About: http://data.cimple.eu/claim-review/0cf139b6d09ea94a6f105e4051dc5b28be527ae059cf5874bc77f8aa     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Wed Feb 12 2025 19:02:30 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ పోలీసులు కూల్ డ్రింక్స్ కు సంబంధించి ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు బాటిలింగ్ యూనిట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రక్తం పానీయాలలో కలిసిపోయిందని.. అతడి రక్తంలో ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ కూడా ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. Claim :Hyderabad police advise the public to avoid consuming soft drinks as an employee has mixed blood contaminated with Ebola to the beverages. Fact :Hyderabad police advise the public to avoid consuming soft drinks as an employee has mixed blood contaminated with Ebola to the beverages1. బాటిలింగ్ యూనిట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రక్తం పానీయాలలో కలిసిపోయిందని.. అతడి రక్తంలో ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ కూడా ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ కారణం వలన ఆ ‘శీతల పానీయాల’ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై హైదరాబాద్ పోలీసులు ప్రజలను హెచ్చరించినట్లు వాట్సాప్లోని వైరల్ సందేశం పేర్కొంది. ఆ మెసీజీ “Please forward this information Hyderabad police all over India. Please do not drink soft drinks like Maja, CoCo Cola, 7up, Thumsup, Pepsi, Sprite etc because one of the company’s workers mixed the contaminated blood of the dangerous virus called Ebola in it. (sic)” ఈ రూపంలో ఉంది. మజా, కోకో కోలా, 7అప్, థమ్సప్, పెప్సీ, స్ప్రైట్ మొదలైన కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు ఆ మెసేజీలో ఉంది. ఈ వార్తను మీడియా సంస్థ ఎన్డిటివి కూడా నివేదించిందని సందేశంలో పేర్కొన్నారు. ఫ్యాక్ట్ చెకింగ్: మేము హైదరాబాద్ పోలీసుల అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేసాము, కానీ శీతల పానీయాల వినియోగానికి సంబంధించిన ఎటువంటి హెచ్చరికలు కనుగొనలేదు. హైదరాబాద్ పోలీసుల సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కూడా ఎటువంటి నోటీసులు కనిపించలేదు. ఎబోలా సోకిన వ్యక్తి రక్తంతో కలిపిన శీతల పానీయాల గురించి ఎన్డిటివి ద్వారా ఎటువంటి వార్తలు ప్రసారం కాలేదు. ఒక ఉద్యోగి పానీయాలలో ఎబోలాతో కలుషితమైన రక్తాన్ని కలిపినట్లు విశ్వసనీయమైన వార్తా నివేదిక కూడా కనిపించలేదు. ఈ సందేశం బూటకము. కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్లో వైరల్ అవుతోంది. 2019లో కూడా అదే మెసేజీ వైరల్ అయింది. ఆ సమయంలో, హైదరాబాద్ నగర పోలీసులు శీతల పానీయాలపై తాము ఓ ప్రకటన చేశామంటూ నకిలీ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారంటూ.. ఒక ప్రకటన విడుదల చేశారు. వైరల్ సందేశం పై హైదరాబాద్ పోలీసులు స్పందిస్తూ.. “కూల్ డ్రింక్స్ గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతుంది. హైదరాబాద్ నగర పోలీసులకు సంబంధించిన హెచ్చరిక నకిలీది. హైదరాబాద్ నగర పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి సందేశాన్ని విడుదల చేయలేదు (sic)." అని తెలిపారు. కొన్ని కంపెనీలకు చెందిన శీతల పానీయాలు తీసుకోకుండా ఉండాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలను కోరుతూ సూచనలేవీ విడుదల చేయలేదు. PIB ఫాక్ట్ చెక్ విభాగం కూడా వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం అటువంటి సలహా ఏదీ జారీ చేయలేదని పేర్కొంది. PIB ఫాక్ట్ చెక్ విభాగం కూడా వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం అటువంటి సలహా ఏదీ జారీ చేయలేదని పేర్కొంది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. News Summary - Hyd police did not issue any advisory on consumption of Ebola-laced soft drinks Claim : Hyderabad police advise the public to avoid consuming soft drinks as an employee has mixed blood contaminated with Ebola to the beverages. Claimed By : Whatsapp users Claim Reviewed By : Telugupost Network Claim Source : Whatsapp Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software