Wed Feb 12 2025 18:09:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్ : ఈ వీడియోలో పాట పాడే బాలుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడా..?
తాజాగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడి లైవ్ సింగింగ్ వీడియోగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఎస్పీబీ పాడిన ‘మలరే మౌనమా’ పాటను ఓ పిల్లవాడు పాడుతున్నట్లు ఈ వీడియోలో ఉంది.
క్లెయిమ్: దివంగత గాయకుడు S. P. బాలసుబ్రహ్మణ్యం మనవడు పాట పాడుతున్న వీడియో
ఫ్యాక్ట్ : ఆ వీడియోలో పాడుతున్న బాలుడు కేరళలోని కొల్లం నగరానికి చెందిన ఆదిత్య సురేష్. పుట్టుకతో 'బ్రిటిల్ బోన్' వ్యాధితో బాధపడుతున్న ఆదిత్య సురేష్ కు పాడటం అంటే చాలా ఇష్టం. ఆదిత్య సురేష్ దివంగత గాయకుడు S. P. బాలసుబ్రహ్మణ్యం మనవడు కాదు. కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
లెజెండరీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనల్ని విడిచిపెట్టి చాలా కాలమే అవుతోంది. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకు సంబంధించిన పలు విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడి లైవ్ సింగింగ్ వీడియోగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఎస్పీబీ పాడిన 'మలరే మౌనమా' పాటను ఓ పిల్లవాడు పాడుతున్నట్లు ఈ వీడియోలో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:వీడియోకు సంబంధించిన స్క్రీన్షాట్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. యూట్యూబ్ ఛానెల్ లో 19 జూన్ 2020న పోస్ట్ చేసిన ఇలాంటి విజువల్స్తో కూడిన వీడియో కనుగొనబడింది. ఈ వీడియో "మలరే మౌనమే – ఆదిత్య సురేష్ పాడుతున్నాడు"("Malare Mouname – Beautiful Singing by Adithya Suresh") అనే శీర్షికతో పోస్ట్ చేయబడింది. మేము సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి మరిన్ని వివరాల కోసం సెర్చ్ చేశాము. ఆదిత్య సురేష్ ఫేస్బుక్ పేజీలో ప్రచురించబడిన అదే వీడియోను మేము కనుగొన్నాము. కామెంట్స్ విభాగంలో, మీరు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడు కాదా అని ఒక వినియోగదారుడు అతనిని అడిగినప్పుడు, ఆదిత్య సురేష్ తాను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడు కాదని, అది ఫేక్ న్యూస్ అని ధృవీకరించాడు.
ఆదిత్య సురేష్ కేరళలోని కొల్లామ్ నగరానికి చెందిన ప్రముఖ బాల గాయకుడు. పుట్టుకతోనే బ్రిటిల్ బోన్ డిసీజ్తో బాధపడుతున్న ఆదిత్య సురేశ్ కు పాడటం అంటే చాలా ఇష్టం. కేరళ, మరెన్నో ప్రాంతాలలో సురేష్ అనేక సంగీత ప్రదర్శనలు చేశాడు. ఆదిత్య సురేష్ ప్రత్యక్ష ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలను పలు సోషల్ మీడియా సైట్స్ లో చూడవచ్చు. ఆదిత్య సురేష్కి సినిమాల్లో కూడా పాడే అవకాశాలు వచ్చాయి. ఆదిత్య సురేష్ తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటోలను మీరు చూడవచ్చు.
దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తన మనవళ్లు, కుటుంబీకులతో కలిసి ఉన్న చిత్రాలను మనం చూడవచ్చు. ఈ సాక్ష్యాలన్నింటిని బట్టి ఆ వీడియోలో పాడుతున్న బాలుడు బాల గాయకుడు ఆదిత్య సురేష్ అని, దివంగత గాయకుడు ఎస్పీబీ మనవడు కాదని తేల్చవచ్చు.
ఈ వీడియోలో పాడే బాలుడు కేరళ గాయకుడు ఆదిత్య సురేష్, దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడు కాదు.
క్లెయిమ్: ఈ వీడియోలో పాట పాడే బాలుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవడు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
News Summary - A post is being shared on social media claiming it as a live singing video of late singer S. P. Balasubrahmanyam’s grandson.
Claim : Singing video of late singer S. P. Balasubrahmanyam’s grandson.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story