Wed Feb 12 2025 16:11:30 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భారీ పొట్టతో ఉన్న చిత్రం మార్ఫింగ్ చేశారు
భారత క్రికెట్ జట్టు జూన్ 1, 2024న బంగ్లాదేశ్ జట్టుతో T20 ప్రపంచ కప్ 2024కు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత్ 60 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ను ఓడించింది.
Claim :రోహిత్ శర్మ పొట్టతో ఉన్నాడు. ఫిట్ గా లేడు.
Fact :రోహిత్ శర్మ చిత్రం మార్ఫింగ్ చేశారు. ఒరిజినల్ ఫోటో అతను ఫిట్గా ఉన్నాడని.. అంతపెద్ద పొట్ట లేదని చూపిస్తుంది
భారత క్రికెట్ జట్టు జూన్ 1, 2024న బంగ్లాదేశ్ జట్టుతో T20 ప్రపంచ కప్ 2024కు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత్ 60 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ను ఓడించింది.
మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రోహిత్ శర్మ భారీగా పొట్టతో ఉన్న చిత్రం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతోంది, ‘వాహ్ వాహ్ ఫిట్నెస్ ఆఫ్ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ’, ‘రోహిత్ శర్మ ఆజం ఖాన్(పాకిస్థాన్ ఆటగాడు)ను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడా?' అంటూ సెటైర్లు వేస్తూ పోస్టులు పెట్టారు.
మరికొందరు వినియోగదారులు మగవాళ్ల శరీరం ఉండేది ఇలాగే అనే శీర్షికతో చిత్రాన్ని షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
జూన్ 1, 2024న జరిగిన భారత్-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్లో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ భారీగా పొట్టతో కనిపించాడన్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారు.. నిజమైనది కాదు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి చిత్రాన్ని పరిశీలించాం.. ఆ చిత్రం మార్ఫింగ్ చేశారని పేర్కొంటూ కొన్ని కథనాలను కనుగొన్నాము. ‘This is the real pic of Captain Rohit Sharma from last match. But chokli PR edited this pic and posted from many different accounts. Never forgive that Bollywood raan for this.’ అంటూ ట్విట్టర్ యూజర్ పోస్టు చేయడాన్ని మేము గుర్తించాం. అసలు ఫోటోకు.. ఎడిట్ చేసిన ఫోటోకు తేడాల వెనుక ఓ క్రికెటర్ పీఆర్ టీమ్ ఉందంటూ అందులో ఆరోపించారు.
NDTV స్పోర్ట్స్ ప్రకారం, వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారు. కొద్ది రోజుల క్రితం రోహిత్ టీ20 వరల్డ్ కప్ అధికారిక ఫోటోషూట్లో పాల్గొన్నాడు. వైరల్ ఫోటోలో చూసినట్లుగా లేడని చిత్రాలు చూపిస్తున్నాయి. అతని ఫోటోషూట్ చిత్రాలను MI ఫ్యాన్స్ ఆర్మీ పేరుతో X పేజీలో షేర్ చేశారు.
టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్ల చిత్రాన్ని BCCI షేర్ చేసింది, ఇందులో రోహిత్ శర్మ ఫిట్గా, మంచి ఫిట్నెస్ తో ఉన్నట్లు చూపిస్తుంది.
అందుకే, సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న రోహిత్ శర్మ ఫోటోను ఎడిట్ చేశారు. భారీగా పొట్టతో ఉన్న ఆకారాన్ని చూపించే వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
News Summary - The image showing Indian cricket team captain Rohit Sharma with huge belly is morphed
Claim : రోహిత్ శర్మ పొట్టతో ఉన్నాడు. ఫిట్ గా లేడు.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story