Wed Feb 12 2025 23:43:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కోతులు గుడి గంటలు మోగిస్తున్న ఘటన అయోధ్య లోని రామ మందిరంలో చోటు చేసుకోలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని హనుమాన్ ఆలయానికి సంబంధించినది.
అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రామాలయానికి రామ భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక కోతి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిందని వార్తలు వచ్చాయి. ఈ ఘటన రామ భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
Claim :ఆరతి సమయంలో అయోధ్య రామమందిరంలో కోతులు గంట కొట్టినట్లు వీడియో చూపిస్తుంది
Fact :ఈ వీడియో 2017 సంవత్సరానికి చెందినది. హిమాచల్ ప్రదేశ్లోని హనుమాన్ దేవాలయంలో హారతి సమయంలో కోతులు గుడి గంట మోగించాయి.
అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రామాలయానికి రామ భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక కోతి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిందని వార్తలు వచ్చాయి. ఈ ఘటన రామ భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రాముడికి భక్తుడైన హనుమంతుడు స్వయంగా రామ్ లల్లాను సందర్శించినట్లు పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆలయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, అయోధ్యలోని రామాలయం ముందు ఏర్పాటు చేసిన గంటను కోతులు మోగిస్తున్నాయని పేర్కొంటూ సుమన్ టీవీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది.
“అయోధ్య లో అద్భుతం.. రామయ్య గుడి ముందు వానరాలు గంట కొడుతూ..”, అంటూ పోస్టు పెట్టారు. నిజమేనని చాలా మంది నమ్మేస్తూ లైక్, షేర్ చేస్తున్నారు.
“అయోధ్య లో అద్భుతం.. రామయ్య గుడి ముందు వానరాలు గంట కొడుతూ..”, అంటూ పోస్టు పెట్టారు. నిజమేనని చాలా మంది నమ్మేస్తూ లైక్, షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ చేసిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు. ఇదే క్లెయిమ్తో వాట్సాప్లో కూడా వీడియో వైరల్గా మారింది.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2017 సంవత్సరానికి చెందినది. హిమాచల్ ప్రదేశ్లోని హనుమాన్ ఆలయంలో జరిగిన సంఘటన ఇదని తెలుస్తోంది.
వీడియో నుండి సంగ్రహించిన కీ ఫ్రేమ్లను తీసుకుని మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఆ వీడియో జూలై 2017లో Facebook, YouTube వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
మరింత సెర్చ్ చేయగా.. జూలై 2017లో 'కనెక్ట్ గుజరాత్' ప్రచురించిన ఓ కథనాన్ని మేము గుర్తించాం. ఆలయంలో హారతి నిర్వహిస్తున్నప్పుడు కోతుల గుంపు గుడి గంటను మోగిస్తున్న వీడియోను తీశారని.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని కథనంలో పేర్కొన్నారు. ఆలయ పూజారి ఒకరు కోతులు గుడిలోపలకు వచ్చిన వీడియోను చిత్రీకరించారు. అయితే, కోతులు ఒక్కసారిగా గుడి గంటను మోగించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
dailymail.co.uk లో ప్రచురించిన కథనం ప్రకారం.. వీడియో హిమాచల్ ప్రదేశ్లోని హనుమాన్ దేవాలయానికి చెందినది. ఈ సంఘటన జూలై 2017 లో చోటు చేసుకుంది. కోతులు ఆటలాడుకుంటూ ఇలా ఆలయంలోని గంటను మోగించాయని అందులో కూడా తెలిపారు.
కాబట్టి, వైరల్ పోస్టుల్లో చెబుతున్నట్లుగా ఆ వీడియో అయోధ్యకు సంబంధించినది కాదు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నది అంతకన్నా కాదు. ఇది 2017 సంవత్సరం నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

News Summary - Video showing monkeys ringing the bell is not from Ayodhya Ram temple but from Hanuman temple in Himachal Pradesh
Claim : video shows monkeys ringing the bell at Ayodhya Ram Mandir during aarti time
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story