schema:text
| - Thu Jul 18 2024 18:27:26 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 85 సంవత్సరాల వయసులో కూడా వహీదా రెహమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
అద్భుతమైన డ్యాన్స్కు పేరు సంపాదించిన ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ , భారతీయ సినిమాకు ఆమె చేసిన గణనీయమైన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది.
Claim :A viral video shows a Bollywood actress dancing at the age of 85
Fact :The woman seen in the video is not Waheeda Rehman, she is a dancer named Sunila Ashok.
అద్భుతమైన డ్యాన్స్కు పేరు సంపాదించిన ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ , భారతీయ సినిమాకు ఆమె చేసిన గణనీయమైన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు.
వహీదా రెహమాన్ 85 ఏళ్ల వయసులో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నట్టు కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. గైడ్ సినిమాలోని పాపులర్ పాటకు ఓ మహిళ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది ఆమె వహీదా రెహమాన్ అని.. 85 సంవత్సరాల వయసులో కూడా వహీదా రెహమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ “వహీదా రెహమాన్.. ఆమె 28 సంవత్సరాల వయస్సులో చేసిన పాటలకు 85 సంవత్సరాల వయస్సులో కూడా అద్భుతంగా నృత్యం చేస్తున్నారు. ఆమె సినిమా రంగంలో చేసిన కృషికి గానూ ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు." అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వీడియోలో డ్యాన్స్ చేస్తున్న మహిళ వహీదా రెహమాన్ కాదు, ఆమె సునీలా అశోక్ అనే ఆర్టిస్ట్.
జాగ్రత్తగా గమనించగా.. ఫేస్బుక్ పోస్ట్లలోని వీడియోలో ఉన్న మహిళ వహీదా రెహమాన్ కాదని తెలియజేశారు. వినియోగదారులు ఒరిజినల్ వీడియోకు సంబంధించిన YouTube వీడియో లింక్ను కూడా షేర్ చేసారు.
షేర్ చేసిన లింక్పై క్లిక్ చేసినప్పుడు, మయూఖా - ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై (డ్యాన్స్ కవర్) టైటిల్తో మయూఖా అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన అసలైన వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియోను జనవరి 2022లో అప్లోడ్ చేశారు. మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
యూట్యూబ్ లోని అబౌట్ పేజీలో చూడగా.. ఆ యూట్యూబ్ ఛానల్ డ్యాన్సర్ సునీల అశోక్ కు సంబంధించినదని తెలిపారు.
దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము Googleలో ఆమె పేరును వెతికినప్పుడు.. మాకు Instagram హ్యాండిల్ Mayookha_sunila కనిపించింది. ఈ హ్యాండిల్ బయోలో ఆమె పేరు సునీలా అశోక్, డాన్సర్ అని ఉంది.
హ్యాండిల్ లో వైరల్ వీడియోకు సంబంధించి.. “ఈ ఉదయం మేల్కొన్నాను, నా కుటుంబం, స్నేహితుల నుండి ఎన్నో మెసేజీలు వచ్చాయి. ‘ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై’ వీడియో వైరల్ అయినట్లుంది! వహీదా రెహమాన్ గారితో పోల్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను పొందుతున్న ప్రేమ, ప్రశంసలకు ఎంతగానో ఆనందిస్తున్నాను. అయితే మయూఖా మీకు ఇచ్చే ఒకే ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే.. మీ వయస్సుతో సంబంధం లేకుండా మీ అభిరుచిని కొనసాగించండి."
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది.. వహీదా రెహమాన్ కాదు.
News Summary - Video claiming showing Waheeda Rehman dancing to the tune of a song from Guide is FALSE
Claim : A viral video shows a Bollywood actress dancing at the age of 85.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story
|