schema:text
| - Wed Feb 12 2025 20:40:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆ 3డీ పెయింటింగ్స్ అయోధ్యలోని రామ మందిరంలోనివి కావు..!
అయోధ్య లోని రామ మందిరాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అయితే ఆ ఆలయానికి సంబంధించి పలు అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. నిజమో కాదో తెలుసుకోకుండా.. పలువురు షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం చెందుతోంది.

కొత్త అయోధ్య ఆలయంలో 3D పెయింటింగ్లు ఉన్నాయని చెబుతూ వీడియో వైరల్ అవుతోంది. ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు ఆ వీడియో ద్వారా..!
కళ్ళు కదలడం, తెరవడం, మూసుకోవడం వంటి ఎఫెక్ట్స్ తో ఉన్న మహిళల పెయింటింగ్లతో వైరల్ వీడియో ఉంది. అయోధ్యలోని కొత్త ఆలయంలోని గోడపై ఇలాంటివి రూపొందిస్తూ ఉన్నారని వీడియో పేర్కొంది. ఇలాంటి వీడియో సర్క్యులేట్ కావడం ఇదే మొదటిసారి కాదు. అల్లర్లు సృష్టించాలనే కోణంతో కూడా కొందరు ఇలాంటి దుష్ప్రచారాలను చేస్తూ ఉండవచ్చు. ఇటువంటి వీడియోలను షేర్ చేసే ముందు కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం.
నిజ నిర్ధారణ:వైరల్ వీడియో ఎక్కడ నుండి వచ్చిందా అని తెలుసుకోడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి మేము వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్ ను తీసుకున్నాము. కొత్త అయోధ్య ఆలయం నిర్మాణ స్థితిని అర్థం చేసుకోవడానికి, పెయింటింగ్లతో గోడలు ఏమైనా ఉన్నాయా అని చూడటానికి మేము వివిధ అధికారిక నివేదికలను పరిశీలించాము. అందులో ఎక్కడా కూడా అప్పుడే 3డీ పెయింటింగ్లు వేశారనే సమాచారం అందలేదు. ఆలయ నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది.. కొత్త అయోధ్య ఆలయం వద్ద ఇంకా గోడల నిర్మాణం పూర్తీ అవ్వలేదు. కాబట్టి, ఇది తప్పుడు సమాచారం అని మేము నిర్ధారించాము.
ఈ చిత్రం రాధా కృష్ణులకు సంబంధించింది. అందుకు సంబంధించిన ఫ్రేమ్డ్ పోస్టర్. స్పష్టంగా ఒక పోస్టర్ అని తెలుస్తోంది. అందులో నుండి వైరల్ వీడియో కాపీ చేయబడింది. అనేక ఇతర ఫ్రేమ్లు మరియు పోస్టర్లు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని పలు సైట్స్ లో అమ్మకానికి కూడా ఉంచారు.
వీడియోలోని సమాచారం ప్రకారం - ఇది కొత్త అయోధ్య ఆలయ గోడలపై నుండి గీసిన పెయింటింగ్ అని చెప్పారు. అయితే అయోధ్యలో కొత్త రామాలయం నిర్మాణ స్థితిపై అధికారిక సమాచారం ప్రకారం, పునాది పనులు వేగంగా పూర్తవుతున్నాయి. పీఠం ఎత్తు పెంచే పనులు సెప్టెంబర్ 2022 నాటికి పూర్తవుతుంది.
మే 25, 2022 నాటి వార్తా నివేదిక మీరు ఇందులో చూడవచ్చు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ తాజా నివేదికలో చాలా వేగంగా పనులు చేపడుతున్నట్లు తెలిపింది. గత వారం గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుందని, ఆలయంలో మిగిలిన పనులు డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతాయని చెప్పారు. 2024 ప్రారంభంలో ప్రజల కోసం తెరవబడుతుంది ట్రస్ట్ పేర్కొంది.

"ఆలయం స్తంభం/పీఠం ఎత్తుపనులు జనవరి 24, 2022న ప్రారంభమయ్యాయి. ఈ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. కర్నాటక, తెలంగాణ నుండి గ్రానైట్ రాతి దిమ్మెలను స్తంభం ఎత్తును పెంచడానికి ఉపయోగిస్తున్నారు. ఒక బ్లాక్ పొడవు 5 మీటర్లు- 2.5 అడుగులు వెడల్పు.. 3 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఇందుకు సంబంధించి దాదాపు 17,000 గ్రానైట్ దిమ్మెలను ఉపయోగించనున్నారు. సెప్టెంబర్ 2022 చివరి నాటికి ప్లింత్ హైటెనింగ్ పనులు పూర్తవుతాయి" అని తన తాజా నివేదికలో పేర్కొన్నారు.
ఇక వైరల్ వీడియో ఉన్నవి.. వాల్ ఆర్ట్ లాగా కనిపించలేదు. కళ్ల కదలికను సృష్టించేందుకు ప్రయత్నించారు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ అమెజాన్లో అమ్ముతున్న కొన్ని పోస్టర్లకు సారూప్యతను కలిగి ఉంది. ఈ వీడియో గోడపై పెయింటింగ్ అని పేర్కొంటూ ప్రచారంలో ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదని తెలుస్తోంది.
ముగింపు:
వీడియోలోని చిత్రాలు ఆన్లైన్లో సులభంగా లభించే పోస్టర్ల నుండి తీసుకున్నారు. వాటికి యానిమేషన్ ను యాడ్ చేశారు.. లేదంటే కొత్త సాఫ్ట్ వేర్ సహాయంతో ఇలాంటివి సృష్టించారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేయడంతో పాటు, కొత్త అయోధ్య ఆలయం లోని గోడలపై ఉన్న పెయింటింగ్లని చెప్పడం ద్వారా ఈ వీడియో వైరల్గా మారింది.ఈ వీడియో ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. ఈ 3డి పెయింటింగ్స్ అయోధ్య ఆలయ గోడలపై ఉన్నాయనే వాదన పూర్తిగా అబద్ధం.

News Summary - The Ram temple in Ayodhya is being made very grand. But many things related to that temple are going viral on social media. Many people are sharing without knowing whether it is true or not. Recently, a video is becoming very popular on social media.
Claim : A video is going viral claiming that the new Ayodhya temple has 3D paintings
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|