schema:text
| - Sat Jan 25 2025 17:14:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ముంబైలో చోటు చేసుకున్న ఘటనను హైదరాబాద్ కు చెందినదిగా ప్రచారం
నవంబర్ 2024 నాటికి, హైదరాబాద్ మెట్రో రైలు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుండి 63.5 కోట్ల మంది
Claim :హైదరాబాద్ మెట్రో రైలులో కోచ్లోకి ప్రయాణికులను పోలీసులు తోస్తున్నారు
Fact :వీడియో పాతది, ముంబై లోకల్ వందేభారత్ రైలులోకి పోలీసులు ప్రజలను తోస్తున్నారు
నవంబర్ 2024 నాటికి, హైదరాబాద్ మెట్రో రైలు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుండి 63.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. రోజువారీ ప్రయాణీకుల సంఖ్య ఇప్పుడు 4.75 లక్షలకు పైగా ఉంది. మెట్రోలోని అన్ని కోచ్లు ఆటోమేటిక్ డోర్లతో ఎయిర్ కండిషన్ తో ఉంటాయి.
హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న రద్దీని నిర్వహించడానికి, రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడానికి మరిన్ని మెట్రో ట్రైన్ లను కొనుగోలు చేయనున్నారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. JBS మెట్రో స్టేషన్లో 'MeTimeOnMyMetro' అనే ప్రమోషనల్ క్యాంపెయిన్లో ఆయన మాట్లాడుతూ ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2తో సహా రాష్ట్రాల్లోని వివిధ ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖ రాశారు.
రైలు తలుపులు మూసివేయకపోవడంతో రైల్వే పోలీసులు రద్దీగా ఉన్న రైలులోకి ప్రయాణికులను నెట్టివేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. లోకల్ ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసి ఉండటంతో మెట్రో రైలు తలుపులు తెరచుకుని ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను “అమీర్పేట్ నుండి రాయదుర్గం మెట్రో ” అనే వీడియోపై క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేశారు.
క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో ఉన్నది హైదరాబాద్ మెట్రో రైలు కాదు. ఇది ముంబైలో లోకల్ వందేభారత్ ట్రైన్ ను చూపుతుంది. ఈ వీడియో జూలై 2023 నాటిది.
వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ వీడియో ఇటీవలిది కాదని తెలుస్తోంది. Honey Rosie Vlog అనే యూట్యూబ్ ఛానెల్ జూలై 21, 2023న India Train Rush Hour / Train Pushers Shove Passenger onto India Busy Train అనే శీర్షికతో ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ సంఘటన జరిగిన లొకేషన్ను మేము ధృవీకరించలేకపోయినప్పటికీ, వీడియో ఇటీవలిది కాదని, హైదరాబాద్ మెట్రో రైలును చూపలేదని ధృవీకరించగలిగాము.
ఇదే వీడియోను Unseen Mumbai అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో డిసెంబర్ 2024న వీడియోను పోస్టు చేశారు
అదే ఇన్స్టా గ్రాం అకౌంట్ లో షేర్ చేసిన మరో వీడియో ను ఇక్కడ చూడొచ్చు.
Aajtak మీడియా సంస్థ కూడా ఇదే తరహా వీడియోను పోస్టు చేసింది, ముంబైలోని దహిసర్లో ఈ వీడియో రికార్డు చేశారని పేర్కొంది.
అదే వీడియోను టైమ్స్ నౌ లో జూలై 22, 2023న “A Railway police officer was forced to intervene after the automatic doors on a Mumbai AC local train failed to close. A video shows the cop pushing commuters further into the train while passersby, including a dog, watch on. Video credit: Mumbai matters/Twitter” అనే క్యాప్షన్తో షేర్ చేశారు. పోలీసులు ప్రయాణీకులను రైలులోకి తోస్తున్నారని అందులో తెలిపారు.
moneycontrol.com కూడా ఇందుకు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించింది. యోగేష్ అడేట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోను @Mumbaimatterz హ్యాండిల్ నుండి ట్విట్టర్లో వీడియోను పోస్టు చేశారు. AC లోకల్ సబర్బన్ దహిసర్లో ప్రయాణికులతో నిండిపోయి ఉంది. ఆటోమేటిక్ తలుపులు ఓ వ్యక్తి అడ్డంగా ఉన్న కారణంగా అవి క్లోజ్ అవ్వడం లేదు. పదే పదే ఆటోమేటిక్ డోర్లు క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించినా కంపార్ట్మెంట్లో ప్రజలు ఎక్కువగా ఉండడంతో క్లోజ్ అవ్వడం కుదరలేదు.
ఇంతలో తలుపులు మూసుకోవడానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని ఒక భద్రతా అధికారి నెట్టడంతో ట్రైన్ తలుపులు మూసుకుంటాయి. ఒక పోర్టర్ కూడా పోలీసులకు సహాయం చేశాడు. అదే సమయంలో ఓ కుక్క కూడా వచ్చి ఈ సంఘటనను గమనించడం వీడియోలో రికార్డు అయింది.
ముంబై ప్రజలు రోజువారీ ప్రయాణాల కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సవాళ్లకు సాక్ష్యంగా ఈ వీడియో కూడా నిలిచింది. ముంబై రైళ్లు ప్రయాణీకుల సంఖ్యకు ప్రసిద్ధి చెందాయి. సామర్థ్యాన్ని మించి రైళ్లలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రైన్ ఎక్కడం కూడా సవాల్ తో కూడుకున్నది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారుతూ ఉంటుంది.
రైల్వే పోలీసు ప్రయాణికులను కోచ్లోకి నెట్టివేస్తున్న వీడియో హైదరాబాద్కు చెందినది కాదు. వీడియో ముంబై లోని లోకల్ వందేభారత్ రైలును చూపుతుంది. జూలై 2023లో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
News Summary - Mumbai local Vandebharat train
Claim : హైదరాబాద్ మెట్రో రైలులో కోచ్లోకి ప్రయాణికులను పోలీసులు తోస్తున్నారు
Claimed By : Instagram User
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Instagram
Fact Check : False
Next Story
|