schema:text
| - Wed Feb 12 2025 20:34:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వ్యోమగామిగా నటిస్తూ గుంతల మీద నడుస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో కాన్పూర్ కు సంబంధించింది కాదు బెంగళూరులో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి వ్యోమగామిగా నటిస్తూ.. చంద్రుడి మీద నడుస్తున్నట్లుగా అనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోను కాన్పూర్ లో చిత్రీకరించారంటూ వీడియోను కొందరు వైరల్ చేస్తూ ఉన్నారు.
Claim :రోడ్లపై ఉన్న గుంతల వద్ద వ్యోమగామిగా నటిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో కాన్పూర్/బుందేల్ఖండ్కు చెందినది.
Fact :వీడియోలో ఉన్న వ్యక్తి పేరు బాదల్ నంజుండ స్వామి.. ఆయనది బెంగళూరు.. రోడ్ల దుస్థితి గురించి ఇలా తెలియజేశారు
ఓ వ్యక్తి వ్యోమగామిగా నటిస్తూ.. చంద్రుడి మీద నడుస్తున్నట్లుగా అనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోను కాన్పూర్ లో చిత్రీకరించారంటూ వీడియోను కొందరు వైరల్ చేస్తూ ఉన్నారు. వ్యోమగామిగా నటిస్తూ, రోడ్డుపై ఉన్న గుంతల మీద నడుస్తున్న ఒకకి సంబంధించిన వ్యక్తి వీడియో కాన్పూర్లో చిత్రీకరించినట్లు ప్రచారంలో ఉంది. కొంతమంది వినియోగదారులు వీడియో బుందేల్ఖండ్కు చెందినదని వాదించారు. మరికొందరు దీనిని ముసాఫిర్ఖానా కు సంబంధించినది అన్నారు. అయితే చాలా మంది వినియోగదారులు ఇది కాన్పూర్కు చెందిన వీడియో అంటూ చెప్పుకొచ్చారు.
“कानपुर के लोग सच में बड़े क्रिएटिव हैं। मुझे पहले लगा कि सच में यह चांद पर चलने का वीडियो है। #chandrayan3 #chandryan3successful #kanpurcity” అంటూ హిందీలో పోస్టు పెట్టారు. కాన్పూర్ ప్రజలు ఎంతో క్రియేటివిటీ ఉన్న వ్యక్తులని.. ఒకానొక సందర్భంలో నిజంగా చంద్రుడి మీద నడుస్తున్నారా అని తనకు అనిపించిందంటూ అందులో చెప్పుకొచ్చారు.
మరికొందరు ఇలాంటి పోస్టులు పెట్టి షేర్ చేశారు
“ हमारा बुंदेलखंड के लोग सच में बड़े क्रिएटिव हैं। मुझे पहले लगा कि सच में यह चांद पर चलने का वीडियो है। “
బుందేల్ఖండ్ కు చెందిన వ్యక్తులు చేసిన పని అంటూ చెప్పుకొచ్చారు.
“ हमारा बुंदेलखंड के लोग सच में बड़े क्रिएटिव हैं। मुझे पहले लगा कि सच में यह चांद पर चलने का वीडियो है। “
బుందేల్ఖండ్ కు చెందిన వ్యక్తులు చేసిన పని అంటూ చెప్పుకొచ్చారు.
“ये मुसाफिरखाना के लोग एक दिन एक्टिंग में मोदी जी को पीछे छोड़ देंगे…Description: मुझे पहले लगा कि सच में यह चांद पर चलने का वीडियो है। उसके बाद ऑटो वाले ने.” అంటూ ఇంకొందరు పోస్టులు పెట్టారు.
ఈ ముసాఫిర్ఖానా ప్రజలు ఏదో ఒకరోజు నటనలో మోదీజీని దాటిపోతారు. వివరణ: మొదట ఇది నిజంగా మూన్ మీద వాకింగ్ కు సంబంధించిన వీడియో అని అనుకున్నాను. ఆ తర్వాత ఆటో డ్రైవర్ రావడంతో అంతా తెలిసిపోయింది”
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ వీడియోను 2019లో రికార్డు చేశారు. అది కూడా బెంగళూరులో చిత్రీకరించారు.
వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్లను Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ వీడియో బెంగళూరులో చిత్రీకరించారని, 2019 నాటిదని పేర్కొంటూ మేము అనేక నివేదికలను కనుగొన్నాము.
2019 సెప్టెంబర్లో ప్రచురించిన అవుట్లుక్ ఇండియా అనే వార్తా వెబ్సైట్లోని ఒక కథనం ప్రకారం.. ఈ వీడియోను బెంగుళూరుకు చెందిన కళాకారుడు బాదల్ నంజుడస్వామి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. చంద్రుని ఉపరితలంగా చూపిన ప్రాంతం బెంగళూరు నగరంలోని గుంతలు ఉన్న రోడ్డు. వ్యోమగామి వేషధారణలో నడుస్తున్న వ్యక్తిని ఆ వీడియోలో చూడొచ్చు. నిమిషం నిడివిగల వీడియోలో, మనిషి చంద్రుడి ఉపరితలంపై ఉన్నట్లుగా తుంగానగర్ మెయిన్ రోడ్లో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తే, గుంతలతో నిండిన బెంగళూరు వీధులను చూడవచ్చు.
నంజుండస్వామి తన సృజనాత్మకతతో విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను బెంగళూరులోని ఒక వీధి మధ్యలోని గుంతలలో మొసలిని ఉంచారు. స్థానిక అధికారుల దృష్టిని ఆకర్షించింది. 2018లో, అధికారుల దృష్టికి వచ్చేలా గుంత చుట్టూ సాలెపురుగు బొమ్మను గీసాడు.
బాదల్ నంజుండస్వామి సెప్టెంబర్ 2, 2019న X (గతంలో Twitter)లో లొకేషన్ను బెంగళూరు, ఇండియా అని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసిన అసలైన వీడియోను కూడా మేము కనుగొన్నాము.

bbc.com లో కూడా ఇందుకు సంబంధించిన ఆర్టికల్ ను మనం చూడొచ్చు
వైరల్ వీడియోను Boomlive.com కూడా డీబంక్ చేసింది
కాబట్టి, రోడ్లపై ఉన్న గుంతల వద్ద వ్యోమగామిగా నటిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో కాన్పూర్/బుందేల్ఖండ్కు చెందినది కాదు.
వైరల్ వీడియోను Boomlive.com కూడా డీబంక్ చేసింది
కాబట్టి, రోడ్లపై ఉన్న గుంతల వద్ద వ్యోమగామిగా నటిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో కాన్పూర్/బుందేల్ఖండ్కు చెందినది కాదు.
News Summary - Video of a man posing as an astronaut and moonwalking on potholes is not from Kanpur but Bengaluru
Claim : A video of a man posing as an astronaut walking on the potholes is from Kanpur/ Bundelkhand
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : Misleading
Next Story
|