About: http://data.cimple.eu/claim-review/8f1c4c5eae503c1a76d6d5f4a730b90c9e336af7594a11686f85776a     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Thu Jul 18 2024 10:55:17 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం చేసింది మనీష్ సిసోడియా అంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్పలేదు అరవింద్ కేజ్రీవాల్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు Claim :తనను తాను కాపాడుకోడానికి.. కేజ్రీవాల్ మొత్తం మనీష్ సిసోడియా చేశాడని చెప్పేశారు Fact :అరవింద్ కేజ్రీవాల్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు మార్చి 21, 2024న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ-లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఆయనకు తొలుత ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది, అయితే ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు దీనిపై స్టే విధించింది. అవినీతి కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరుతూ సీబీఐ చేసిన పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ జూన్ 28, 2024న తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో, 1.24 సెకన్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తనను తాను రక్షించుకోవడానికి కేజ్రీవాల్ మొత్తం చేసింది తన పార్టీ మంత్రి మనీష్ సిసోడియా అంటూ ఆయన మీదకు నెట్టేసినట్లుగా అందులో ఉంది. మద్యం కుంభకోణానికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారని, దీంతో మొత్తం చేసింది మనీష్ సిసోడియా అంటూ ఆ వీడియో ఒక వార్తా ఛానెల్ నుండి వచ్చిన క్లిప్గా కనిపిస్తోంది. వినియోగదారులు ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం మొత్తం నిందను మనీష్ సిసోడియాపై వేసేశారని ఆ పోస్టుల్లో చెబుతున్నారు. “Arvind Kejriwal puts the entire blame of the Delhi Liquor scam on Manish Sisodia and washes his hands off the matter. He even said Vijay Nair reported to Atishi and Saurabh Bhardwaj. Sisodia ko bali ka bakra bana diya @ArvindKejriwal ne” అనే క్యాప్షన్ తో వైరల్ చేస్తున్నారు. మనీష్ సిసోడియాను అరవింద్ కేజ్రీవాల్ బలి పశువును చేసేశారంటూ వైరల్ పోస్టుల్లో ఆరోపించారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని మేము కనుగొన్నాము. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. నేను నిర్దోషినని, మనీష్ సిసోడియా నిర్దోషి అని, ఆప్ కూడా నిర్దోషి అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. "CBI की तरफ से मीडिया में प्लांट किया जा रहा है कि मैंने सारा दोष मनीष सिसोदिया पर डाल दिया है, मैंने ऐसा कोई बयान नहीं दिया है, मैंने कहा है मैं भी निर्दोष हूं। मनीष सिसोदिया भी निर्दोष हैं, AAP निर्दोष है। कोर्ट में जज ने भी माना- केजरीवाल ने ऐसा कोई बयान नहीं दिया जो CBI दावा कर रही है।" అంటూ సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ వివరణ ఇచ్చింది. కేజ్రీవాల్.. మనీష్ సిసోడియా పైకి నేరం నెట్టారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మనీష్ సిసోడియాపై నేరాన్ని మోపారంటూ సీబీఐ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. కేజ్రీవాల్ తన ప్రకటనలో, "నేను నిర్దోషిని, మనీష్ సిసోడియా నిర్దోషి, AAP కూడా నిర్దోషి." అని తెలిపారు. సీబీఐ పేర్కొన్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి ప్రకటన చేయలేదని కోర్టు న్యాయమూర్తి కూడా అంగీకరించారు. మా సెర్చ్ ఆపరేషన్ సమయంలో, లైవ్ లా ఇండియా పోస్ట్ను మేము కనుగొన్నాము.. అరవింద్ కేజ్రీవాల్ కోర్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. CBI వర్గాలు తన మీద తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని అన్నారు. తాను మనీష్ సిసోడియా మీదకు నేరాన్ని నెట్టేశానని చెబుతున్నారు.. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను మనీష్ సిసోడియా నిర్ధోషి అని చెప్పాను.. నేను కూడా నిర్ధోషి అని చెప్పాను. కానీ మా గురించి తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారు. లీగల్ న్యూస్ ప్రొవైడర్ బార్ & బెంచ్ కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది: “కేజ్రీవాల్: మైనే ఐసా కోయి బయాన్ నహీ దియా హై కి మనీష్ సిసోడియా దోషి హై. మనీష్ సిసోడియా నిర్దోష్ హై, AAP నిర్దోష్ హై, ప్రధాన నిర్దోష్ హు. ఉన్కా సారా ప్లాన్ హై హమీన్ మీడియా మే బద్నామ్ కర్నే కా”. తాను అలాంటి ప్రకటన చేయలేదని.. కేవలం తమపై విష ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ABP న్యూస్ “మనీష్ సిసోడియా నిర్దోషి” అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. AAP నాయకులపై CBI స్టేట్మెంట్ను అరవింద్ కేజ్రీవాల్ ఖండించారని అందులో ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా తాను స్టేట్మెంట్లు ఇచ్చారని దర్యాప్తు సంస్థ చేసిన వాదనలు తప్పు అని తేల్చి చెప్పారు. సిసోడియా నిర్దోషి అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. మింట్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. సీబీఐ తన గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని.. నేను ఒక ప్రకటనలో మొత్తం నిందను మనీష్ సిసోడియాపై ఉంచినట్లు మీడియాలో చూపుతున్నారని.. సిసోడియా దోషి అని ఎవరికీ నేను ఎటువంటి ప్రకటన ఇవ్వలేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. అందువల్ల, వివిధ మీడియా సంస్థలకు సంబంధించి చేసిన పరిశోధన, ప్రచురణల ఆధారంగా, మేము వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అలాంటి ప్రకటన చేయలేదు. News Summary - Fact Check Arvind Kejriwal clarifies that he did not put the blame on Manish Sisodia Claim : తనను తాను కాపాడుకోడానికి.. కేజ్రీవాల్ మొత్తం మనీష్ సిసోడియా చేశాడని చెప్పేశారు Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social Media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software