About: http://data.cimple.eu/claim-review/26752bec1edfa3f39b5ee1797c2293dfe1fdaccb14e004baab610508     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Tue Feb 04 2025 14:56:02 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సూపర్ సిక్స్ సెగ తగిలిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ కావాలంటూ Claim :సూపర్-6 పథకాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు ముందే నిరసనలు తెలిపారు Fact :అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ కావాలంటూ కొందరు డిమాండ్ చేశారు. దానిపై చంద్రబాబు స్పందించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడును నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగిపోయాయి. వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ అందుకోడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలే కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 'సూపర్ సిక్స్' హామీలకు రాష్ట్ర బడ్జెట్లో చోటు దక్కలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో ఆరోపించారు. టీడీపీ 2024 మేనిఫెస్టోలోని ఎన్నికల వాగ్దానాలలో 'సూపర్ సిక్స్' పథకాలు ఉన్నాయి. 19 నుండి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలకు రూ. 1,500 నెలవారీ డబ్బులు, 20 లక్షల ఉద్యోగాల కల్పన, నెలవారీ రూ. 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.15,000, రైతులకు ఆర్థిక సహాయంగా సంవత్సరానికి రూ.20,000 ఉన్నాయి. వీటిని అమలు చేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండగా కొందరు అడ్డు తగలడం.. చంద్రబాబు నాయుడు వారి తీరును తప్పుబడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. "చంద్రబాబుకి సూపర్-6 సెగ.. పబ్లిక్ మీటింగ్ లో నిలదీత" అంటూ పోస్టులు పెట్టారు. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. "రాయచోటిలో చంద్రబాబుకి నిరసన సెగ సూపర్-6 హామీల్ని గాలికొదిలేసిన చంద్రబాబుని ఇప్పటికే ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు.. రాయచోటి సభలో @ncbn.official ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను గుర్తుచేసిన యువకులు నువ్వు చెప్తే ప్రకటించరు అంటూ సభలో అహంకారంగా బెదిరించిన చంద్రబాబు" అంటూ rajinamma_abhimani_jani పేజీలో పోస్టు పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండగా కొందరు అడ్డు తగలడం.. చంద్రబాబు నాయుడు వారి తీరును తప్పుబడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. "చంద్రబాబుకి సూపర్-6 సెగ.. పబ్లిక్ మీటింగ్ లో నిలదీత" అంటూ పోస్టులు పెట్టారు. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. "రాయచోటిలో చంద్రబాబుకి నిరసన సెగ సూపర్-6 హామీల్ని గాలికొదిలేసిన చంద్రబాబుని ఇప్పటికే ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు.. రాయచోటి సభలో @ncbn.official ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను గుర్తుచేసిన యువకులు నువ్వు చెప్తే ప్రకటించరు అంటూ సభలో అహంకారంగా బెదిరించిన చంద్రబాబు" అంటూ rajinamma_abhimani_jani పేజీలో పోస్టు పెట్టారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. వైరల్ పోస్టును స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా.. "రాయచోటి నియోజకవర్గం, సాంబెపల్లెలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు" అంటూ Nara Chandrababu Naidu Official అనే పేజీలో లైవ్ స్ట్రీమింగ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాం. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న 2:14:33 టైమ్ వద్ద చంద్రబాబు నాయుడు కూర్చోవయ్యా.. కూర్చో అంటూ చెప్పడం వినవచ్చు. ఆ సమయంలో వింటే 'అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించండి' అంటూ కొందరు నినాదాలు చేయడం వినొచ్చు. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు 'నువ్వు చెప్తే ప్రకటించేయరు' అంటూ చెప్పారు. 'కొందరు ఇలాంటి సభలను చెడగొట్టడానికి వస్తూ ఉంటారు. వారి విధానాలు కూడా ఇలానే ఉంటాయి' అంటూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమాన్ని పలు న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. అందులో విన్న ఆడియోలో కూడా యువకుడు అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీని ప్రకటించాలని డిమాండ్ చేశారు తప్పితే సూపర్-6 పథకాల గురించి అడగలేదు. మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. 'CM Chandrababu: ఏయ్ కూర్చో.. రాయచోటి సభలో చంద్రబాబు సీరియస్.. వీడియో వైరల్!' అంటూ https://rtvlive.com/ లో కథనాన్ని కూడా మేము గుర్తించాం. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. యువకులు నిరసన వ్యక్తం చేసింది అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ కావాలని అన్నట్లుగా పలు మీడియా సంస్థల ట్విట్టర్ ఖాతాలలో పోస్టులు చూడొచ్చు. రాయచోటి ప్రజావేదిక సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండగా అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని ఓ యువకుడు నినాదాలు చేశారు. ఈ విషయంపై ఆ సభలోనే సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు. అంతేకానీ సూపర్-6 పథకాలను అమలు చేయాలని చేసిన నిరసన అయితే కాదు. కాబట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులను వైరల్ చేస్తున్నారు. News Summary - Fact check: Protests infront of AP CM Chandrababu Naidu about super six. Claim : సూపర్-6 పథకాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు ముందే నిరసనలు తెలిపారు Claimed By : Social Media Claim Reviewed By : Telugu Post Claim Source : Social Media Users Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software