schema:text
| - Thu Feb 27 2025 16:29:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేరళలో ప్రధాని మోదీ ఫోటోను కనిపించకుండా చేయడం వెనుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణం
కేవలం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా కేరళలోని కోజికోడ్ లో
Claim :
కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కావాలనే కనిపించకుండా చేశారుFact :
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా అధికారులే ప్రధాని మోదీ ఫోటోను కనిపించకుండా చేశారుకేరళలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) వయనాడ్ జిల్లా కమిటీ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు నిరసనలకు సిద్ధమైంది. ముండక్కై-చూరల్మల విపత్తు బాధితులను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం ముందు నిరసన చేపడతామని ప్రకటించింది.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా విపత్తు సహాయానికి ₹2,000 కోట్లు కేటాయించాలని, విపత్తు బాధితులకు రుణమాఫీ చేయాలని డిమాండ్లు ఉన్నాయి. విపత్తు బాధితులతో సహా మొత్తం 165 మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు కేరళ హౌస్ నుండి మార్చ్ ప్రారంభమవనుంది. ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటల వరకు నిరసన కొనసాగుతుంది. కేరళకు చెందిన LDF ఎంపీలు, జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారు. ఢిల్లీ నిరసనకు సంఘీభావం తెలుపుతూ ఫిబ్రవరి 24 సాయంత్రం వయనాడ్ జిల్లాలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అవగాహన సమావేశాలను ఏర్పాటు చేశారు.
ఇంతలో ఓ రైల్వే స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖం కనిపించకుండా కవర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"Platform number 4, Kozhikode (Kerala) Railway Station!
Picture of Indian Prime Minister is not allowed here!!.. The shop owner has blocked PM's picture by pasting/covering with a paper. Please circulate this message until it reaches to the concerned and Railway ministry." అంటూ వాట్సాప్ లో ఫోటో వైరల్ అవుతూ ఉంది.
కేరళలోని కోజికోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖం కనిపించకుండా కప్పేశారంటూ ఈ పోస్టుల్లో ఆరోపించారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
వైరల్ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2024 సంవత్సరం మే నెలలో కూడా ఇదే ఫోటో వైరల్ అయిందని మేము గుర్తించాం.
2024లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా కొన్ని నెలల పాటూ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల చిత్రాలు, పోస్టర్లు, విగ్రహాలను కవర్ చేయాల్సి ఉంటుంది. MCC మార్చి 16, 2024 (ఎన్నికల ప్రకటన తేదీ) నుండి ఫలితాలు ప్రకటించబడే జూన్ 4 వరకు అమలులో ఉంది. MCC మార్గదర్శకాల ప్రకారం వార్తాపత్రికలు, ఇతర మీడియాలో ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు జారీ చేయడం కరెక్ట్ కాదు. ఈ నియమం ప్రకారం, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏదైనా పబ్లిక్ ఇమేజ్ ను కవర్ చేస్తారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను కూడా కవర్ చేసి ఉంచారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా వైరల్ పోస్టులపై దక్షిణ రైల్వే, పాలక్కాడ్ డివిజన్ విభాగం స్పందించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ఆదేశాలకు అనుగుణంగా ప్రధాని చిత్రం కవర్ చేశారని వివరించింది.
అలాంటి ట్వీట్లపై పాలక్కాడ్ డివిజన్ రైల్వే అధికారులు కూడా స్పందించారు. ఇది పాత చిత్రమని జులై 31, 2024న కూడా స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని అనుసరించి మోదీ ముఖాన్ని కప్పి ఉంచారని వివరించారు. అదనంగా, అధికారులు కాలికట్ రైల్వే స్టేషన్లోని OSOP స్టాల్ ప్రస్తుత చిత్రాన్ని పంచుకున్నారు, అక్కడ మోదీ చిత్రం కనిపిస్తుంది.
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయంటూ పలు నిజ నిర్ధారణ సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కేవలం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా కేరళలోని కోజికోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాన్ని కనిపించకుండా చేశారు. కోడ్ ముగిసిన తర్వాత సాధారణంగా ఉంచేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : కేవలం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా కేరళలోని కోజికోడ్ లో
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|