schema:text
| - Wed Feb 19 2025 14:33:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నటుడు మంచు మనోజ్ ను అరెస్ట్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదు
మంచు మనోజ్ ను పోలీసులు అరెస్టు చేయలేదు
Claim :
మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారుFact :
మంచు మనోజ్ పోలీసు స్టేషన్ కు స్వయంగా వెళ్లారుమంచు మనోజ్ కుటుంబంలో వివాదాలు రోజు రోజుకీ ముదురుతూ ఉన్నాయి. మోహన్బాబు కుటుంబంలో కొనసాగుతున్న వివాదాల మధ్య నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇటీవల మంచుమనోజ్ ను తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. తాజాగా, మంచు మనోజ్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్లోని భాకరాపేట పోలీస్ స్టేషన్ లో కూర్చున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంచు మనోజ్ ను అరెస్టు చేసారంటూ కొందరు పోస్టులు పెట్టారు.
"BREAKING NEWS
#ManchuManoj in Police Custody!
Case filled by #MohanBabu Concerning Family Matters
Stay Strong
@HeroManoj1
brother
We all are with you" అంటూ కొందరు పోస్టులు పెట్టారు. మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని అందులో తెలిపారు.

"పోలీసుల అదుపులో మంచు మనోజ్..
కుటుంబ తగాదాల నేపథ్యంలో రిజిస్టర్ అయిన కేసులో.. #ManchuManoj
#ManchuFamily" అంటూ మరొక ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు. మంచు మనోజ్ ను పోలీసులు అరెస్టు చేయలేదు.
మేము సంబంధిత వార్తా కథనాల కోసం వెతికాం. మంచు మనోజ్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటనను నివేదించాయి కానీ.. ఎక్కడా కూడా అరెస్టు చేసినట్లుగా నివేదికలు లభించలేదు.
మంచు మనోజ్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్లోని భాకరాపేట పోలీస్ స్టేషన్ వెలుపల 17-02-2025 సోమవారం రాత్రి నిరసనకు దిగారు.
నివేదికల ప్రకారం మంచు మనోజ్ రాత్రి 11:15 నుండి అర్ధరాత్రి వరకు నిరసనలో కూర్చున్నాడు. పోలీసుల చర్యలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కనుమ రోడ్డు సమీపంలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో తాను, తన సిబ్బంది ఉంటున్నారని మనోజ్ తెలిపాడు. పోలీసులు వారి గురించి ప్రశ్నించారు. దీంతో నేరుగా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మంచు మనోజ్ వెళ్లే సమయానికి సబ్ ఇన్స్పెక్టర్ లేరు. తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు పదేపదే ఇబ్బందులకు గురిచేస్తున్నారని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ బాషాతో మనోజ్ ఫోన్లో మాట్లాడారు. మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థుల కోసం పోరాడుతున్న తనను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు మనోజ్ అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఇదే విషయాన్ని పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

భాకరాపేట పోలీస్స్టేషన్కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారని, రాత్రి 11.15 గంటల సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారని నివేదికలు చెబుతున్నాయి. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బసచేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్సై లేరని అన్నారు.
ఏ వార్తా కథనంలో కూడా మంచు మనోజ్ అరెస్టు అయినట్లుగా నివేదిక లేదు.
ఇక మంగళవారం 18-02-2025న అంతకుముందు రోజు రాత్రి చోటు చేసుకున్న గొడవ గురించి వీడియోను విడుదల చేశాడు.తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తానేదో భయపడుతున్నానని అనుకుంటున్నారేమోనని.. ఈ జన్మలో అది జరగదన్నారు. తన మీద, తన భార్య భూమా మౌనిక మీద ఇప్పటి వరకు 32 కేసులు పెట్టారని.. ఇంకా ఎన్ని కేసులు పెట్టిస్తారో కూడా తెలియదన్నారు మనోజ్.
ఆ వీడియోను పలు మీడియా సంస్థలు నివేదించాయి.
మంచు మనోజ్ వీడియో విడుదలపై మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈ కథనాల ప్రకారం సీఐతో ఫోనులో మాట్లాడిన తర్వాత సోమవారం రాత్రి అక్కడ నుంచి మనోజ్ వెళ్ళిపోయారు.
ఈ విషయమై మేము భాకరాపేట పోలీసులను సంప్రదించాం. మంచు మనోజ్ ను అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు. ప్రతిరోజూ జరిగే పోలీస్ రౌండ్స్లో భాగంగానే ఈ తనిఖీ జరిగిందనీ మంచు మనోజ్పై ఎలాంటి కేసు ఫైల్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. మంచు మనోజ్ ను పోలీసులు అరెస్టు చేయలేదు.
Claim : మంచు మనోజ్ పోలీసు స్టేషన్ కు స్వయంగా వెళ్లారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|