schema:text
| - Thu Feb 13 2025 01:42:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో హైదరాబాద్ గురించి చెబుతూ ఉపయోగించిన ఫోటో సరైనది కాదా..?
పారిస్, మాంట్రియల్లను ఓడించి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ గెలుచుకుందని.. ఓ చిత్రంతో డిజిటల్ మీడియా ప్లాట్ఫాం ఒక వార్తను పంచుకుంది. పోస్ట్లోని చిత్రం హైదరాబాద్కు చెందినదిగా పేర్కొంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.
మేము Google, Yandexలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసాము. Shutterstockలో వైరల్ చిత్రాన్ని కనుగొన్నాము. మేము నిశితంగా పరిశీలించి, "ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే. సస్పెన్షన్ బ్రిడ్జి యొక్క వంపు, థాయ్లాండ్. ఏరియల్ వ్యూ. టాప్ వ్యూ. బ్యాక్గ్రౌండ్ సుందరమైన రహదారి" ("Elevated expressway. The curve of suspension bridge, Thailand. Aerial view. Top view. Background scenic road.") అని రాసి ఉన్న చిత్రంతో జతచేయబడిన వివరణను మేము కనుగొన్నాము. దీన్ని బట్టి ఇది థాయ్ లాండ్ అని తెలుస్తోంది.
మేము ఫోటో కంట్రిబ్యూటర్ ప్రొఫైల్ని తనిఖీ చేసాము, JULY_P30 కంట్రిబ్యూటర్ థాయ్లాండ్కు చెందినవారు. ఆ దేశానికి సంబంధించిన మరిన్ని చిత్రాలు, వీడియోలను గుర్తించాం.
Sansiri, థాయ్లాండ్లోని ఆస్తి పెట్టుబడుల గురించి అప్డేట్లను అందించే 'Sansiri News' అనే వార్తా వెబ్సైట్ కూడా నవంబర్ 2018లో వైరల్ అయిన అదే చిత్రాన్ని కలిగి ఉంది. మేము Sansiri గురించి మరింతగా వెతికాము.. ఇది థాయ్లాండ్ ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ అని కనుగొన్నాము. అందుకు సంబంధించి "Thailand's Economic Performance in 2018 and Outlook for 2019." అని హెడ్ లైన్ ఉండడాన్ని మేము గమనించాము.
మేము చిత్రంలో పసుపు మరియు ఆకుపచ్చ చారల టాక్సీలను కూడా గమనించాము. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఇలాంటి టాక్సీలు ఉన్నాయని కనుగొన్నాము.
అంతేకాకుండా, వైరల్ చిత్రం అనేక ప్రామాణికమైన ఇండోనేషియా వెబ్సైట్లలో ఉపయోగించారు.
https://www.blackxperience.
com/blackauto/autonews/dengan- quantum-computer--bantu-vw- dan-google-dalam-rekayasa- lalu-lintas-transportasi
మేము హైదరాబాద్ కు సంబంధించి కూడా ఇలాంటి చిత్రాలను కనుగొనడానికి ప్రయత్నించాము, కానీ ఏదీ కనుగొనబడలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిలా ఉన్నాయి. వార్తా కథనంలో ఉపయోగించిన చిత్రం హైదరాబాద్ నగరానికి చెందినది కాదు. ఇది అనేక ఇండోనేషియా, థాయిలాండ్ వెబ్సైట్లలో ఉపయోగించారు.

News Summary - Digital media platform makes FALSE claim on image from Hyderabad
Claim : An image shown along witnesses claiming it to be Hyderabad city
Claimed By : Instagram users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Instagram
Fact Check : Misleading
Next Story
|