About: http://data.cimple.eu/claim-review/1cd4826fb9df99652cf0b4e261fa17e5f87df8fdee0e09e0eaa97e61     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • వాస్తవ తనిఖీ: వైరల్ ఫోటోకు నాగవాసుకి ఆలయంతో సంబంధం లేదు, ఈ ఫోటో కర్ణాటకకు చెందినది కర్ణాటకకు చెందిన ఫోటో నాగవాసుకి ఆలయం పేరిట వైరల్ అవుతున్నట్లు విశ్వాస్న్యూస్ దర్యాప్తులో తేలింది. వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. - By: Sapthagiri Gopagoni - Published: Aug 14, 2020 at 04:53 PM - Updated: Sep 14, 2020 at 01:35 PM హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఒక ఫోటో కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ప్రయాగలోని నాగవాసుకి ఆలయానికి చెందినదని పేర్కొంటున్నారు. ఈ పోస్ట్ నిజమని వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్టులపై దర్యాప్తు చేసింది. ప్రయాగ పేరిట కొంతమంది తప్పుగా వైరల్ చేస్తున్నారని మా దర్యాప్తులో తేలింది. ఈ చిత్రానికి నాగవాసుకి ఆలయంతో సంబంధం లేదు. దర్యాప్తులో, వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. వైరల్ అవుతున్నది ఏంటి ? సోనికా శర్మ (@sonikasdutta) అనే మహిళ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ కళాకృతి ప్రయాగలోని నాగవాసుకి ఆలయంలో ఉందని పేర్కొంటూ ఒక చిత్రాన్ని అప్లోడ్ చేసింది. ఈ పోస్ట్లో దావా ఆంగ్లంలో వ్రాయబడింది : ‘This is not a tree. It is carved in stone. No one knows who is the sculptor. This is in Naga Vasuki temple, Prayag. We always feel proud about Tajmahal, ignoring vast cultural heritage which remained unnoticed even today.’ దానికి తెలుగు అనువాదం చూస్తే.. ‘ఇది చెట్టు కాదు. ఇది రాతితో చెక్కబడింది. శిల్పి ఎవరో ఎవరికీ తెలియదు. ఇది ప్రయాగలోని నాగ వాసుకి ఆలయంలో ఉంది. ఈ రోజుకు కూడా విస్తారమైన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించలేక విస్మరిస్తున్నాం. అదే తాజ్మహల్ గురించి మాత్రం గర్వంఆ ఫీలవుతున్నాం.’ ఈ వైరల్ పోస్ట్ యొక్క ట్విట్టర్ లింక్ ఇక్కడ చూడొచ్చు. అలాగే.. ఆ పోస్ట్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడండి. దర్యాప్తు : విశ్వాస్ న్యూస్ మొదట గూగుల్ రివర్స్ ఇమేజ్కి ఈ వైరల్ ఇమేజ్ని అప్లోడ్ చేసి శోధించింది. మేము ఈ ఫోటోను ఒక వెబ్సైట్లో కనుగొనడం జరిగింది. ఫోటోపై ఉన్న క్యాప్షన్లో, ఈ చిత్రం కర్ణాటకలోని ఉత్సవ్ రాక్గార్డెన్లో ఉందని పేర్కొన్నారు. మీరు అసలు చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. దర్యాప్తు తదుపరి దశలో మేము ఉత్సవ్ రాక్గార్డెన్ వెబ్సైట్లో పరిశీలించాము. అక్కడ గ్యాలరీలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను పోలిన ఫోటో కాస్త లాంగ్షాట్లో కనిపించింది. ఇది ‘ఆర్టిస్టిక్ బన్యన్ ట్రీ’ అని రైటప్ల పేర్కొన్నారు. మీరు ఇక్కడ ఆ ఫోటో చూడవచ్చు. దీనిపై మరింత వాస్తవం తెలుసువడానికి, ప్రయాగ్రాజ్లోని ‘శ్రీధర్మ జ్ఞానోపదేశ్’ సంస్కృత కళాశాల మాజీ ప్రిన్సిపాల్ను సంప్రదించాము. జ్యోతిర్విద్య్ ఆచార్య దేవేంద్ర ప్రసాద్ త్రిపాఠి ఆ ఆలయం గురించి మాకు తెలియజేస్తూ నాగవాసుకి ఆలయంలో అలాంటి చెట్టు లేదని చెప్పారు. అలాంటి కళాకృతులు కూడా సృష్టించబడలేదన్నారు. మొత్తం ప్రయాగరాజ్లో అలాంటి కళాకృతులు, చెట్లు లేవని స్పష్టత ఇచ్చారు. చివరికి మేము ఈ నకిలీ పోస్ట్ చేసిన యూజర్ వివరాలు పరిశీలించడం జరిగింది. సోనికా శర్మ అనే ఈ ట్విట్టర్ హ్యాండిల్ 2017 జనవరిలో క్రియేట్ చేసినట్లు మాకు తెలిసింది. ఈ ట్విట్టర్ అకౌంట్కు 17 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ యూజర్ జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్నారు. निष्कर्ष: కర్ణాటకకు చెందిన ఫోటో నాగవాసుకి ఆలయం పేరిట వైరల్ అవుతున్నట్లు విశ్వాస్న్యూస్ దర్యాప్తులో తేలింది. వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. - Claim Review : నాగవాసుకి ఆలయ చిత్రం - Claimed By : సోనికా శర్మ - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software