schema:text
| - Wed Feb 12 2025 16:31:27 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైసీపీకి సంబంధించిన VVPAT స్లిప్లను బయటకు విసిరేశారన్నది తప్పుడు వాదన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ-బీజేపీ-జనసేన కూటమి చేతుల్లో అధికారం కోల్పోయింది. టీడీపీ అత్యధికంగా 135 సీట్లు గెలుచుకోగా, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన మొత్తం 21 సీట్లను గెలుచుకుంది
Claim :ఓట్ల లెక్కింపునకు ముందు వైఎస్సార్సీ పార్టీ ఫ్యాన్ గుర్తుతో కూడిన వీవీప్యాట్ స్లిప్పులు కిందపడేసినట్లు వైరల్ వీడియో చూపుతోంది.
Fact :వీవీప్యాట్ స్లిప్పులు కాకుండా YSRCP ప్రచారానికి ఉపయోగించిన స్లిప్లను వీడియో చూపిస్తుంది
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ-బీజేపీ-జనసేన కూటమి చేతుల్లో అధికారం కోల్పోయింది. టీడీపీ అత్యధికంగా 135 సీట్లు గెలుచుకోగా, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన మొత్తం 21 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది, వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం చేసింది. ఎన్నికలలో టీడీపీ అద్భుతమైన ప్రదర్శన చేయగా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. నాల్గవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి కూడా అవ్వనున్నారు.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో కలిసి ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీకి మద్దతివ్వాలన్న తన నిర్ణయాన్ని తెలిపారు. ఇంటింటికీ, రైతులు, ఇతరులకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నప్పటికీ, ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడడానికి కారణమేమిటో తనకు తెలియదని పదవీవిరమణ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యాన్ లోగో (వైఎస్ఆర్సీపీ)కు చెందిన విసిరివేయబడిన VVPAT స్లిప్ల లాగా కనిపించే చాలా స్లిప్లను చూపించే వీడియో కౌంటింగ్ రోజున జూన్ 4, 2024న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో 'జగన్కి మనం వేసిన ఓట్లు పొదల్లో పడేశారు' అని ఓ వ్యక్తి చెబుతూ ఉండడం మనం వినవచ్చు.
ఏదో జరిగింది #trendingnow #electionresults #AndhraPradeshElections | Instagram అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న స్లిప్పులు పోలింగ్ బూత్ల నుంచి తీసిన VVPAT స్లిప్పులు కావు.
మేము వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ‘ఫ్యాన్ గుర్తు కే మన ఓటు’ అనే స్లిప్లపై పదాలు కనిపిస్తాయి. వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది:
“మాకు ఓటు వేయండి అంటూ, ఎన్నికల ముందు ఇంటిటికీ స్లిప్స్ ఇచ్చేప్పుడు, ఇచ్చే ఫ్యాన్ గుర్తుకు "మన ఓటు" అనే వాటిని పట్టుకుని, వీవీప్యాట్ స్లిప్స్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.” అంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ పంపిణీ చేయబడిన స్లిప్లు ఇవని మేము గుర్తించాం.
ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్ స్లిప్పులు విసిరేశారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ‘ఓట్ ఫర్ ఫ్యాన్’ అని రాసి ఉన్న ప్రచారానికి సంబంధించిన స్లిప్పులను పొదల్లో పడేశారు.. వాటినే ఈ వీడియోలో చూడొచ్చు తప్ప.. ఇవి వీవీప్యాట్ స్లిప్పులు కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
News Summary - Viral video showing crumbled paper slips makes a false claim as VVPAT slips of YSRCP
Claim : ఓట్ల లెక్కింపునకు ముందు వైఎస్సార్సీ పార్టీ ఫ్యాన్ గుర్తుతో కూడిన వీవీప్యాట్ స్లిప్పులు కిందపడేసినట్లు వైరల్ వీడియో చూపుతోంది.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story
|