About: http://data.cimple.eu/claim-review/743ca39c64cb204d4e6427f58c088894d78550b4f5e64b10a9929b1e     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Sat Sep 28 2024 14:05:01 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: రేటింగ్స్ సరిగా రాలేదని దేవర సినిమా కటౌట్ ను తగలబెట్టలేదు. టపాసులు కాల్చినప్పుడు మంటలు అంటుకున్నాయి. టపాసులు కాల్చిన తర్వాత ఎగిరిన నిప్పురవ్వల కారణంగా కటౌట్ కు Claim :రేటింగ్స్ సరిగా ఇవ్వలేదని, సినిమా బాగా లేదని దేవర సినిమా కటౌట్ ను తగలబెట్టారు Fact :టపాసులు కాల్చిన తర్వాత ఎగిరిన నిప్పురవ్వల కారణంగా కటౌట్ కు మంటలు అంటుకున్నాయి జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమా థియేటర్లలో నేడు విడుదలైంది. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన సినిమా దేవర: పార్ట్ 1. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టింగ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా దేవర సినిమాను మొదటి రోజే చూడడం కోసం అభిమానులు ఎగబడ్డారు. అర్ధరాత్రి 1 గంటలు పలు చోట్ల షోలు పడ్డాయి. హిట్ టాక్ రావడంతో అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమా ఫస్ట్ షో (బెనిఫిట్ షో) ప్రదర్శించడంలో జాప్యం జరగడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలోని పలోంచ వద్ద వెంకటేశ్వర థియేటర్ను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే అభిమానులు థియేటర్కి చేరుకున్నారు కానీ 5.30 గంటలకు ప్రదర్శించాల్సిన సినిమా 7.30కి కూడా ప్రదర్శించలేదు. దీంతో కొందరు యువకులు థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో టిక్కెట్టు ధర రూ.250 కాగా బ్లాక్లో రూ.500 టికెట్లు కొన్నామని అభిమానులు తెలిపారు. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులను మోసం చేసిందని ఆరోపిస్తూ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన థియేటర్పై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఒకే టిక్కెట్ను ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు థియేటర్ యాజమాన్యం విక్రయించిందని ఫిర్యాదు చేశారు. థియేటర్ కిక్కిరిసిపోవడంతో చాలా మంది నిలుచుని సినిమా చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కటౌట్ కాలిపోతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. సినిమా బాగోలేదని కొందరు కటౌట్ కు నిప్పు పెట్టారంటూ కొన్ని అకౌంట్లలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. దేవర సినిమా ఫస్ట్ షో (బెనిఫిట్ షో) ప్రదర్శించడంలో జాప్యం జరగడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలోని పలోంచ వద్ద వెంకటేశ్వర థియేటర్ను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే అభిమానులు థియేటర్కి చేరుకున్నారు కానీ 5.30 గంటలకు ప్రదర్శించాల్సిన సినిమా 7.30కి కూడా ప్రదర్శించలేదు. దీంతో కొందరు యువకులు థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో టిక్కెట్టు ధర రూ.250 కాగా బ్లాక్లో రూ.500 టికెట్లు కొన్నామని అభిమానులు తెలిపారు. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులను మోసం చేసిందని ఆరోపిస్తూ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన థియేటర్పై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఒకే టిక్కెట్ను ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు థియేటర్ యాజమాన్యం విక్రయించిందని ఫిర్యాదు చేశారు. థియేటర్ కిక్కిరిసిపోవడంతో చాలా మంది నిలుచుని సినిమా చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కటౌట్ కాలిపోతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. సినిమా బాగోలేదని కొందరు కటౌట్ కు నిప్పు పెట్టారంటూ కొన్ని అకౌంట్లలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. టపాసులు ఎక్కువగా కాల్చడం వలన కటౌట్ కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మేము కీవర్డ్ సెర్చ్ చేశాం. ఎన్టీఆర్ కటౌట్ తగలబడిందన్న కథనాన్ని పలు మీడియా సంస్థలు పంచుకున్నాయి. సినిమా విడుదల సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర అపశృతి చోటు చేసుకుందని మీడియా కథనాలు తెలిపాయి. థియేటర్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు అంటుకుందని తెలిపారు. సినిమా నచ్చని కొంతమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ కటౌట్ ను తగలబెట్టారంటూ ప్రచారం కూడా జరిగినా టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు కటౌట్ కు నిప్పు అంటుకుందని తెలుగు మీడియా సంస్థలు తెలిపాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. పలు ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీలు, కొన్ని తెలుగు మూవీ పేజీలు కూడా వైరల్ పోస్టులను ఖండిస్తూ పోస్టులు పెట్టాయి. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కటౌట్ ముందు భారీగా టపాసులు కాల్చారు. ఈ క్రమంలో అనుకోకుండా కటౌట్ కి నిప్పు అంటుకొని చూస్తుండగానే ఒక్కసారిగా కాలి పోయింది. అక్కడున్న అభిమానులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లోనే దగ్దమైందని వివరించారు. పలు ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీలు, కొన్ని తెలుగు మూవీ పేజీలు కూడా వైరల్ పోస్టులను ఖండిస్తూ పోస్టులు పెట్టాయి. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కటౌట్ ముందు భారీగా టపాసులు కాల్చారు. ఈ క్రమంలో అనుకోకుండా కటౌట్ కి నిప్పు అంటుకొని చూస్తుండగానే ఒక్కసారిగా కాలి పోయింది. అక్కడున్న అభిమానులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లోనే దగ్దమైందని వివరించారు. సుదర్శన్ థియేటర్ సినిమా సిబ్బందిని ఈ ఘటన గురించి సంప్రదించాం. వారు ఈ ఘటన కేవలం అపశ్రుతి మాత్రమేనని వివరణ ఇచ్చారు. నందమూరి అభిమానులు భారీగా బాణా సంచా కాల్చారని, ఆ నిప్పు రవ్వలు ఎగిరి కటౌట్ ను తాకాయని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారని తెలిపారు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. News Summary - Devara movie cut-out was not burnt in Hyderabad because the ratings were not good. due to crackers burning Claim : రేటింగ్స్ సరిగా ఇవ్వలేదని, సినిమా బాగా లేదని దేవర సినిమా కటౌట్ ను తగలబెట్టారు Claimed By : social media users Claim Reviewed By : Telugupost Claim Source : social media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software