Thu Aug 01 2024 15:28:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధానమంత్రి క్రెడిట్ యోజన ఫేక్
'ప్రధాన్ మంత్రి క్రెడిట్ యోజన' పథకం కింద ఆధార్ కార్డ్ ఉన్న వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం రూ. 80,000 నగదు బహుమతిని అందజేస్తోందని 'సర్కారీ అప్డేట్'(Sarkari Update) అనే యూట్యూబ్ ఛానెల్ పేర్కొంది
'ప్రధాన్ మంత్రి క్రెడిట్ యోజన' పథకం కింద ఆధార్ కార్డ్ ఉన్న వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం రూ. 80,000 నగదు బహుమతిని అందజేస్తోందని 'సర్కారీ అప్డేట్'(Sarkari Update) అనే యూట్యూబ్ ఛానెల్ పేర్కొంది.
అందులో ఉన్న వివరాల ప్రకారం.. "మోదీ ప్రభుత్వం అందరికీ శుభవార్త చెబుతోంది. తాజా అప్డేట్ ప్రకారం.. కొత్త పథకం ద్వారా, ఆధార్ కార్డ్ ఉన్నవారికి నగదు బహుమతిగా రూ. 80,000 లభిస్తుందని. ఈ పథకాన్ని ఎలా పొందవచ్చో అందులో వివరిస్తున్నారు."
మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని.. మీరు కూడా 80000 దక్కించుకోవచ్చు అని వీడియో థంబ్నైల్ లో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:ఫ్యాక్ట్ చెక్ బృందం వైరల్ అవుతున్న ప్రకటనకు సంబంధించి.. మద్దతు ఇవ్వగల ప్రకటనల కోసం ఇంటర్నెట్లో పూర్తిగా శోధించింది. కానీ ఏదీ కనుగొనబడలేదు. ఆధార్ కార్డ్ హోల్డర్లకు అటువంటి నగదు బహుమతిని అందించడం గురించి ఏ ప్రామాణికమైన మీడియా హౌస్ లేదా ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఈ పథకం నిజంగానే ప్రకటించి ఉంటే పలు మీడియా సంస్థలు దానిపై నివేదించేవి.. కానీ అలాంటి నివేదికలు ప్రచురించలేదు.
ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. మా ఫ్యాక్ట్ చెక్ టీమ్ అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లో వెతికినా 'ప్రధాన్ మంత్రి క్రెడిట్ యోజన' అనే పథకం కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక పథకాల జాబితాను మేము చూశాం.. అందులో ఇవేవీ కనిపించలేదు.
ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ వార్త ఫేక్ అని స్పష్టంగా పేర్కొంది. పిఐబి ఇండియా అటువంటి పథకం ఏదీ ప్రవేశపెట్టలేదని స్పష్టంగా చెప్పింది.
'ప్రధాని మంత్రి క్రెడిట్ యోజన' పథకం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, దేశంలోని మహిళలందరి బ్యాంకు ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు జమ చేసిందనే వాదన కూడా వైరల్ అయింది. ఇది కూడా నకిలీదని పిఐబి ఇండియా ప్రకటించింది.
ఈ వైరల్ వీడియో ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది. వీటిని నమ్మకండి.
News Summary - Pradhan Mantri Credit Yojana scheme is fake
Claim : Central government is providing Rs 80,000 to Aadhaar card holders under the 'Pradhan Mantri Credit Yojana' scheme.
Claimed By : Youtube videos
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Youtube
Fact Check : False
Next Story