About: http://data.cimple.eu/claim-review/390fca1428b70af9771aa6bb098a357b1c29b4ad7f2190131912d7ce     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Nov 29 2024 14:21:31 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: యాపిల్ ఎయిర్పాడ్ తయారీ యూనిట్ను బెంగళూరుకు మార్చాలంటూ కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాయలేదు ఐఫోన్ తయారీదారు ఆపిల్ తన వైర్లెస్ ఇయర్బడ్స్-ఎయిర్ పాడ్ల తయారీని ఫాక్స్కాన్ యొక్క హైదరాబాద్ ఫ్యాక్టరీలో ప్రారంభించనుంది Claim :యాపిల్ ఎయిర్పాడ్ తయారీ యూనిట్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్ గ్రూపుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాశారు. Fact :ఫాక్స్కాన్ గ్రూపునకు డీకే శివకుమార్ లేఖ రాయలేదు. లేఖకు సంబంధించిన ప్రకటనలు ఒక బూటకం. ఐఫోన్ తయారీదారు ఆపిల్ తన వైర్లెస్ ఇయర్బడ్స్-ఎయిర్ పాడ్ల తయారీని ఫాక్స్కాన్ యొక్క హైదరాబాద్ ఫ్యాక్టరీలో ప్రారంభించనుంది. డిసెంబర్ 2024 నాటికి ప్లాంట్ భారీగా ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో రెండు పేజీల లేఖ వైరల్ అవుతూ ఉంది. హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ (ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్) చైర్మన్ యంగ్ లూను ఉద్దేశించి “ప్రభుత్వం తరపున, మీరు ఆపిల్ ఎయిర్పాడ్స్ పరిశ్రమను మార్చడాన్ని పరిగణించాలని నేను ప్రతిపాదిస్తున్నాను, మీరు హైదరాబాద్ నుండి బెంగళూరు కు మారిస్తే మంచిది. ఈ చర్య అనేక పరస్పర ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఆపిల్ ఫోన్ తయారీ పరిశ్రమను పూర్తి చేయడమే కాకుండా, నగరం, రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వర్క్ఫోర్స్ను కూడా ప్రభావితం చేస్తుంది. బెంగళూరులో ఉండటం వల్ల మీ అంతర్జాతీయ గుర్తింపు కూడా పెరుగుతుంది. హైదరాబాద్లోని అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా వాటిని బెంగళూరుకు తరలించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. తెలంగాణలో త్వరలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడుతుందని మేము భావిస్తున్నాము, అక్కడ మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని హామీ ఇచ్చారు. అందువల్ల, మీ అనుబంధ పరిశ్రమ కూడా ఈ చర్యను చేపట్టడం పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది". అని చెప్పినట్లుగా ఆ లెటర్ లో ఉంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు లేఖ రాశారంటూ ఆరోపణలు గుప్పించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్లాంట్ను హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్కు లేఖ రాశారని కేటీఆర్ఆరోపించారు. ఈ లేఖ అదే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “Wake up #Telangana! Conspiracy webbed by DK to relocate global companies from #Hyderabad to #Bangalore Karnataka Congress leader DK Shivakumar has written a letter to the CEO of the company to move Foxconn, the company that manufactures Apple Airpods, from Hyderabad to Bangalore. This would further intensify if Congress is voted to power in Telangana. All the companies that come to Hyderabad will be diverted to Bangalore.” అంటూ పోస్టు పెట్టారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని.. తెలంగాణ లోని ప్రాజెక్టులు కర్ణాటకకు తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాయలేదు. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డి.కె.శివ కుమార్ యాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్ గ్రూప్కు లేఖ రాశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదని శివకుమార్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. thenewsminute.com ప్రకారం, నవంబర్ 4 శనివారం నాడు కర్ణాటక ఉపముఖ్యమంత్రి DK శివకుమార్ హైదరాబాద్ నుండి బెంగళూరుకు మార్చాలని కోరుతూ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న లేఖ నకిలీదని స్పష్టం చేశారు. “యాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ను హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్కు నేను రాసినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లేఖ నకిలీది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం" అని ఆయన తెలిపారు. ఎయిర్పాడ్ తయారీ యూనిట్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్ ఇండస్ట్రీస్కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లేఖ రాశారనే వాదన అవాస్తవం. ఈ లేఖ ఒక బూటకం. Claim : Karnataka Deputy Chief Minister D K Shivakumar wrote a letter to Foxconn group to relocate the Apple Airpod manufacturing unit from Hyderabad to Bengaluru Claimed By : Twitter users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Twitter Fact Check : False News Summary - Karnataka Dy CM DK Shivakumar did not write a letter to Foxconn suggesting shifting of Apple Airpod manufacturing unit to Bengaluru Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software