schema:text
| - Fri Sep 13 2024 18:12:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేసీఆర్ కనబడుట లేదు అంటూ హైదరాబాద్ మెట్రో పిల్లర్ల మీద పోస్టర్లు ఉంచలేదు
హైదరాబాద్ మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కేసీఆర్ కనబడుట లేదు
Claim :హైదరాబాద్ మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టర్లను ఉంచారు
Fact :వైరల్ ఫోటోను ఎడిట్ చేశారు. మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డు మీద అలాంటి పోస్టర్లను ఉంచలేదు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ బయటకు రాలేదని, బాధితులకు అండగా లేరంటూ విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో విపత్తు జరిగినా కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని.. కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు అతికించారనే విషయం బయటకు రాలేదు.
"రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్" అంటూ పోస్టర్లలో ఉంది.
అయితే ఏకంగా మెట్రో పిల్లర్ కు ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డు మీద 'కేసీఆర్ కనబడుట లేదు' అనే పోస్టర్లు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అలాగే పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్టర్ ను తమ తమ అకౌంట్లలో షేర్ చేశారు.
పలు న్యూస్ పోర్టల్స్ మెట్రో పిల్లర్ పై కేసీఆర్ కనుబడుటలేదు అనే పోస్టర్లను వార్తా నివేదికల్లో భాగంగా ప్రచురించాయి.
https://trinethramnews.in/kcr-
is-not-visible-posters-in- hyderabad/
సెప్టెంబర్ 4, 2024న వన్ ఇండియా వెబ్ సైట్ కథనంలో కూడా మెట్రో పిల్లర్ వద్ద ఉన్న పోస్టర్ ను కథనంలో ఉంచారు.
https://telugu.oneindia.com/
news/telangana/kcr-missing-a- riot-of-posters-in-hyderabad- 402207.html
ఇంగ్లీష్ వెబ్సైట్ హన్స్ ఇండియాలో కూడా ఇదే పోస్టర్ ను ప్రముఖంగా వాడారు. పోస్టర్లలో కేసీఆర్ చిత్రంతో పాటు “కేసీఆర్కు రెండు దఫాలు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు, కానీ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు” అనే ప్రకటన కూడా ఉందని కథనంలో తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని, ఈ వరదలపై ఒక్కసారి కూడా స్పందించని మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారని హన్స్ ఇండియా కథనంలో ఉంది.
https://www.thehansindia.com/
telangana/kcr-missing-posters- surface-in-city-904570
"రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్" అంటూ పోస్టర్లలో ఉంది.
అయితే ఏకంగా మెట్రో పిల్లర్ కు ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డు మీద 'కేసీఆర్ కనబడుట లేదు' అనే పోస్టర్లు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అలాగే పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్టర్ ను తమ తమ అకౌంట్లలో షేర్ చేశారు.
పలు న్యూస్ పోర్టల్స్ మెట్రో పిల్లర్ పై కేసీఆర్ కనుబడుటలేదు అనే పోస్టర్లను వార్తా నివేదికల్లో భాగంగా ప్రచురించాయి.
https://trinethramnews.in/kcr-
సెప్టెంబర్ 4, 2024న వన్ ఇండియా వెబ్ సైట్ కథనంలో కూడా మెట్రో పిల్లర్ వద్ద ఉన్న పోస్టర్ ను కథనంలో ఉంచారు.
https://telugu.oneindia.com/
ఇంగ్లీష్ వెబ్సైట్ హన్స్ ఇండియాలో కూడా ఇదే పోస్టర్ ను ప్రముఖంగా వాడారు. పోస్టర్లలో కేసీఆర్ చిత్రంతో పాటు “కేసీఆర్కు రెండు దఫాలు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు, కానీ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు” అనే ప్రకటన కూడా ఉందని కథనంలో తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని, ఈ వరదలపై ఒక్కసారి కూడా స్పందించని మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారని హన్స్ ఇండియా కథనంలో ఉంది.
https://www.thehansindia.com/
https://pallavinews.com/
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టర్లను ఎడిట్ చేశారు. మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కేసీఆర్ కనబడుట లేదు అంటూ ఎలాంటి ప్రకటనలను ఉంచలేదు.
మేము 'KCR Missing' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. 'KCR Missing' Posters create stir in Gajwel Telangana అంటూ డెక్కన్ క్రానికల్ కథనాన్ని 15 జూన్ 2024న ప్రచురించింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (కేసీఆర్) అదృశ్యమయ్యారంటూ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు అంటించిన పోస్టర్లు మెదక్ జిల్లాలో కలకలం సృష్టించాయని ఆ కథనంలో ఉంది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పేరుతో విడుదల చేసిన పోస్టర్లో వేల పుస్తకాలు చదివి తెలంగాణ ముఖ్యమంత్రిగా, గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన కేసీఆర్ గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ పోస్టర్లు గజ్వేల్ కు మాత్రమే పరిమితమయ్యాయి.
https://www.deccanchronicle.
గజ్వేల్ లో కేసీఆర్ కనబడుట లేదనే పోస్టర్లకు సంబంధించిన వార్తలను పలు మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఇక వైరల్ అవుతున్న మెట్రో పిల్లర్ పోస్టర్ ను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
https://merahoardings.com/
వైరల్ ఫోటోలోనూ, మెట్రో యాడ్స్ కు సంబంధించిన వెబ్ సైట్ లోని ఒరిజినల్ ఫోటోలోనూ వెనుక వైపు ఉన్న వ్యక్తులు ఒకటేనని మనం గుర్తించవచ్చు.
రెండింటి మధ్య పోలికలను ఇక్కడ చూడొచ్చు.
రెండింటి మధ్య పోలికలను ఇక్కడ చూడొచ్చు.
ఒరిజినల్ ఫోటోను తీసుకుని కేసీఆర్ మిస్సింగ్ అనే పోస్టర్లను ఫోటో షాప్ టూల్స్ ను ఉపయోగించి తయారు చేశారు. అంతే తప్ప ఒరిజినల్ ఫోటో లో కేసీఆర్ మిస్సింగ్ అనే యాడ్ లేదు.
ఇక కేసీఆర్ వరదలపై స్పందించారా లేదా అని వెతికాం. సిద్దిపేటలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడారు. 'వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారని మీడియా సంస్థలు కూడా తెలిపాయి.
https://zeenews.india.com/
telugu/telangana/ex-cm-kcr- donates-one-month-salary- along-with-ktr-kavitha-and- other-mla-mp-and-mlcs- salaries-to-telangana-floods- rv-161457
కాబట్టి, హైదరాబాద్ మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కేసీఆర్ కనబడుట లేదు అనే పోస్టర్లను ఉంచలేదు.
ఇక కేసీఆర్ వరదలపై స్పందించారా లేదా అని వెతికాం. సిద్దిపేటలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడారు. 'వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారని మీడియా సంస్థలు కూడా తెలిపాయి.
https://zeenews.india.com/
కాబట్టి, హైదరాబాద్ మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కేసీఆర్ కనబడుట లేదు అనే పోస్టర్లను ఉంచలేదు.
News Summary - fact check No posters were placed on the pillars of Hyderabad Metro saying that KCR missing
Claim : హైదరాబాద్ మెట్రో పిల్లర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులో కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టర్లను ఉంచారు
Claimed By : social media users, websites
Claim Reviewed By : Telugupost
Claim Source : social media, media
Fact Check : False
Next Story
|