Fri Aug 16 2024 16:31:42 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: హిజాబ్ కు రాఖీ సావంత్ కూడా మద్దతు తెలిపిందా..?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హిజాబ్కు మద్దతుగా ఇలా చేశారంటూ పలువురు పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు.
క్లెయిమ్: హిజాబ్ కు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మద్దతు తెలిపిందా
ఫాక్ట్: ఆమె హిజాబ్ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వైరల్ అవుతున్న ఫోటోలు 2021 సంవత్సరం లోనివి.
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హిజాబ్కు మద్దతుగా ఇలా చేశారంటూ పలువురు పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. తెలుగు పోస్ట్ బృందం ఈ చిత్రం పాతదని, కర్ణాటకలోని అనేక నగరాలు, పట్టణాలలో కొనసాగుతున్న హిజాబ్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని కనుగొంది.
కర్ణాటకలో రాష్ట్రంలో హిజాబ్ వివాదం జనవరి నెల నుండి కొనసాగుతూ ఉంది. విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించినందుకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేయడం ప్రారంభించడంతో.. ఆ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
వైరల్ ఫొటోలో రాఖీ సావంత్ హిజాబ్ ధరించినట్లు చూపిస్తుంది. ఫోటోతో కూడిన హిందీ క్యాప్షన్ 'రాఖీ సావంత్ వంటి నటులు హిజాబ్కు మద్దతు ఇస్తున్నారు' అని హిందీ అనువాదం ఉంది. राखी सांवत जैसी कलाकार भी हिजाब के समर्थन में आगयी है... అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

ట్విట్టర్ లో కూడా ఈ పోస్టు ఇదే తరహాలో వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ:
మా బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఈ ఫోటోలు ఆగష్టు నెల 2021 కి సంబంధించినవి. రాఖీ సావంత్ హిజాబ్ ను ధరించి ఉన్న ఫొటోలు, వీడియోలను ఆగష్టు 31, 2021న అప్లోడ్ చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆమె ఆగష్టు 31, 2021న హిజాబ్ ధరించి జిమ్ కు వచ్చింది.
KoiMoi కి సంబంధించిన ధృవీకరించబడిన ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో కనిపించింది. హిజాబ్లో రాఖీ సావంత్ తన కారు నుండి దిగి అక్కడ మీడియా వ్యక్తులతో సంభాషిస్తున్నట్లు చూపిస్తుంది. '#RakhiSawant Wears Hijab To The Gym Is Another Controversy On The Cards?…' అంటూ వీడియోను పోస్టు చేశారు.

ప్రస్తుత హిజాబ్ వివాదంపై రాఖీ సావంత్ స్పందనకు సంబంధించిన కథనాల గురించి వెతకగా మాకు ఎటువంటి నివేదికలు లభించలేదు. మేము ఆమె సోషల్ మీడియా హ్యాండిల్లను తనిఖీ చేసాము, కానీ ఆమె హిజాబ్లో ఉన్నట్లుగా ఇటీవలి పోస్ట్ ఏదీ కనుగొనబడలేదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
క్లెయిమ్: హిజాబ్ కు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మద్దతు తెలిపిందా
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టులు అబద్ధం
News Summary - A picture of model-actor Rakhi Sawant wearing hijab is viral on social media with captions falsely claiming that the actor has come out in support of the hijab.
Claim : Rakhi Sawant comes in support of hijab
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story