schema:text
| - Tue Jan 07 2025 14:25:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 2025, ఫిబ్రవరి నెలలో అన్ని వారాలు నాలుగేసి రావడం 823 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుందనే ప్రచారం నిజం కాదు.
ఈ వాదన నిజం కాదు
Claim :2025, ఫిబ్రవరి నెల ప్రత్యేకం, 823 ఏళ్లకోసారి మాత్రమే అలా వస్తుంది
Fact :ఈ వాదన నిజం కాదు
ఫిబ్రవరి, సంవత్సరంలో రెండవ నెల. ఫిబ్రవరి నెలలో లీపు సంవత్సరాలలో 29 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరాల్లో 28 రోజులు. ఏడాదిలో అతి చిన్న నెల అయిన ఫిబ్రవరి విషయంలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది లీపు సంవత్సరం కాదన్న సంగతి తెలిసిందే. కాబట్టి, ఈ ఏడాది మొత్తం 28 రోజులు ఫిబ్రవరిలో ఉన్నాయి.
"ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్వీ శర్మ చెప్పారు." అంటూ సాక్షి వెబ్ సైట్లో ఓ కథనం కనిపించింది.
ఆ కథనం ఉన్న లింక్ ఇక్కడ మీరు చూడొచ్చు.
పలు సోషల్ మీడియా యూజర్లు కూడా ఇలా జరగడం అత్యంత అరుదు అంటూ పోస్టులు పెడుతున్నారు.
2025 ఫిబ్రవరి నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయని సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. 2025 ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు అలా అన్నీ నాలుగేసి వస్తాయని.. ఇది అత్యంత అరుదని చెప్పారు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గతంలో కూడా ఫిబ్రవరి నెలలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు ఇలా వచ్చాయి.
2025 సంవత్సరం ఫిబ్రవరి క్యాలెండర్ ను పరిశీలించాం. ఫిబ్రవరిలో ప్రతి వారం నాలుగు సార్లు వచ్చిందని కనుగొన్నాం. దీని వెనుక ఉన్న కారణాన్ని కనుగొనడానికి మేము ప్రయత్నించగా.. లీపు సంవత్సరం మినహా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు, వారానికి ఏడు రోజులు, కాబట్టి ప్రతి వారం నాలుగు సార్లు వస్తాయని తేలింది.
లీపు సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. దీని కారణంగా, నెలలో ఒకటి లేదా మరొక రోజు ఐదు సార్లు వస్తాయి. మిగిలిన రోజులు నాలుగు సార్లు వస్తాయి. మేము 2021, 2023 సంవత్సరాలలో ఫిబ్రవరి నెల క్యాలెండర్ ను చూశాం. అందులో కూడా ప్రతి వారం నాలుగేసి సార్లు వచ్చాయి. వాటిని మీరు ఇక్కడ చూడొచ్చు.

823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా వస్తుందా అని తెలుసుకోడానికి మేము సంఖ్యాశాస్త్రవేత్తను సంప్రదించాము. లీపు సంవత్సరం తప్ప ఫిబ్రవరిలో ప్రతి రోజు నాలుగు సార్లు వస్తుందని వివరించారు. ఇదేమీ అత్యంత అరుదైనదని చెప్పలేదు. కాబట్టి వైరల్ పోస్ట్లో నిజం లేదని గుర్తించాం.
2021లో కూడా ఇదే వాదనతో పోస్టులు వైరల్ అయ్యాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ చేసిన విషయాన్ని గుర్తించాం. దాన్ని ఇక్కడ చూడొచ్చు.
లీపు సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. ప్రతి వారం ఫిబ్రవరిలో నాలుగు సార్లు వస్తుంది. ఇది అరుదైన విషయం కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
News Summary - In 2025 all the weeks in the month of February will be four will happen only once in 823 years is not true
Claim : 2025, ఫిబ్రవరి నెల ప్రత్యేకం, 823 ఏళ్లకోసారి మాత్రమే అలా వస్తుంది
Claimed By : Social Media users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media, Media
Fact Check : False
Next Story
|