Fri Sep 13 2024 15:42:11 GMT+0000 (Coordinated Universal Time)
Fact check: ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు మోదీ ప్రభుత్వం 2 శాతం వడ్డీతో రుణాలను అందిస్తూ ఉందా..?
ప్రధాన మంత్రి తీసుకుని వచ్చిన సరికొత్త పథకం కింద ప్రభుత్వం 2% వడ్డీకి రుణాలు అందిస్తోందనే సందేశం వైరల్ మెసేజ్లో ఉంది.
ఆధార్ కార్డ్ మనందరికీ చాలా ముఖ్యమైనది. ఎన్నో పనుల్లో ఆధార్ కార్డ్ అవసరం. పుట్టిన పిల్లల వరకూ, పండు ముసలి వాళ్ల వరకూ ఆధార్ కార్డు మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వ స్కీమ్ లలో భాగమైనా, ప్రైవేట్ ఉద్యోగాల విషయమైనా కూడా ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైనది. ఆధార్ కార్డు చుట్టూ కూడా ఎన్నో నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక సందేశాలు వైరల్ అవుతున్నాయి. కొన్ని పోస్టులు పుకార్లు వ్యాపించేలా ఉన్నాయి. ఆధార్ కార్డు విషయమై అలాంటి మెసేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుపై రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి తీసుకుని వచ్చిన సరికొత్త పథకం కింద ప్రభుత్వం 2% వడ్డీకి రుణాలు అందిస్తోందనే సందేశం వైరల్ మెసేజ్లో ఉంది.
ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ సంస్థ తన ట్విట్టర్ ఖాతా నుండి ప్రజలను ఈ వైరల్ మెసేజ్ పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది. ప్రభుత్వం అటువంటి ప్రణాళికను రూపొందించలేదని.. ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం పూర్తిగా అబద్ధం, కల్పితం అని తేల్చి వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరారు. పీఎం పథకం కింద ఆధార్ కార్డుపై రుణాలు ఇస్తున్నారనే వాదన అవాస్తవమని పీఐబీ తన వాస్తవ పరిశీలనలోఫ్యాక్ట్ చెక్ లో భాగంగా పేర్కొంది.
ఇలాంటి వైరల్ మెసేజీలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రజలను అప్రమత్తం చేసింది. మోదీ ప్రభుత్వం పేరుతో ఫేక్ మెసేజ్ లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇలాంటి మెసేజ్లను చూసి మోసపోవద్దని సూచించారు. అలాంటి మెసేజ్లను ఎక్కడా ఫార్వార్డ్ చేయవద్దని కూడా సూచించింది. సందేశాల ఉచ్చులో చిక్కుకోవడం ద్వారా మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని కూడా విజ్ఞప్తి చేసింది.
కాబట్టి ఇలాంటి వైరల్ మెసేజీల మాయలో పడి మీ అమూల్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని మేము కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము.

నిజనిర్ధారణ:ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ఇలా లోన్స్ కు సంబంధించిన ప్రకటన గురించి పలువురు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖుల ఖాతాలను చూశాం.. అయితే వారి నుండి ఎటువంటి ప్రకటన కనిపించలేదు. అంతేకాకుండా ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్ సైట్ లో కూడా చూశాం. అందులో కూడా ఈ లోన్స్ కు సంబంధించిన కథనాలు కనిపించలేదు.
ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ సంస్థ తన ట్విట్టర్ ఖాతా నుండి ప్రజలను ఈ వైరల్ మెసేజ్ పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది. ప్రభుత్వం అటువంటి ప్రణాళికను రూపొందించలేదని.. ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం పూర్తిగా అబద్ధం, కల్పితం అని తేల్చి వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరారు. పీఎం పథకం కింద ఆధార్ కార్డుపై రుణాలు ఇస్తున్నారనే వాదన అవాస్తవమని పీఐబీ తన వాస్తవ పరిశీలనలోఫ్యాక్ట్ చెక్ లో భాగంగా పేర్కొంది.
ఇలాంటి వైరల్ మెసేజీలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రజలను అప్రమత్తం చేసింది. మోదీ ప్రభుత్వం పేరుతో ఫేక్ మెసేజ్ లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇలాంటి మెసేజ్లను చూసి మోసపోవద్దని సూచించారు. అలాంటి మెసేజ్లను ఎక్కడా ఫార్వార్డ్ చేయవద్దని కూడా సూచించింది. సందేశాల ఉచ్చులో చిక్కుకోవడం ద్వారా మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని కూడా విజ్ఞప్తి చేసింది.
కాబట్టి ఇలాంటి వైరల్ మెసేజీల మాయలో పడి మీ అమూల్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని మేము కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము.
Claim : ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు మోదీ ప్రభుత్వం 2 శాతం వడ్డీతో రుణాలను అందిస్తూ ఉందా
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
News Summary - Fake message alert claiming government is giving loan at 2 percent annual interest rate
- Tags
- telugupost
Next Story