schema:text
| - Fri Jul 19 2024 03:22:53 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న యువకుడు ఓ మెజీషియన్
యోగా కారణంగా ఓ యువకుడు ఆకాశంలో ఎగిరే సామర్త్యాన్ని కలిగి ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
యోగా కారణంగా ఓ యువకుడు ఆకాశంలో ఎగిరే సామర్త్యాన్ని కలిగి ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. యోగా కారణంగానే అతడు ఈ ఘనత సాధించగలిగాడని, ఓ యువకుడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లు చూపించే వైరల్ వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.వీడియోలో కొంతమంది వ్యక్తులు మధ్య ఆ యువకుడు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళను తన చేతులు పట్టుకోమని అడిగాడు. అయితే ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఎటువంటి మద్దతు లేకుండా గాలిలో ఎగరడం ప్రారంభించాడు. వీడియోలో కనిపిస్తున్న యువకుడు తమిళనాడుకు చెందినవాడని, యోగా శక్తి వల్ల ఆకాశంలో ఎగురుతున్నాడనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా దీని వెనుక ఉన్న నిజాలను కనుక్కోలేకపోతున్నారని, ఎంతో అయోమయంలో ఉన్నారని చెబుతూ వస్తున్నారు. రామాయణం, హనుమంతుడు ఊహాజనితమని చెప్పుకునే వారందరికీ ఇది ఒక సవాలుగా మారింది అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.“यह लड़का तमिलनाडु का रहने वाला है इसने योग विद्या के बल पर आसमान में उड़कर कर दिखाया जिससे वैज्ञानिक भी हैरान रह गए । रामायण और हनुमान जी को काल्पनिक कहने वालों के लिये खुली चुनोती है ।“ అంటూ హిందీలో పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.క్లెయిం అవాస్తవం. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మెజీషియన్, ఇల్యూషనిస్ట్“ఫ్లయింగ్ బాయ్ ఫ్రమ్ తమిళనాడు” అనే కీవర్డ్ సెర్చ్ చేశాము. వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి వెతికాం. “160 feet flying man’s magic trick revealed I Magician Vignesh reveals” అనే శీర్షికతో యూట్యూబ్ ఛానెల్ 'బిహైండ్వుడ్సెయిర్న్యూస్' ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. మెజీషియన్ విఘ్నేష్ ఈ మ్యాజిక్ వెనుక ఉన్న సీక్రెట్స్ ను వెల్లడించారు అంటూ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో ఆగస్టు 2018లో ప్రచురించారు. వైరల్ వీడియో కూడా ఈ వీడియోలో భాగమే.
మేము మెజీషియన్ విఘ్నేష్ గురించి వెతికినప్పుడు, మేము అతని వెబ్సైట్ను కనుగొన్నాము. అందులో అతని పూర్తి వివరాలను చూశాం. అతడికి మాయాజాల్ రత్న అనే ప్రతిష్టాత్మక అవార్డు కూడా దక్కింది. ‘ది ఇల్యూజన్ షో’ పేరుతో పలు ఈవెంట్లు చేశాడు.మేము అతని యూట్యూబ్ ఛానెల్ని కూడా కనుగొన్నాము, అక్కడ అతను ప్రదర్శించిన మ్యాజిక్ ట్రిక్లను చూడవచ్చు. ఈ వీడియోను 2018లో ప్రచురించారు.
మేము మరింత శోధించినప్పుడు, మేజిక్ సీక్రెట్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన మరొక వీడియోను మేము కనుగొన్నాము, అక్కడ ఒక మాంత్రికుడు ఆకాశంలో మూడు-అంతస్తుల భవనంపైకి లేచాడు. అతను క్రేన్ లాంటి నిర్మాణాలు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించే లెవిటేటింగ్ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ స్టంట్ ను బాగా వెలుగు ఉన్నప్పుడు.. మెజీషియన్ ను లాగే వైర్ కనిపించకుండా ఉండేలా చర్యలు తీసుకుని ప్రదర్శిస్తారు. ఇక చుట్టూ ఉన్న వాళ్లు కూడా నటులే..!
మేము మరింత శోధించినప్పుడు, మేజిక్ సీక్రెట్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన మరొక వీడియోను మేము కనుగొన్నాము, అక్కడ ఒక మాంత్రికుడు ఆకాశంలో మూడు-అంతస్తుల భవనంపైకి లేచాడు. అతను క్రేన్ లాంటి నిర్మాణాలు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించే లెవిటేటింగ్ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ స్టంట్ ను బాగా వెలుగు ఉన్నప్పుడు.. మెజీషియన్ ను లాగే వైర్ కనిపించకుండా ఉండేలా చర్యలు తీసుకుని ప్రదర్శిస్తారు. ఇక చుట్టూ ఉన్న వాళ్లు కూడా నటులే..!
ఈ గాల్లో ఎగరడం అనేది లెవిటేషన్ ట్రిక్.. ఒక భ్రమ, అంతేకానీ యోగ శక్తి కారణంగా ఎగరడం లేదు. వైరల్ అవుతున్న క్లెయిం అవాస్తవం.
News Summary - Young man seen in the Viral video is a magician
Claim : man flying due to strength of yoga
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|