Mon Feb 10 2025 14:33:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇంద్రవెల్లిలో వింత జంతువు విహారం అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
ఇంద్రవెల్లిలో కనిపించింది వింత జంతువు కాదు
Claim :
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వింత జంతువు తిరుగుతూ ఉందిFact :
ఇంద్రవెల్లిలో కనిపించింది వింత జంతువు కాదు.. పునుగుపిల్లిఓ జంతువు వీధుల్లో తచ్చాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇంటి గేట్ లను ఎక్కుతూ కనిపించింది. సీసీటీవీలో ఆ జంతువు కదలికలు రికార్డు అయ్యాయి.
"ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వింత జంతువు విహారం..." అంటూ వీడియో మీద ఉండగా.. సోషల్ మీడియా పోస్టులో..
"ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వింత జంతువు విహారం...
నిన్న రాత్రి వీధుల్లో తిరుగుతూ భయంభ్రంతులకు గురిచేసిన వింత జంతువు...
కుక్క పిల్లలను అమాంతం మింగేస్తూ సంచరిస్తుందంటున్న స్థానికులు...
గత రాత్రి వీధులలో వింత జంతువు తిరుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డైనా దృశ్యాలు...
సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ గా మారడం తో వ్యాపించిన వదంతులు...
వింత జంతువు సంచారం, వదంతులతో భయ భ్రంతులకు గురవుతున్న ఇంద్రవెల్లి వాసులు...
సంచారిస్తున్న జంతువును సమాధుల్లో నుండి శవాలను తోడి తినే గ్రేవ్ బ్యాడ్జర్ గా అనుమానిస్తున్న అటవీ అధికారులు.." అని ఉంది.
royalichoda అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసిన వీడియోను 2400 మందికి పైగా లైక్ చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. కామెంట్స్ విభాగంలో పలువురు తమ తమ అభిప్రాయాలను తెలియజేయడం చూడొచ్చు. కొందరేమో మర్నాగి అంటూ, మరికొందరేమో పిల్లి అంటూ చెప్పడం చూడొచ్చు. గత కొన్ని నెలలుగా తమ ప్రాంతంలో తిరుగుతూ ఉంది ఆ జంతువు అంటూ కామెంట్ల విభాగంలో మేము చూసాం.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇంద్రవెల్లిలో కనిపించింది వింత జంతువు కాదు.. పునుగుపిల్లి అని అటవీ అధికారులు ధృవీకరించారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం. "అర్ధరాత్రి ఇళ్ల ప్రాంగణంలో తచ్చాడిన వింత జంతువు.. అదేమిటి అని ఆరా తీయగా" అంటూ టీవీ9 వెబ్ సైట్ లో కథనాన్ని మేము చూశాం. ఆ కథనం లింక్ ఇక్కడ ఉంది.
ఓ ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ లో జంతువు సంచారాన్ని గమనించిన పలువురు అది మర్నాగి అని కొందరు, అడవి ముంగిసా అని మరికొందరు భావించారని, తిరుమల అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ఇంద్రవెల్లి లో ప్రత్యక్షమయిందని కథనం తెలిపింది. ఇంద్రవెళ్లి మండలంలో రాంనగర్ కాలనీలోని ముండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ జంతువు కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మాజీ సర్పంచ్ సుంకట్ రావ్ పంచాయతీ సిబ్బందితో కలిసి వల వేసి ఈ జంతువును బంధించారని టీవీ9 కథనం తెలిపింది.
ఇంద్రవెల్లి రాంనగర్ కాలనీలో పునుగు పిల్లి సంచారం | Adilabad District | Prime9News అనే టైటిల్ తో Prime9News యూట్యూబ్ ఛానల్ లో వీడియోను చూశాం.
"గత నెల రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో సంచరిస్తున్న అటవీ జంతువును ఎట్టకేలకు రాంనగర్ కాలనీవాసులు పట్టుకున్నారు" అని 27 జనవరి 2025న ఏబీపీ న్యూస్ వెబ్సైట్ లో కథనాన్ని చూశాం.
రాత్రి 9 గంటల ప్రాంతంలో రాంనగర్ కాలనీలో ముండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ జంతువు కనిపించింది. మాజీ సర్పంచ్ సుంకట్ రావ్ పంచాయతీ సిబ్బందితో కలిసి వలవేసి ఉంచారని కథనంలో తెలిపారు.
స్థానికులు అర్ధరాత్రి పూట ఇంటి పైన చప్పుడు రావడంతో వెళ్లి పరిశీలించగా వలలో ఆ అటవీ జంతువు చిక్కుకొని ఉంది. స్థానిక యువకులు ఆ జంతువును చాకచక్యంగా పట్టుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి ఎం. చంద్రారెడ్డి, అటవీశాఖ సిబ్బంది సంజివ్ కలిసి వాహనంలో చీచ్ ధరి ఖానాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళారు. అక్కడ జంతువును అడవిలోకి వదిలేశారు. ఈ జంతువును పునుగు పిల్లి అంటారని తెలిపారు. అధికారులు ఖానాపూర్ అటవీ ప్రాంతంలో దాన్ని వదిలి వేసినట్లు తెలిపారు.
ఇక వైరల్ పోస్టులోని వీడియో రికార్డు అయిన ప్రదేశాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. అయితే వింత జంతువు అనే వాదనలో మాత్రం ఎలాంటి నిజం లేదని తేల్చాము.
కాబట్టి, ఇంద్రవెల్లిలో కనిపించింది వింత జంతువు కాదు. పునుగుపిల్లి అని అధికారులు ధృవీకరించారు.
Claim : ఇంద్రవెల్లిలో కనిపించింది వింత జంతువు కాదు.. పునుగుపిల్లి
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story