Wed Feb 12 2025 17:43:10 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నోట్ల కట్టలతో టీడీపీ నేత నారా లోకేష్ పట్టుబడ్డాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు
టీడీపీ నేత నారా లోకేష్ పట్టుబడ్డాడంటూ వైరల్ అవుతున్న
Claim :టీడీపీ నేత నారా లోకేష్ నోట్ల కట్టలతో పోలీసులకు పట్టుబడ్డారు
Fact :మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు దొరికిందని ఎలాంటి కథనాలు రాలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపిస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు, ప్రచార సామాగ్రిని తీసుకుని వెళ్తుంటే వెంటనే సీజ్ చేస్తున్నారు.
తాడేపల్లి వద్ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అనుసరించి బ్లాక్ ఎక్స్యూవీని పోలీసులు సెర్చ్ చేశారు. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు “ నోట్ల కట్టలతో పట్టుబడ్డ నారా లోకేష్ నాయుడు” అంటూ వీడియోను పంచుకున్నారు.
నారా లోకేష్ కాన్వాయ్ ను ఆపిన పోలీసులు.. అందులోని వాహనాలను వెతుకుతూ ఉండడం మనం గమనించవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియో నుండి తీసుకున్న స్క్రీన్ షాట్స్ ను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో మార్చి 20, 2024న ANI ద్వారా వెబ్కాస్ట్ చేశారని మేము కనుగొన్నాము. అయితే సెర్చ్ చేసిన సమయంలో ఎలాంటి నగదు కూడా దొరకలేదని అధికారులు తెలిపారు.
తదుపరి విచారణలో.. టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చి 21, 2024న ప్రచురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. “నారా లోకేష్ కాన్వాయ్ వాహనాలను అధికారులు సోదాలు చేశారు, తాడేపల్లి పోలీసులు కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్లోని వాహనాలను సోదా చేశారు. ఎంసీసీలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. లోకేష్ కాన్వాయ్ వాహనంలో ఎలాంటి నగదు, నిషేధిత సామగ్రి లభించలేదు." అని అందులో తెలిపారు.
అనేక మీడియా సంస్థలు కూడా లోకేష్ కాన్వాయ్ లో సోదాలు జరిగాయని కథనాలను ప్రసారం చేశాయి. ఈ వీడియోను కూడా అప్లోడ్ చేశాయి. అయితే కాన్వాయ్ లో నగదు దొరికిందంటూ ఎలాంటి కథనాలను ప్రసారం చేయలేదు.
పలు తెలుగు మీడియా వెబ్ సైట్స్ కూడా కథనాలను పోస్టు చేశాయి.
https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tadepalli-police-searched-nara-lokeshs-convoy-vehicles-152731
https://www.telugubulletin.com/lokeshs-convoy-stopped-for-3rd-time-199172
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. నారా లోకేష్ వాహనంలో ఎలాంటి నగదు దొరకలేదు.
News Summary - Fact Check Claim that bundles of cash were found in Nara Lokesh convoy is False
Claim : TDP leader Nara Lokesh caught with bundles of notes by police
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story