About: http://data.cimple.eu/claim-review/b17c561f273e59596c3756bd15c5d0288c895b98ee72480335b785f1     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Mon Sep 16 2024 12:29:49 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్ తో కలిసి సంత్ ప్రేమానంద్ వీడియోలను చూడలేదు. వీడియోలు తప్పుడువి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్ మంత్రులతో కలిసి సంత్ ప్రేమానంద్ ప్రసంగాలు వింటున్నారని రెండు వేర్వేరు వీడియోలు యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోలలో, భారత ప్రధానితో పాటు అధికారులు, మంత్రులు టేబుల్ వద్ద కూర్చున్నారు. వారు సంత్ ప్రేమానంద్ వీడియో ప్లే అవుతూ ఉండగా ఆ వైపే చూస్తున్నట్లున్నారు. Claim :ఉన్నత స్థాయి సమావేశంలో కేబినెట్ మంత్రులతో కలిసి సంత్ ప్రేమానంద్ చేసిన ప్రసంగాన్ని భారత ప్రధాని మోదీ వీక్షిస్తున్నట్లు రెండు వీడియోలలో ఉన్నాయి. Fact :రెండు వీడియోలు మార్ఫింగ్ చేసినవి. సంత్ ప్రేమానంద్ ప్రసంగాన్ని మోదీ, ఆయన కేబినెట్ మంత్రులు చూడలేదు. ఒరిజినల్ వీడియోలలో మోదీ తన క్యాబినెట్తో హై లెవల్ మీటింగ్ లో ఉన్నట్లు చూపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్ మంత్రులతో కలిసి సంత్ ప్రేమానంద్ ప్రసంగాలు వింటున్నారని రెండు వేర్వేరు వీడియోలు యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోలలో, భారత ప్రధానితో పాటు అధికారులు, మంత్రులు టేబుల్ వద్ద కూర్చున్నారు. వారు సంత్ ప్రేమానంద్ వీడియో ప్లే అవుతూ ఉండగా ఆ వైపే చూస్తున్నట్లున్నారు. వైరల్ వీడియోలలో ఒకదానిలో విజువల్స్తో బ్యాక్గ్రౌండ్లో పాట ప్లే అవుతుండగా, రెండవ వీడియోలో, సంత్ ప్రేమానంద్ ప్రసంగాన్ని మనం వినవచ్చు, ప్రధాని మోదీతో పాటు మంత్రులు కూడా ప్రసంగాన్ని వింటున్నారని సూచిస్తుంది. తక్కువ వ్యవధి ఉన్న వీడియోలలో ఒక దాన్లో ప్రధాని మోదీ, తన క్యాబినెట్ తో కలిసి టీవీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ టీవీ పక్కన నిలబడి ఏదో వివరిస్తున్నారు. ఇక్కడ లింక్ ఉంది. వీడియో -1 మరొక వీడియోలో.. ప్రేమానంద్ మహారాజ్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గం శ్రద్ధగా వింటున్నట్లుగా మనం చూడవచ్చు. వీడియో -2 ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలలో ఎలాంటి నిజం లేదు. ఒరిజినల్ వీడియోలకు సంత్ ప్రేమానంద్ విజువల్స్ ను జోడించి.. ఎడిట్ చేశారు. వీడియో 1:వీడియోను నిశితంగా పరిశీలించగా, ఒరిజినల్ గా అక్కడ చోటు చేసుకున్న సమావేశానికి, స్క్రీన్ లో ఉన్న దానికి ఏ మాత్రం సంబంధం లేదని మేము గుర్తించాం. సంత్ ప్రేమానంద్ వీడియోను అక్కడ ఎడిట్ చేయడంలో కూడా కొన్ని తప్పిదాలు కనిపించాయి. మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను సెర్చ్ చేయగా.. అక్టోబర్ 17, 2023న గగన్యాన్ మిషన్ కి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన వీడియోను మేము కనుగొన్నాము. "PM Modi chairs high-level meeting on the progress of Gaganyaan Mission | ISRO | S. Somanath" అనే టైటిల్ తో మేము అసలు వీడియోను కనుగొన్నాం. భారతదేశ గగన్యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును వివరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినట్లు వీడియో వివరణలో తెలిపారు. గగన్యాన్ మిషన్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, త్వరలో చేపట్టబోయే ప్రయోగాల గురించి అందులో చర్చించారని స్పష్టంగా తెలుస్తోంది. ET government.com ప్రచురించిన ఒక కథనం ప్రకారం, అంతరిక్ష శాఖ ఇప్పటివరకు అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికతలతో సహా గగన్యాన్ మిషన్ కు సంబంధించిన సమాచారాన్ని అందించింది. ANI న్యూస్ లో కూడా భారత అంతరిక్ష మిషన్స్ కు సంబంధించిన ఎన్నో విషయాల గురించి చర్చించారని తెలిపింది. 2035 నాటికి భారతదేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండాలని, 2040 నాటికి చంద్రునిపైకి మనిషిని పంపించడం లాంటి ఎన్నో అంశాల గురించి జరిగిన కీలక సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారని అందులో తెలిపారు. PMO India ద్వారా కూడా వీడియోను పబ్లిష్ చేశారు వీడియో -2మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి సేకరించిన కీలక ఫ్రేమ్ల ద్వారా.. బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం గురించి పరిస్థితిని సమీక్షించడానికి క్యాబినెట్ నేతలను ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో జూన్ 3, 2023న నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారని వీడియో వివరణ పేర్కొంది. పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ ఒడిశాకు వెళ్తున్నట్లు కూడా వీడియోలో తెలిపారు. జీ న్యూస్ ఇండియా కూడా వీడియోను షేర్ చేసింది. "Odisha Train Accident: PM Narendra Modi Chairs High-Level Meeting To Review Balasore Train Accident" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. ప్రధాని మోదీ హై లెవల్ మీటింగ్ ను నిర్వహించారని అందులో తెలిపారు. కాబట్టి, వైరల్ వీడియోలను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్ మంత్రులు ఉన్నత స్థాయి సమావేశంలో సంత్ ప్రేమానంద్ ప్రసంగాలను చూడలేదు. రెండు వేర్వేరు వీడియోలను తప్పుడు వాదనలతో కూడిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. News Summary - Videos showing PM and Cabinet watching discourse by Sant Premanand at a high-level meeting are doctored Claim : Two videos show Indian Prime Minister Modi watching discourse by Sant Premanand along with Cabinet ministers during a high-level meeting Claimed By : Youtube Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Youtube Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software