Wed Feb 12 2025 19:56:56 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆది పురుష్ సినిమా థియేటర్లలోకి దళితులకు ఎంట్రీ లేదని చెబుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతి సనన్ సీతగా.. నటించిన సినిమా ఆదిపురుష్. జూన్ 16న సినిమా విడుదల కాబోతూ ఉంది. ఇటీవలే చిత్ర యూనిట్ తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతి సనన్ సీతగా.. నటించిన సినిమా ఆదిపురుష్. జూన్ 16న సినిమా విడుదల కాబోతూ ఉంది. ఇటీవలే చిత్ర యూనిట్ తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
గత ఏడాది ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత దళితులు సినిమా చూడకూడదని చిత్ర బృందం తెలిపిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతూ ఉంది.
ఆ పోస్టర్ లో “రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ధర్మం కోసం నిర్మించిన 'ఆదిపురుష్' ని హిందువులందరూ తప్పక వీక్షిద్దాం. ” అని ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:ఆదిపురుష్ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలోకి దళితులను అనుమతించరన్న వాదన అవాస్తవం. షేర్ చేసిన చిత్రం మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఆదిపురుష్ మూవీ టీమ్ అలాంటి పోస్టర్లను విడుదల చేయలేదని తెలుస్తోంది. అయితే సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడికి అంకితం ఇస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ను పోలిన ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
“రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్ ' సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన 'ఆదిపురుష్ ' ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం” అని ఆదిపురుష్ టీమ్ పోస్టర్ ను సోషల్ మీడియాలో వదిలింది.
వైరల్ మరియు ఒరిజినల్ పోస్టర్ల బ్యాగ్రౌండ్ ఫోటో కూడా అలాంటిదే ఉంది. వైరల్ పోస్టర్‌లోని లైన్స్ ను మాత్రమే మార్చారు. అయితే ప్రతి ఇతర ఫీచర్ కూడా అలాగే ఉంది. కేవలం టెక్స్ట్ ను మాత్రమే ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఆదిపురుష్ సినిమా నిర్మాతలు ఈ వాదనలను తోసిపుచ్చారు. ఈ సినిమా చూడటానికి కులం, మతం, రంగు ఆధారంగా ఎలాంటి వివక్షకు తావు ఇవ్వమని స్పష్టం చేశారు.
దళితులకు ప్రవేశం లేదంటూ వైరల్ అవుతున్న పోస్టు తప్పుడు ప్రచారమంటూ చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
News Summary - Viral Poster claiming ‘no entry for Dalits’ into Adipurush theatres is fake
Claim : Dalits not allowed in theatres screening Adipurush
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story