Fri Dec 20 2024 14:33:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోకు లవ్ జీహాద్ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు. అదొక స్క్రిప్టెడ్ వీడియో.
లవ్ జీహాద్ లో భాగంగా అమాయకమైన అమ్మాయిలను నమ్మించి
Claim :లవ్ జీహాద్ లో భాగంగా అమాయకమైన అమ్మాయిలను నమ్మించి కిడ్నాప్ చేశారు
Fact :ఇదొక స్క్రిప్టెడ్ వీడియో. నిజమైన సంఘటన కాదు.
కిడ్నాపర్లు ఓ ఇంట్లో అమ్మాయిలను దాచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ ముగ్గురు అమ్మాయిలను ఓ వ్యక్తి విడిపించినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో 'లవ్ జిహాద్' కేసుకు సంబంధించిన ఘటన అనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
"లవ్ జీహాద్..... తో అమాయక హిందూ ఆడపిల్లలను లోబరుచుకుని కిడ్నాప్ చేస్తున్నారు జాగ్రత్త. చంపేసి శరీరం అవయాలు అమ్ముకొని 70 నుంచి 90 లక్షలు సంపాదించుతున్నారు జాగ్రత్త" అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు.
హిందీ భాషలో ఈ వీడియోలో మాట్లాడుకోవడం చూడొచ్చు. ఒక మహిళ.. ఓ యువకుడికి ఈ ఇంట్లో నుండి శబ్దాలు వస్తున్నాయి అని చెప్పడంతో వైరల్ వీడియో మొదలవుతుంది. ఓ వ్యక్తి తలుపు తీయగానే అతడిపై మహిళతో పాటూ వచ్చిన యువకుడు దాడికి దిగుతాడు. ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలకు సంబంధించిన సామాన్లు ఇక్కడ ఉన్నాయి చూడండి అంటూ మహిళ లగేజ్ వైపు చూపిస్తుంది. ఇంట్లో ఉన్న యువకుడు మొదట కెమెరాలను ఆఫ్ చేయమని చెబుతాడు. అమ్మాయిలు ఎక్కడ, అమ్మాయిలు ఎక్కడ అని అడగ్గా.. ఇంట్లో ఏ అమ్మాయి లేరు అని లోపల ఉన్న వ్యక్తి చెబుతున్నా అతడిని కొట్టడం చూడొచ్చు. ఇంట్లోని హాల్ లో నుండి పై ఫ్లోర్ లోకి వెళతారు. అక్కడ ఓ బెడ్ రూమ్ ముందు నిలబడి ఉండగా అమ్మాయిలు అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఓ కబోర్డును తెరవగా మహిళలను కట్టి వేసి ఉంచడం అందులో చూడొచ్చు. బయటకు వచ్చిన అమ్మాయిలు ఏడుస్తూ కనిపించారు. మరొక రూమ్ లో అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడం కూడా ఆ వీడియోలో రికార్డు అయింది. మొత్తం ముగ్గురు అమ్మాయిలను ఆ ఇంటి నుండి రక్షించడం ఆ వీడియోలో రికార్డు అయింది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఒక స్క్రిప్టెడ్ వీడియోను సోషల్ మీడియాలో నిజమైన కిడ్నాప్ ఘటనగా భావించి షేర్ చేస్తున్నారు.
సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి నిజంగా ఇలాంటి లవ్ జీహాద్ ఘటన ఇటీవల చోటు చేసుకుందా అని మేము వెతికాం. కానీ మాకు ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు.
వైరల్ అవుతున్న వీడియోను నిశితంగా పరిశీలించగా ఓ వ్యక్తి అంతగా కొడుతున్నా కూడా ఎదురు తిరగడం కనిపించదు, అలాగే కెమెరా వైపు చూస్తూ మాట్లాడడం మనం గమనించవచ్చు. ఇక ఆఖర్లో అమ్మాయిల కిడ్నాప్ ఘటన బయటకు వచ్చినప్పటికీ కిడ్నాప్ చేసిన అనుమానితుడు కనీసం పారిపోడానికి ప్రయత్నించడు. ఇలాంటి ఎన్నో అనుమానాలు వీడియో చూసినంతసేపు కలుగుతూనే ఉంటాయి.
మరీ ముఖ్యంగా వీడియో మొదలైన క్షణాల్లోనే ‘The content made in this video should be considered for entertainment purposes only.’ అంటూ ఆంగ్లంలో ఓ డిస్క్లైమర్ ను మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ వీడియో నటీనటుల సహాయంతో రికార్డు చేసిన వీడియో అని అర్థం అవుతుంది.
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా కంటెంట్ క్రియేటర్ నవీన్ జంగ్రా ఈ వీడియోను సృష్టించాడని స్పష్టమవుతోంది. అతడి YouTube ఛానెల్ లో సంవత్సరం కిందట ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో ఫిబ్రవరి 12, 2023న నవీన్ జాంగ్రా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు.

"Ye देखो केसे लड़कियों ko utaya Jata Hai or Bad m kya kiya Jata hai || Naveen Jangra New Video" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోలో కూడా కంటెంట్ ను ఆర్టిస్టుల సహాయంతో సృష్టించారని తెలియజేసేలా డిస్క్లైమర్ ను మనం చూడొచ్చు.
ఇక అదే యూట్యూబ్ ఛానల్ లో పలు స్క్రిప్టెడ్ వీడియోలలో సదరు వ్యక్తి, ఈ యాక్టర్స్ ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి వైరల్ వీడియోలోని నటీనటులే నవీన్ జంగ్రా ఛానల్ లోని ఇతర యూట్యూబ్ వీడియోలలో గమనించాం.
వైరల్ వీడియో నిజం కాదంటూ పలు మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
News Summary - Fact Check The viral video nothing to do with the Love Jihad incident It is a scripted video
Claim : లవ్ జీహాద్ లో భాగంగా అమాయకమైన అమ్మాయిలను నమ్మించి కిడ్నాప్ చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu post
Claim Source : Social Media
Fact Check : False
Next Story