schema:text
| - Thu Feb 13 2025 01:47:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఐస్లాండ్లో అగ్నిపర్వత విస్ఫోటనం అంటూ చెబుతున్న వీడియో తప్పుదారి పట్టించేది
వేలాది ప్రకంపనలు, భూమి కంపించడం వంటి కారణాల వల్ల మత్స్యకార పట్టణం గ్రిందావిక్ను వారం రోజుల క్రితం ఖాళీ చేయించారు. గ్రిండావిక్.. 3,400 జనాభా ఉన్న పట్టణం.
Claim :ఐస్లాండ్లో ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించిన వీడియో.. ప్రజలను పెద్దఎత్తున తరలిస్తున్నారు
Fact :2021 సంవత్సరంలో ఫాగ్రాడల్స్ఫ్జల్ అగ్నిపర్వతం వద్ద చోటు చేసుకున్న ఘటనలను ఈ వీడియో చూపిస్తుంది
వేలాది ప్రకంపనలు, భూమి కంపించడం వంటి కారణాల వల్ల మత్స్యకార పట్టణం గ్రిందావిక్ను వారం రోజుల క్రితం ఖాళీ చేయించారు. గ్రిండావిక్.. 3,400 జనాభా ఉన్న పట్టణం. ఐస్ ల్యాండ్ రాజధాని రెక్జావిక్కు నైరుతి దిశలో 50 కిలోమీటర్లు (31 మైళ్ళు) దూరంలో ఉన్న రేక్జానెస్ ద్వీపకల్పంలో ఉంది. ఐస్లాండ్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ప్రసిద్ధి చెందిన కెఫ్లావిక్ విమానాశ్రయానికి చాలా దూరంలో లేదు.
సమీపంలోని బ్లూ లగూన్ జియోథర్మల్ రిసార్ట్, ఐస్లాండ్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అగ్నిపర్వతం పేలే అవకాశం ఉన్న కారణంగా నవంబర్ చివరి వరకు మూసివేస్తారు. ఇటీవలి వారాల్లో కూడా సమీపంలోని ఫాగ్రాడల్స్ఫ్జల్ అగ్నిపర్వతం చుట్టూ వేలాది ప్రకంపనలు నమోదయ్యాయి.
ఇంతలో, అగ్నిపర్వతం బద్దలవ్వడం చూసి కొందరు వ్యక్తులు పారిపోవడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఐస్లాండ్ - అగ్నిపర్వతం పేలడం ప్రారంభమవుతుంది. భారీ ఎత్తున ప్రజలను తరలిస్తూ ఉన్నారు” అనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇంతలో, అగ్నిపర్వతం బద్దలవ్వడం చూసి కొందరు వ్యక్తులు పారిపోవడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఐస్లాండ్ - అగ్నిపర్వతం పేలడం ప్రారంభమవుతుంది. భారీ ఎత్తున ప్రజలను తరలిస్తూ ఉన్నారు” అనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. వైరల్ అవుతున్న ఉన్న వీడియో ఇటీవలిది కాదు, ఇది 2021లో ఫాగ్రాడల్స్ఫ్జల్ అగ్నిపర్వతం వద్ద అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూపుతుంది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను ఉపయోగించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. “ఐస్లాండ్ లో అగ్నిపర్వతం పేలుతూ ఉంది.. ఇవి భయానక క్షణాలు. ఈ పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు? ” అనే అర్థం వచ్చేలా “Scary moments as a part of Iceland's newest volcano collapses. What would you do in this situation?” టైటిల్ తో మార్చి 22, 2021న ట్విట్టర్లో వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
21 మార్చి 2021న “Volcanic festival 2021” అనే శీర్షికతో షేర్ చేసిన పోస్టులను కూడా మేము కనుగొన్నాం. అనేక మంది పర్యాటకులు అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూస్తున్నారని ఆ చిత్రాల ద్వారా మేము కనుగొన్నాము.
మార్చి 22, 2021న bbc.comలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్ సమీపంలో అగ్నిపర్వతం పేలుడును చూడడానికి వేలాది మంది తరలివచ్చినట్లు ఓ చిత్రాన్ని షేర్ చేశారు. 800 సంవత్సరాలలో మొదటిసారి విస్ఫోటనం జరిగిందని.. మౌంట్ ఫాగ్రడాల్స్ఫ్జల్లో లావా బయటకు రావడం ప్రారంభించింది. అధికారులు ఈ ప్రాంతాన్ని మొదట బ్లాక్ చేశారు.. కానీ ఆ తరువాత ప్రజలు ట్రెక్ చేయడానికి అనుమతించారని మీడియా సంస్థలు తెలిపాయి.
అందువల్ల అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించిన వైరల్ వీడియో ఇటీవలిది కాదు... వీడియో 2021 సంవత్సరానికి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
అందువల్ల అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించిన వైరల్ వీడియో ఇటీవలిది కాదు... వీడియో 2021 సంవత్సరానికి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
News Summary - Video showing volcanic eruption in Iceland is MISLEADING
Claim : Video shows a recent volcanic eruption in Iceland and mass evacuations are underway
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story
|