Wed Feb 12 2025 23:52:38 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వీడియో ఇటీవలిది కాదు
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వీడియో ఇటీవలిది కాదు
Claim :ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై షూ విసిరారు
Fact :ఐదు సంవత్సరాల కింద చోటు చేసుకున్న ఘటనను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం శివరాజ్సింగ్ చౌహాన్పై బూటు విసిరిన ఐదేళ్ల నాటి వీడియో ఇటీవల చోటు చేసుకున్నది గా తప్పుగా షేర్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్పై బూటు విసిరిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ ఘటన ఇటీవల జరిగిందని సోషల్ మీడియా యూజర్లు వీడియోను షేర్ చేశారు. "Current CM Shri Shivraj Singh Chouhan was welcomed with people hurling shoes at him." (ప్రస్తుత సిఎంశివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రజలు బూట్లు విసిరి స్వాగతం పలికారు) అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. 2018లో పోస్ట్ చేసిన అదే ఫుటేజీని కనుగొన్నాము, ఈ సంఘటన ఇటీవల చోటు చేసుకున్నది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
2018లో మధ్యప్రదేశ్లోని సిధిలో జరిగిన బహిరంగ సభలో సీఎం చౌహాన్పై ఓ వ్యక్తి చెప్పు విసిరినట్లు ఎన్డిటివి నివేదించింది. అది శివరాజ్ సింగ్ చౌహాన్కి తగలలేదు. ఈ ఘటన అనంతరం, భద్రతా సిబ్బంది వేదికపై ఆయనకు రక్షణగా నిలిచింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రసంగాన్ని ఆపివేశారు. చౌహాన్పై రాళ్లు రువ్వినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.
డెక్కన్ హెరాల్డ్, ది ట్రిబ్యూన్ కథనం ప్రకారం, ముఖ్యమంత్రిపై షూ విసిరిన వ్యక్తి ఎవరో తెలియనప్పటికీ, ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టానికి సవరణలను నిరసిస్తూ నిరసన తెలిపినట్లు కథనాలు ప్రసారం అయ్యాయి. షూ విసిరిన సంఘటనకు ముందు, పత్పరా గ్రామ సమీపంలో “జన్ ఆశీర్వాద్ యాత్ర” సందర్భంగా చౌహాన్ బస్సుపై రాళ్లు విసిరారు. వాహనంపై రాళ్లు రువ్విన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే విషయాన్ని 2018లో జీ న్యూస్ కూడా నివేదించింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై షూ విసిరినట్లు తప్పుడు వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. ఐదేళ్ల నాటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News Summary - Fact Check: Video of protest against Madhya Pradesh CM Shivraj Singh Chouhan is not recent
Claim : A shoe was thrown at MP CM Shivraj Singh Chouhan during a recent event
Claimed By : Social media users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story