Thu Nov 28 2024 14:27:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మహేంద్ర సింగ్ ధోని గౌరవార్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రూపాయల నాణేన్ని విడుదల చేయలేదు
మహేంద్ర సింగ్ ధోనికి అంకితం ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Claim :మహేంద్ర సింగ్ ధోనికి అంకితం ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రూపాయల నాణేన్ని విడుదల చేసింది
Fact :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి కాయిన్ ఏదీ విడుదల చేయలేదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కు సంబంధించిన మెగా వేలం ఇటీవల ముగిసింది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ లో ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వేలంపాటకు సంబంధించి ధోని సూచనలను చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ పాటించింది. స్లో, తక్కువ టర్న్ ఉండే చెపాక్ స్టేడియంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో కొనుగోలు చేసింది. ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ధోని సేన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను వేలం ప్రారంభ రోజున రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2009లో CSK కోసం అరంగేట్రం చేసిన అశ్విన్, 2010, 2011లో జట్టు టైటిల్ విన్నింగ్ క్యాంపెయిన్లో భాగమయ్యాడు. తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమైనందుకు, తిరిగి మహేంద్ర సింగ్ ధోనితో ఆడబోతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు అశ్విన్.
పలువురు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కూడా ధోనితో కలిసి ఆడబోతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు పోస్టు చేశారు. ఇక ధోని రాంచీలో ఉంటూ అప్పుడప్పుడు ఈవెంట్స్ కోసం ఇతర నగరాలకు వస్తూ ఉంటారు. ఇక ధోనిని రాంచీలో చూడడానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అభిమానులు ధోని ఇంటి ముందుకు వెళుతుంటారు.
ఇక మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గానూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా '7 రూపాయల నాణెం' విడుదల చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఓ వైపు ధోని చిత్రంతో టికెట్ కలెక్టర్ అని ఉండగా.. మరో వైపు 7 అనే నెంబర్ ను చూడొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మహేంద్ర సింగ్ ధోని పేరు మీద రిజర్వ్ బ్యాంకు ఎలాంటి కాయిన్ ను విడుదల చేయలేదు.
భారత ప్రభుత్వం కొత్తగా ఏదైనా కాయిన్ ను విడుదల చేసిందేమోనని తెలుసుకోడానికి గూగుల్ సెర్చ్ చేశాం. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'సంవిధాన్ దివస్' సందర్భంగా విడుదల చేసిన కాయిన్ గురించి కథనాలు దొరికాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత పార్లమెంట్ భవనంలో భారత రాజ్యాంగాన్ని "సంవిధాన్ దివస్"గా ఆమోదించిన 75వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, తపాలా బిళ్లను ఆమె విడుదల చేశారు. ఆమె రాజ్యాంగం సంస్కృత కాపీని కూడా ఆవిష్కరించారు.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో ప్రెస్ రిలీజెస్ విభాగాన్ని కూడా పరిశోధించాం. ఎక్కడా కూడా 7 రూపాయల కాయిన్ ను విడుదల చేస్తున్నట్లు, ఇప్పటికే విడుదల చేసేసినట్లు ఎలాంటి ప్రకటన కనిపించలేదు.
https://www.rbi.org.in/
వైరల్ ఇమేజ్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా PIB ఫ్యాక్ట్ చెక్ వైరల్ పోస్టులో ఎలాంటి నిజం లేదంటూ వివరణ ఇచ్చింది.
భారత క్రికెట్కు మహేంద్ర సింగ్ ధోని చేసిన సేవలకు గౌరవార్థం కొత్త ₹7 నాణెం విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఆర్థిక వ్యవహారాల శాఖ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని వివరించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏదైనా కాయిన్ ను ప్రవేశపెట్టినట్లయితే అది ఖచ్చితంగా హెడ్ లైన్స్ లో ఉండేదే. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు.
ఇక ఈ వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ కు చేసిన సేవలకు గానూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రూపాయల కాయిన్ ను విడుదల చేయలేదు.
News Summary - Fact Check Reserve Bank Of India Has Not Issued Rs 7 Coin In Honor Of Mahendra Singh Dhoni
Claim : మహేంద్ర సింగ్ ధోనికి అంకితం ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రూపాయల నాణేన్ని విడుదల చేసింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story