schema:text
| - Thu Jul 18 2024 21:43:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఈ ఏడాది ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు షెడ్యూల్ చేశారు. 44 రోజుల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4, 2024న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
Claim :ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2024 లోక్ సభ ఎన్నికల కారణంగా UAEకి మార్చనున్నారు
Fact :ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని, మ్యాచ్‌లను యూఏఈకి మార్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు షెడ్యూల్ చేశారు. 44 రోజుల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4, 2024న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మార్చి 22, 2024న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 2024 ఏప్రిల్ 7 వరకు జరిగే మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియాలో మిగిలిన మ్యాచ్‌లపై పలు పుకార్లు మొదలయ్యాయి. కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఎన్నికల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని మిగిలిన మ్యాచ్‌లు UAEకి షిఫ్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారని పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు.
"ఎన్నికల కారణంగా ఐపీఎల్ ని యూఏఈకి మార్చనున్నారు, కాబట్టి ధోని ఐపీఎల్- 2025లో కూడా ఆడనున్నాడు, అతని చివరి మ్యాచ్ చెపాక్‌లో ఉంటుందని ధోని చెప్పాడు." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
"ఎన్నికల కారణంగా ఐపీఎల్ ని యూఏఈకి మార్చనున్నారు, కాబట్టి ధోని ఐపీఎల్- 2025లో కూడా ఆడనున్నాడు, అతని చివరి మ్యాచ్ చెపాక్‌లో ఉంటుందని ధోని చెప్పాడు." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
IPL is set to be shifted to the UAE due to elections, so Dhoni will be playing in IPL 2025 as well, as he said his last match will be in Chepauk. pic.twitter.com/gQpqQ4fqIT— Yash MSdian ™️ 🦁 (@itzyash07) March 16, 2024
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. టోర్నీ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించిన అనేక వార్తా నివేదికలను మేము కనుగొన్నాము.
హిందుస్థాన్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, BCCI కార్యదర్శి జే షా ఈ పుకార్లను కొట్టివేసారు. IPL 2024 మొత్తం సీజన్ భారతదేశంలో నిర్వహిస్తామని ధృవీకరించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత క్రిక్‌బజ్‌తో మాట్లాడిన జే షా, ఐపీఎల్ 2024 రెండో అర్ధభాగం విదేశాల్లో జరుగుతుందనే ఊహాగానాలను తోసిపుచ్చారు. "లేదు, టోర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించము." అని ఆయన అన్నారు.
క్రిక్‌బజ్ వెబ్సైట్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విదేశాలలో నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ధృవీకరించింది. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మారవచ్చని కొన్ని నివేదికలు సూచించిన తర్వాత ఈ క్లారిటీ బీసీసీఐ నుండి వచ్చింది.
IPL ఛైర్మన్ అరుణ్ ధుమల్ ఈ ఏడాది ఐపీఎల్ ను దుబాయ్ లో నిర్వహిస్తారనే వాదనలను ఖండించారని డెక్కన్ హెరాల్డ్ కూడా నివేదించింది. ఐపీఎల్‌ను ఇతర దేశాలకు మార్చడం లేదని, మిగిలిన షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటిస్తామని ధుమాల్ పిటిఐకి తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ ద్వితీయార్ధం యూఏఈకి మారుస్తారన్న వాదన అవాస్తవం. ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లో మాత్రమే నిర్వహించనున్నారు.
News Summary - IPL 2024 will be staged only in India
Claim : Indian Premier League 2024 is set to shift to UAE due to upcoming general elections
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story
|