schema:text
| - Wed Feb 19 2025 14:43:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీజేపీ అధికారం లోకి రాగానే ఢిల్లీలో మెట్రో రైలు ఛార్జీలను పెంచలేదు
బీజేపీ అధికారం లోకి రాగానే ఢిల్లీలో
Claim :
బీజేపీ అధికారం లోకి రాగానే ఢిల్లీలో మెట్రో ఛార్జీలను పెంచారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 70 మంది సభ్యుల సభలో 48 సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 22 సీట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గెలుచుకుంది. ఇక 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో BJP తిరిగి అధికారంలోకి వచ్చింది. కొత్త ఢిల్లీ సీఎంను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 19న బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారని, ఫిబ్రవరి 20న సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20న రాంలీలా మైదాన్‌లో జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి పదవి రేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. న్యూఢిల్లీ స్థానం నుండి జరిగిన ఎన్నికల్లో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ రేసులో ఉన్నారు. పవన్ శర్మ, ఆశిష్ సూద్, రేఖా గుప్తా, శిఖరాయ్ తదితరుల పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి.
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఇంకా అధికారం లోకి రాకముందే మెట్రో ట్రైన్ ఛార్జీలను పెంచేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"दिल्ली में बिपता शुरू हो गई है मेट्रो का किराया बढ़ा दिया बीजेपी ने।।
नई दिल्ली सरकार का नया तोहफ़ा।।" అంటూ పోస్టులు పెట్టారు.
ఒక ఎక్స్ హ్యాండిల్, @bansaldeepak19 హిందీలో ఢిల్లీ మెట్రో ఛార్జీలు పెరిగాయని పేర్కొంటూ గ్రాఫిక్ కార్డు ను పోస్ట్ చేశారు. "ఢిల్లీలో కష్టాలు మొదలయ్యాయి, బీజేపీ మెట్రో ఛార్జీలను పెంచింది. న్యూఢిల్లీ ప్రభుత్వం నుండి కొత్త బహుమతి" అని హిందీలో క్యాప్షన్ ఉంచారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీ మెట్రో ధరలను పెంచినట్లుగా ఎలాంటి నివేదికలు మాకు లభించలేదు.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్లో కూడా మెట్రో ఛార్జీల పెంపుపై ఎలాంటి ప్రకటన మాకు కనిపించలేదు.
ఇక మేము ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక అధికారిక ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయగా ఫిబ్రవరి 12న "This is in reference to some social media posts claiming that Delhi Metro fares have been revised. Delhi Metro's fares can only be revised by an independent Fare Fixation Committee which is nominated by the Government. Presently there is no such proposal for the constitution of any Fare Fixation Committee.." అంటూ పోస్టు కనిపించింది. ఢిల్లీ మెట్రో ఛార్జీలను ప్రభుత్వం నామినేట్ చేసిన స్వతంత్ర ఛార్జీల ఫిక్సేషన్ కమిటీ మాత్రమే సవరించగలదని అందులో ఉంది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.
ఇక వైరల్ గ్రాఫిక్ కార్డు 2017 నుండి ఆన్ లైన్ లో ఉందని మేము ధృవీకరించాం.
जानें कितना बढ़ा दिल्ली मेट्रो का किराया, अब क्या रास्ता అంటూ నవ భారత్ టైమ్స్ కథనంలో ఇదే ఫోటోను ఉంచారు. అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు. అక్టోబర్ 10, 2017 న NBT హిందీ వార్తా నివేదికలో వైరల్ ఫోటోను గుర్తించాం.
కాబట్టి, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో ధరలను పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : బీజేపీ అధికారం లోకి రాగానే ఢిల్లీలో మెట్రో ఛార్జీలను పెంచారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|