Wed Feb 12 2025 21:48:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్యారిస్లోని ఈఫిల్ టవర్ సమీపంలో విధ్వంసం జరిగినట్లుగా ఉన్న వైరల్ చిత్రం AI ద్వారా రూపొందించారు
పారిస్లోని ఈఫిల్ టవర్కి సమీపంలో దట్టమైన పొగ ఉండడమే కాకుండా.. అల్లర్ల కారణంగా వీధుల్లో ఓ విధ్వంసం జరిగిందని అనిపించేలా ఫోటో ఉంది
పారిస్లోని ఈఫిల్ టవర్కి సమీపంలో దట్టమైన పొగ ఉండడమే కాకుండా.. అల్లర్ల కారణంగా వీధుల్లో ఓ విధ్వంసం జరిగిందని అనిపించేలా ఫోటో ఉంది
పారిస్లోని ఈఫిల్ టవర్కు సమీపంలో దట్టమైన పొగలు ఉండగా.. మంటల్లో నిండిపోయి ఉంది వీధి. దీనికి సంబంధించిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫ్రాన్స్లో ఇటీవల జరిగిన నిరసనల సమయంలో జరిగిన విధ్వంసం అంటూ పోస్టును షేర్ చేస్తున్నారు.
లైసెన్స్ లేకుండా కారు నడిపిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో నిరసనలు చెలరేగాయి.
లైసెన్స్ లేకుండా కారు నడిపిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో నిరసనలు చెలరేగాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:www.telugupost.com రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు ఇందుకు సంబంధించిన రిజల్ట్స్ ఏవీ కనిపించలేదు. ఈఫిల్ టవర్ సమీపంలోని వీధులలో విధ్వంసం అనే వార్త ఏదీ కనిపించలేదు. మేము AI- రూపొందించిన కంటెంట్ను గుర్తించగల అనేక సాధనాల ద్వారా చిత్రాన్ని పరీక్ష చేయగా.. ఈ చిత్రం AI ద్వారా రూపొందించారని కనుగొన్నాము. డిటెక్షన్ టూల్స్ ద్వారా వచ్చిన ఫలితాలను మీరు ఇక్కడ చూడవచ్చు.
https://huggingface.co/
https://www.aiornot.com/
https://illuminarty.ai/en/
అంతేకాకుండా, ఇది నిజమైన చిత్రం కాదని నిరూపించే అనేక విషయాలను ఈ ఫోటోలో మేము గుర్తించాం. ఉదాహరణకు, చిత్రంలో పొగ, మంటలు, మంటల్లో మనుషులు చాలా వరకూ రియాలిటీకి దూరంగా ఉన్నాయి.
మేము వైరల్ ఇమేజ్లో ఉన్నట్లుగా ఈఫిల్ టవర్ కు సంబంధించిన స్ట్రీట్ వ్యూను కూడా గమనించాం.. వాటిలో ఎక్కడా కూడా వైరల్ ఫోటో తరహాలో ఉన్నట్లుగా లేవు. అక్కడ ఉన్న భవనాలను కనుగొనడానికి Google Maps ను కూడా చూశాం.. అలాంటి ఏ బిల్డింగ్ కనిపించలేదు.
వైరల్ చిత్రం AI- రూపొందించారని, ఫ్రాన్స్లో అల్లర్లకు సంబంధించిన ఫోటో కాదని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
News Summary - Viral image of char-filled streets near Eiffel Tower in Paris is AI-generated
Claim : Image shows 'destruction caused by rioters' in France
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story