి మీడియాకు వివరించినట్లు వార్తా కథనాలు వచ్చాయి. 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను కూడా వారు విడుదల చేశారు. క్రికెట్, ఖో-ఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్తో సహా 5 పోటీ క్రీడలకు నాకౌట్ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా 5 స్థాయిలలో (గ్రామం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం) నిర్వహించనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఈవెంట్లను నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. బియ్యపు మధుసూధన్ రెడ్డి అలాంటి ఈవెంట్ లో కనిపించలేదు. మేము సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఆ వీడియోలో ఉన్నది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అని.. అతడు కరాటే విన్యాసాలు చేస్తున్నాడని.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కాదని మేము కనుగొన్నాము. గలాట్టా తమిళ్ అనే యూట్యూబ్ ఛానెల్ 6 జనవరి 2014న “అధిరాది మూవీ లాంచ్లో మన్సూర్ అలీ ఖాన్కు షాకింగ్ యాక్సిడెంట్” శీర్షికతో వైరల్ వీడియోను ప్రచురించింది. వీడియోలో, నటుడు మన్సూర్ అలీ ఖాన్ విన్యాసాలు చేయడం మనం చూడవచ్చు. గలాట్టా తమిళ్ ప్రచురించిన మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము, ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ సినిమా అధిరాడి లాంచ్ లో అనేక ఇతర విన్యాసాలు చేయడం చూడవచ్చు. IMDb ప్రకారం, అధిరాడి చిత్రానికి మన్సూర్ అలీ ఖాన్ రైటర్ గా బాధ్యతలు చేపట్టడమే కాకుండా..నటించాడు కూడా..! ఈ సినిమా అక్టోబర్ 2015 లో విడుదలైంది. వేదికపై కరాటే విన్యాసాలు చేస్తున్న వీడియో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ది. అంతేకానీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిది కాదు. వైరల్ అవుతున్న వాదన లో ఎటువంటి నిజం లేదు. గలాట్టా తమిళ్ అనే యూట్యూబ్ ఛానెల్ 6 జనవరి 2014న “అధిరాది మూవీ లాంచ్లో మన్సూర్ అలీ ఖాన్కు షాకింగ్ యాక్సిడెంట్” శీర్షికతో వైరల్ వీడియోను ప్రచురించింది. వీడియోలో, నటుడు మన్సూర్ అలీ ఖాన్ విన్యాసాలు చేయడం మనం చూడవచ్చు. గలాట్టా తమిళ్ ప్రచురించిన మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము, ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ సినిమా అధిరాడి లాంచ్ లో అనేక ఇతర విన్యాసాలు చేయడం చూడవచ్చు. IMDb ప్రకారం, అధిరాడి చిత్రానికి మన్సూర్ అలీ ఖాన్ రైటర్ గా బాధ్యతలు చేపట్టడమే కాకుండా..నటించాడు కూడా..! ఈ సినిమా అక్టోబర్ 2015 లో విడుదలైంది. వేదికపై కరాటే విన్యాసాలు చేస్తున్న వీడియో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ది. అంతేకానీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిది కాదు. వైరల్ అవుతున్న వాదన లో ఎటువంటి నిజం లేదు. News Summary - Video shows Tamil Actor Mansoor Ali Khan performing Karate stunts but not Srikalahati MLA Claim : The video shows an MLA from Srikalahasthi, Andhra Pradesh, participating in a game show and getting hurt Claimed By : Social media users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software