schema:text
| - Fri Jan 17 2025 15:39:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ లో బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించిన వీడియో తప్పుడు వాదనతో వైరల్ చేస్తున్నారు
తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు
Claim :కిక్ బాక్సింగ్ లో వివక్ష చూపించినందుకు ఓ వ్యక్తి ప్రైజ్ ను విసిరికొట్టాడు
Fact :ఇది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కు చెందినది. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటన
కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నది జరగకపోతే చాలా కోపం వస్తూ ఉంటుంది. వేదికల దగ్గర అవమానాలు జరిగినా కట్టలు తెంచుకునే ఆవేశం వస్తుంది. అలా ఓ బాడీ బిల్డర్ తనకు వచ్చిన ప్రైజ్ ను స్టేజీ మీద నుండే విసిరికొట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
విజేతను ప్రకటించిన తర్వాత ఓ కార్యక్రమంలో బాడీబిల్డర్ తన బహుమతిని తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అతడిపై వివక్ష కారణంగా మొదటి స్థానం దక్కలేదని పలువురు కథనాలను షేర్ చేస్తున్నారు.
"కిక్ బాక్సింగ్ లో కప్పు గెలిచిన అమెరికా తెల్లజాతీయుల వివక్ష అహంకారానికి బుద్ధి చెబుతూ కప్పు కాలిగోటితో సమానంగా నదిలో విసిరేసి ఆత్మ అభిమానాన్ని చాటుకున్న రిచర్డ్ రైట్ లాంటి నిజమైన హీరొ నాకు ఇప్పుడు కనబడ్డాడు. వివక్ష, అవమానం ఎదురైనప్పుడు ఆ అవమానానికి కారణమైన అహంకారాన్ని కాలితో ఎగిరి తన్నిన నిజమైన ఈ దేశ ప్రగతిశీల కధానాయకుడు ఈ హీరో.
ప్రతిభను వివక్షతొ ప్రశంశించలేరు.
ఆ పురస్కారాలు ఆత్మగౌరవం కోరుకునేవాడికి కాలి గోటితో సమానం. ప్రశంశకంటే ఆత్మగౌరవం పవరఫుల్ అది బయటపడేటంత అవమానం కలిగాక సముద్రాలు కూడా ఆ అగ్ని పర్వతాన్ని దాచి ఉంచలేవు ఆ లావా పొంగితే ఇలాగే ఉంటది."

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్నది. తనకు ఇచ్చిన ప్రైజ్ ను కాలితో తన్నిన వ్యక్తి రిచర్డ్ రైట్ కాదు. అతడి పేరు జాహిద్ హసన్ షువో.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. గతంలో కూడా ఈ వీడియో వైరల్ అయిందని గుర్తించాం. అక్కడ జరిగిన ఘటనతో సంబంధం లేకుండా పలువురు పోస్టులు పెట్టారు. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా డిసెంబర్ 27, 2022 న బంగ్లాదేశ్ కు చెందిన వార్తా ఛానెల్ My TV Bangladesh ఈ సంఘటనను కవర్ చేస్తూ వీడియోను నివేదించింది. ఒక బాడీబిల్డర్ తాను అందుకున్న అవార్డును తన్నడమే కాకుండా, ఫెడరేషన్ లో ఉన్నవాళ్ళంతా దొంగలు అంటూ ఆరోపించాడని ఆ కథనంలో ఉంది. బంగ్లాదేశ్ బాడీబిల్డర్ జాహిద్ హసన్ షువో పోటీల్లో రెండవ స్థానం దక్కించుకున్నాడు. అతడు అసంతృప్తితో తనకు ఇచ్చిన అవార్డును చాలాసార్లు తన్నాడు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ (BABBF) షువోపై జీవితకాల నిషేధాన్ని విధించింది. బాడీబిల్డర్ చర్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.
జాహిద్ హసన్ షువో అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా పలు మీడియా కథనాలు మాకు లభించాయి. తనకు జరిగిన అన్యాయంపై జాహిద్ మీడియాతో పంచుకున్నారు. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
తనకు కోపం రావడానికి బ్లెండర్ను స్వీకరించడం కాదని. బాడీ బిల్డింగ్ ఫెడరేషన్లో జరిగిన అవినీతి అని తెలిపాడు జాహిద్. ఇది అవినీతిని తన్నినట్లు భావిస్తున్నాను. మన దేశంలో ఏ ప్రదేశంలో చూసినా అవినీతి ఉంది అని మీడియాతో అన్నాడు. "నాకు, విజేతకు మధ్య ఉన్న శరీరాకృతిలో ఉన్న వ్యత్యాసాన్ని ఒక పిల్లవాడు కూడా చెప్పగలడు. అయినప్పటికీ, నా చర్యకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒక క్రీడాకారుడు అలా చేయడం అసహ్యంగా కనిపిస్తుంది," అని వివరించాడు. పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు కూడా ఈ ఘటనను నివేదించాయి. 2022 డిసెంబర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

భారత్ కు చెందిన మీడియా సంస్థలు కూడా ఈ ఘటనను గతంలో నివేదించాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జాహిద్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. విజేతను ముందుగానే నిర్ణయించేశారని తనకు అన్యాయం జరిగిందంటూ పోస్టు పెట్టారు.
వైరల్ వీడియోపై పలు మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ కూడా చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి రిచర్డ్ రైట్ కూడా కాదు. బాక్సింగ్ పోటీలకు సంబంధించిన ఘటన కానే కాదు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
News Summary - Fact check A video related to body building competitions in Bangladesh is going viral with false claims
Claim : ఇది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కు చెందినది. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటన
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|