About: http://data.cimple.eu/claim-review/843ca268a2db8b8c7787830fd711c1ac827dead87dbe74a3bd9d72a6     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Sep 13 2024 18:58:27 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: నీటిలో మొసళ్లు ఈదుతున్న వీడియో కు గుజరాత్ కు సంబంధం లేదు భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని వడోదరను వరదలు ముంచెత్తాయి. వరదలు, వర్షాలు కాకుండా, వడోదరలో విశ్వామిత్ర నది ప్రవహించిన తరువాత నివాస ప్రాంతాలలోకి ప్రవేశించిన మొసళ్ల సమస్య తీవ్రమైంది. నగరం మొత్తం వరదలతో నిండిపోయింది. Claim :గుజరాత్లోని వడోదర వరద నీటిలో మొసళ్లు ఈదుతున్న దృశ్యాలు Fact :ఈ వీడియో గుజరాత్లోని వడోదరకు చెందినది కాదు. ఇది ఆస్ట్రేలియాలోని ఈస్ట్ కింబర్లీలో చిత్రీకరించారు భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని వడోదరను వరదలు ముంచెత్తాయి. వరదలు, వర్షాలు కాకుండా, వడోదరలో విశ్వామిత్ర నది ప్రవహించిన తరువాత నివాస ప్రాంతాలలోకి ప్రవేశించిన మొసళ్ల సమస్య తీవ్రమైంది. నగరం మొత్తం వరదలతో నిండిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 అడుగుల మొసళ్లు కనిపించాయి. నగరంలో మొసళ్లను గుర్తించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటవీ శాఖ కార్యాలయానికి స్కూటర్పై ఇద్దరు వ్యక్తులు మొసలిని తరలించడాన్ని కూడా ప్రజలు రికార్డు చేశారు. ఇంతలో, నాలుగు మొసళ్లు ఈత కొడుతున్న దృశ్యం, ఒక మొసలి చనిపోయిన జంతువును నోటితో మోసుకెళ్లింది. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి కొన్ని ప్రధాన స్రవంతి మీడియా వెబ్సైట్లు కూడా ఈ వీడియోను షేర్ చేశాయి. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఆస్ట్రేలియాలోని ఈస్ట్ కింబర్లీకి చెందినది. ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో ఒకరు ఈ వీడియోను 'నాగరిక నగరమైన వడోదరను ఇప్పుడు మొసళ్ల నగరం అని కూడా పిలుస్తారు, ఇటీవలి వరదలలో మొసళ్లు కూడా వచ్చాయి. విశ్వామిత్రి నది నుండి వచ్చిన ఒకటి కాదు నాలుగు మొసళ్లు కనిపించాయి.' అని ఆ పోస్టు ఉంది. మేము ఈ పోస్ట్ కామెంట్స్ విభాగాన్ని గమనించినప్పుడు, donnydrysdale అనే వినియోగదారు 'వీడియో ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు' అని వ్యాఖ్యానించారు. దీని నుండి క్యూ తీసుకొని, మేము Instagram వినియోగదారు donnydrysdale కోసం సెర్చ్ చేసాం. వైరల్ వీడియో పొడవైన వెర్షన్ ఆగస్టు 7, 2024న ఈ Instagram ఖాతాలో ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. ఒక మొసలి చనిపోయిన జంతువును మోసుకెళ్తున్న వీడియోను అదే హ్యాండిల్ జూలై 15, 2024న పోస్ట్ చేసింది. మేము మరింత సెర్చ్ చేయగా CROC- కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రోకోడైల్స్ అనే పేజీలో ఒక పోస్ట్ కూడా కనిపించింది. పోస్ట్ @donnydrysdale Instagram ఖాతాని ట్యాగ్ చేసింది. croc.qld అనే మరో ఫేస్ బుక్ ఖాతా వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను “కింబర్లీలో క్రొకోడైల్ కొరియోగ్రఫీ” అనే శీర్షికతో షేర్ చేసింది. Donny Imberlong ఈ ఘటనను తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. తినడానికి మొసళ్లకు ఇచ్చినప్పుడు అవి ఎలా ప్రవర్తించాయో అందులో చూడొచ్చు. తనకు దొరికిన ఆహారాన్ని ఇతర మొసళ్లతో పంచుకోకూడదని మరో మొసలి నిర్ణయించుకోవడం మనం చూడొచ్చు. మొసళ్ళు తమ ఎరను ఇష్టపూర్వకంగా పంచుకోవు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక మొసలి మిగిలిపోయిన ఎరను ఇతర ప్రదేశంలోకి తీసుకుని పోతోంది. తన ఆహారాన్ని కాపాడుకోడానికి మొసళ్లు పలు వ్యూహాలను రచిస్తూ ఉంటాయని తెలిపారు. డోనీ ఇంబెర్లాంగ్ ఫేస్బుక్ పేజీ ‘Kids fighting over their food. Usually, the biggest croc has his share first” అనే క్యాప్షన్తో వీడియోను షేర్ చేసింది. వైరల్ అవుతున్న వీడియో గుజరాత్లోని వడోదరకు చెందినది కాదు. ఆస్ట్రేలియాలోని ఈస్ట్ కింబర్లీకి చెందినది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. News Summary - Viral video does not show Crocodiles in Vadodara, Gujarat floods Claim : గుజరాత్లోని వడోదర వరద నీటిలో మొసళ్లు ఈదుతున్న దృశ్యాలు Claimed By : Twitter users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Twitter Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software