About: http://data.cimple.eu/claim-review/6c4f039bd207ef8319d1f99887670a3940e753007dbd0c0eb4d8af98     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • వాస్తవ తనిఖీ: సిఎన్ఎన్ వాతావరణ మార్పు కథనముగా భావించబడే ఒక వైరల్ స్క్రీన్షాట్ నకిలీది వాతావరణ మార్పు సీజనల్ అని రాబోయే సంవత్సరములో తిరిగి వస్తుంది అని పేర్కొన్న సిఎన్ఎన్ హెడ్లైన్ యొక్క వైరల్ చిత్రము ఫాబ్రికేట్ చేయబడింది మరియు నకిలీది అమెరికన్ వార్తా ఛానల్ ఇటువంటి హెడ్లైన్ ను ప్రచురించలేదు. - By: Devika Mehta - Published: Sep 30, 2022 at 05:25 PM కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సిఎన్ఎన్ (కేబుల్ న్యూస్ నెట్వర్క్) కు చెందినదిగా భావించబడే ఒక వైరల్ స్క్రీన్షాట్ వాతావరణ మార్పు అనేది సీజనల్ అని రాబోయే వేసవిలో తిరిగి వస్తుంది. అయినప్పటికీ, విశ్వాస్ న్యూస్, తన విచారణలో, ఈ చిత్రము ఫాబ్రికేటెడ్ అని మరియు నకిలీది అని కనుగొనింది. అమెరికన్ వార్తా ఛానల్ ఇటువంటి వార్తను సెప్టెంబరు 4, 2022 నాడు తన వెబ్సైట్ పై షేర్ చేయలేదు. క్లెయిమ్ ఫేస్బుక్ యూజర్ కార్లిటో చాంబర్జ్ సెప్టెంబరు 12 నాడు సిఎన్ఎన్ కు చెందినది అని క్లెయిమ్ చేస్తూ ఒక స్క్రీన్షాట్ ను షేర్ చేశారు, ఆ క్లెయిమ్ ఈ విధంగా ఉంది, “వాతావరణ మార్పు రాబోయే వేసవిలో తిరిగి వస్తుంది, ప్రతి ఋతువులో వాతావరణ మార్పుల గురించి తెలియని వారందరి కోసం” ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు. విచారణ విశ్వాస్ న్యూస్ ఫేస్బుక్ పై సెర్చ్ చేసి ఇటువంటి క్లెయిమ్స్ చాలా ఇక్కడ మరియు ఇక్కడ కనబడుతున్నట్లుగా చక్కర్లు కొడుతున్నట్లు కనుగొనింది. మేము ముందుగా ఈ వార్తా కథనము గురించి తెలుసుకొనుటకు సిఎన్ఎన్ వెబ్సైట్ పై గూగుల్ కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించాము. అయితే, సిఎన్ఎన్ వారి వెబ్సైట్ ను సమీక్షించిన తరువాత, ఇటువంటి వ్యాసము ఏది కనబడలేదు. ఈ నివేదిక అమంద డేవీస్ మరియు బెన్ మోర్స్ యొక్క బైలైన్స్ కింద కనిపించలేదు. తరువాత, మేము సిఎన్ఎన్ వార్తా కథనాలను అదే బైలైన్, ప్రచురించబడిన తేదీ మరియు సమయములతో సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ సహాయముతో మేము ‘వాతావరణ మార్పును టాకిల్ చేయుటకు ప్రపంచము ‘మన ప్రవర్తనల గురించి పునరాలోచించాలి’ అని సెబాస్టియన్ వెట్టెల్ విశ్వసించారు’ అనే ఒక వార్తను చేరుకున్నాము. వైరల్ అయిన ఫేస్బుక్ క్లెయిమ్ ఒక ఎఫ్1 డ్రైవర్ సెబాస్టియన్ వెట్టెల్ పై సెప్టెంబరు 4, 2022 నాటి ఒక వ్యాసము నుండి మార్చబడిన చిత్రము. వాతావరణ మార్పు గురించిన ఎలాంటి ప్రస్తావన ఆ నివేదికలో లేదు. మేము ఆ వ్యాసము యొక్క అర్కైవ్డ్ స్క్రీన్షాట్ ను వేబ్యాక్ మెషీన్ పై (సెప్టెంబరు 4, 2022) పరీక్షించాము మరియు దానిపై ఎప్పుడూ ఎలాంటి మార్పులు చేయబడలేదు అని కనుగొన్నాము.’ “వాతావరణ మార్పు రాబోయే వేసవిలో తిరిగి వస్తుంది” అనే కీవర్డ్స్ ను ట్విట్టర్ పై అన్వేషించినప్పుడు, మాకు ట్విట్టర్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ మరియు ఆయన వ్యాఖ్యను ఇక్కడ మరియు ఇక్కడ, చూడవచ్చు. ‘ది ఫెర్రిమాన్స్ టోల్’ యూజర్ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము మరియు అతను ట్విట్టర్ లో జనవరి 2022 నాడు చేరారు అని తెలుసుకున్నాము, ఈ యూజర్ 93 మందిని ఫాలో చేస్తున్నారు మరియు 2762 మంది ఫాలోయర్స్ ఉన్నారు. అతని ఖాతా వివరణలో కూడా అతను ఒక ‘మీం టెర్రరిస్ట్’ అని ఉంది. ధృవీకరణ కొరకు, మేము మ్యాట్ డార్నిక్, హెడ్ ఆఫ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ , సిఎన్ఎన్ వరల్డ్ వైడ్, ను సంప్రదించాము, ఆయన ఫేస్బుక్ మెసెంజర్ పై ఇలా సమాధానం ఇచ్చారు, “ఈ చిత్రము నకిలీది. ప్రశ్నలోని కథనము ఎప్పుడు మన ప్లాట్ఫార్మ్స్ పై కనిపించలేదు మరియు బైలైన్డ్ రచయితలు వాతావరణాన్ని కవర్ చేయరు”. ముఖ్యంగా, ఫేస్బుక్ యూజర్ కార్లిటో చాంబర్జ్ యొక్క పోస్ట్ ను 11 మంది యూజర్లు షేర్ చేశారు. निष्कर्ष: వాతావరణ మార్పు సీజనల్ అని రాబోయే సంవత్సరములో తిరిగి వస్తుంది అని పేర్కొన్న సిఎన్ఎన్ హెడ్లైన్ యొక్క వైరల్ చిత్రము ఫాబ్రికేట్ చేయబడింది మరియు నకిలీది అమెరికన్ వార్తా ఛానల్ ఇటువంటి హెడ్లైన్ ను ప్రచురించలేదు. - Claim Review : సిఎన్ఎన్ కు చెందినదిగా భావించబడే ఒక స్క్రీన్షాట్ వాతావరణ మార్పు అనేది సీజనల్ అని రాబోయే సంవత్సరములో తిరిగి వస్తుంది అని క్లెయిమ్ చేసింది. - Claimed By : కార్లిటో చాంబర్జ్ - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software