Fri Oct 25 2024 15:39:22 GMT+0000 (Coordinated Universal Time)
Fact check: బహిరంగంగా చేస్తున్న నమాజ్ ను రాజా సింగ్ అడ్డుకోవడంతో పోలీసులు అరెస్టు చేశారా..?
హైదరాబాద్ లో ఓ ఆలయ సమీపంలోని ప్రధాన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లిం సభ్యులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు బీజేపీ ఎమ్మెల్యేను ఇటీవల అరెస్టు చేసినట్లు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఓ ఆలయ సమీపంలోని ప్రధాన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లిం సభ్యులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు బీజేపీ ఎమ్మెల్యేను ఇటీవల అరెస్టు చేసినట్లు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇటీవల గురుగ్రామ్ ప్రాంతంలో నమాజ్ వివాదం నడిచింది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తున్న ముస్లింలను హిందూ సంఘాలు, స్థానిక నివాసితులు అడ్డుకున్నారు. బహిరంగ ప్రాంతంలో ప్రతీ శుక్రవారం ప్రార్థనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ వీడియోలో రాజా సింగ్ ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పుడు.. పోలీసు సిబ్బంది ఆయన్ను పోలీసు వాహనంలోకి ఎక్కించుకోవడం మనం గమనించవచ్చు.
వైరల్ వీడియోలో రాజా సింగ్ ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పుడు.. పోలీసు సిబ్బంది ఆయన్ను పోలీసు వాహనంలోకి ఎక్కించుకోవడం మనం గమనించవచ్చు.
సోషల్ మీడియా వినియోగదారులు ఈ పోస్ట్ను ఇటీవల జరిగిన సంఘటనగా పేర్కొంటూ షేర్ చేశారు. హిందీ లో వైరల్ పోస్టు ఉంది. 'హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన మీ కళ్ళు తెరిపిస్తుంది. హైదరాబాద్లోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను నిన్న రాత్రి అరెస్టు చేశారు. కారణం ఏమిటి? మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఒక సమూహం మూడు రోజుల నుండి ఆలయానికి సమీపంలోని ప్రధాన రహదారిపై నమాజ్ చేయడం ప్రారంభించింది. హైదరాబాద్ మైనారిటీ ఆధారిత ప్రాంతం. బీజేపీ ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఎలా అరెస్ట్ చేశారో చూడండి? ఆదేశాలు ఇచ్చిన పోలీసు అధికారి స్వయంగా పోలీసు కమీషనరే. ఎమ్మెల్యే రాజాసింగ్తో పోలీసు సిబ్బంది ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఇక సామాన్యుడికి ఏమవుతుందో ఊహించారా? భారత మాతాకీ జై' అంటూ వైరల్ పోస్టు ఉంది.
నిజ నిర్ధారణ:ఈ వైరల్ పోస్టు గత కొద్దిరోజులుగా వైరల్ అవుతూ ఉంది. మేము ఈ వైరల్ పోస్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి గూగుల్ ను ఆశ్రయించాము. ఇటీవలి కాలంలో రాజా సింగ్ ను అరెస్టు చేసినట్లు ఏ వెబ్ సైట్ కూడా నిర్ధారించలేదు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లను కూడా చూశాము.. అందులో ఆయన ఇలాంటి ఘటన విషయంలో అరెస్టు అయినట్లు కూడా చూపించలేదు.
ఇక రాజా సింగ్ అరెస్టు అంటూ కీవర్డ్ శోధన చేయగా వైరల్ అవుతున్న విజువల్స్ తో మ్యాచ్ అయ్యే ఘటన ఇప్పుడు చోటు చేసుకున్నది కాదు. రాజా సింగ్ అరెస్టు గురించి మే 6, 2019న ప్రచురించబడిన NDTV వార్తా నివేదిక కనుగొనబడింది. మే 5, 2019న అప్లోడ్ చేసిన ఇలాంటి విజువల్స్ను చూపించే వీడియోను పోస్ట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ కూడా ఉంది. రహదారిపై అక్రమ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని అంబర్పేటలో కార్యకర్తలతో కలిసి చేసిన నిరసన కార్యక్రమంలో రాజా సింగ్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అరెస్టు చేశారని మేము తెలుసుకున్నాము.
రాజా సింగ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
వైరల్ వీడియో కీలక ఫ్రేమ్లలో ఒకదానిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ కూడా చేసాము. మే 6, 2019న అప్లోడ్ చేసిన YouTube ఛానెల్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కనుగొన్నాము.
"A BJP legislator in Telangana was among those taken into police custody in Hyderabad on Sunday after clashes over the setting up of a shed on a land where a place of worship was demolished." అంటూ NDTV నివేదిక పేర్కొంది.
పరిస్థితి గురించి ఆరా తీయడానికి రాజా సింగ్ ఆ ప్రాంతానికి వచ్చారని నివేదిక పేర్కొంది. ఔట్లుక్ ఇండియా కూడా మే 6, 2019న సంఘటన గురించి ఒక నివేదికను ప్రచురించింది.
కాబట్టి వైరల్ వీడియోకు.. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ కు సంబంధించి రాజా సింగ్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు అనే వైరల్ పోస్టులకు ఎటువంటి సంబంధం లేదు. https://www.boomlive.in/ సంస్థ కూడా ఈ ఘటనపై నిజ నిర్ధారణ చేసింది.
Claim : బహిరంగంగా చేస్తున్న నమాజ్ ను రాజా సింగ్ అడ్డుకోవడంతో పోలీసులు అరెస్టు చేశారా..?
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
News Summary - Video claiming that the BJP MLA was arrested recently for protesting against members of Muslim community who were offering namaz
- Tags
- telugupost
Next Story