schema:text
| - Fri Sep 13 2024 19:41:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ కు కొత్త జాతీయ గీతం వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
బంగ్లాదేశ్ కు కొత్త జాతీయ గీతం వచ్చింది
Claim :బంగ్లాదేశ్ కు కొత్త జాతీయ గీతం వచ్చింది. షకీరా వాకా వాకా ట్యూన్ లో పాట ఉంది
Fact :వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు
బంగ్లాదేశ్ జాతీయ గీతం, 'అమర్ సోనార్ బంగ్లా' ను రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనే భారతదేశ జాతీయ గీతాన్ని కూడా రాశారు. అమర్ సోనార్ బంగ్లాను 1905లో రాశారు. ఈ గీతం బెంగాల్ మొదటి విభజన సమయంలో రూపొందించారు. బెంగాల్ విభజన సమయంలో ఈ జాతీయ గీతాన్ని రాశారు. సమైక్య బెంగాల్ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ‘అమర్ సోనార్ బంగ్లా’ వంటి పాటలు కీలక పాత్ర పోషించాయి. మొదటిసారిగా సెప్టెంబర్ 1905లో బెంగాలీ సాహిత్య పత్రికలో అమర్ సోనార్ బంగ్లా కనిపించింది.
ఇక రాజకీయ ఒడిదుడుకుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ప్రపంచ బ్యాంకు సాయం కూడా కోరింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు సద్దుమణిగినట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక మద్దతు కోసం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఏబీడీలు తమకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్లోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చర్చించారు. బిడెన్ నుండి ఫోన్ కాల్ అందుకున్న ప్రధాని మోదీ ఇటీవలి ఉక్రెయిన్ పర్యటన గురించి చర్చించారు. శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం పూర్తి మద్దతును ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు.
ఇద్దరు నాయకులు బంగ్లాదేశ్లో పరిస్థితి గురించి కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. బంగ్లాదేశ్ లో శాంతిభద్రతల పునరుద్ధరణ, మైనారిటీలకు, ముఖ్యంగా హిందువుల భద్రతకు భరోసా కల్పించడంపై కూడా చర్చించారు. బంగ్లాదేశ్ లో ఆగస్ట్ 5న షేక్ హసీనా పాలన పతనం తర్వాత హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో భారతదేశం ప్రస్తావించింది. దేశంలోని పౌరులందరి హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
ఇలాంటి పరిస్థితులు ఓ వైపు ఉండగా బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని మార్చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియో లోని ఆడియోను ఒకసారి వినగా.. అది ప్రముఖ సింగర్ షకీరా వాకా వాకా సాంగ్ ట్యూన్ ను పోలి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని బట్టి వైరల్ వీడియోను నవ్వుకోవడం కోసం సృష్టించిందేనని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని మార్చినట్లుగా ఏ మీడియా కథనం కూడా రాలేదు.
వైరల్ వీడియోను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. సెర్చ్ రిజల్ట్స్ లో Gaan Bangla అనే ఫేస్ బుక్ ఛానల్ లో మార్చి 25, 2021న పోస్టు చేసిన వీడియోను గమనించాం.
‘আমার সোনার বাংলা, আমি তোমায় ভালোবাসি’ అనే టైటిల్ తో ఈ వీడియోను పోస్టు చేశారు. టైటిల్ కు 'నా బంగారు బంగ్లాదేశ్' అనే అర్థం వస్తుంది. వైరల్ వీడియోకు ఫేస్ బుక్ వీడియోకు మధ్య సారూప్యతలను గుర్తించాం. ఈ రెండు వీడియోలు ఒకటేనని గుర్తించాం. అంతేకాకుండా ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలకు, ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని గుర్తించాం. బంగ్లాదేశ్ లో అల్లర్లు జరగడానికంటే కొన్ని సంవత్సరాల కిందటే ఈ వీడియో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
ఈ టైటిల్ ను క్యూగా తీసుకుని యూట్యూబ్ లో కూడా ఈ వీడియో గురించి సెర్చ్ చేశాం. ఈ వీడియోకు యూట్యూబ్ లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
"আমার সোনার বাংলা | দেশ বরেণ্য ৫০ জন শিল্পীর কন্ঠে জাতীয় সংগীত | National Anthem of Bangladesh" అనే టైటిల్ తో Gaan Bangla TV అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్టు చేశారు.
"আমার সোনার বাংলা | দেশ বরেণ্য ৫০ জন শিল্পীর কন্ঠে জাতীয় সংগীত | National Anthem of Bangladesh" అనే టైటిల్ తో Gaan Bangla TV అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్టు చేశారు.
25 మార్చి 2021న ఈ పాటను అప్లోడ్ చేశారు. #AmarSonarBangla #Taposh #TagoreSong అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఉంచారు. ఈ పాటను మా టీమ్ కూడా విన్నది. ఇది రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన గీతమే అని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, బంగ్లాదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఆ దేశ జాతీయ గీతాన్ని మార్చేసిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
News Summary - fact check did bangladesh got new national anthem after new government came to power
Claim : బంగ్లాదేశ్ కు కొత్త జాతీయ గీతం వచ్చింది. షకీరా వాకా వాకా ట్యూన్ లో పాట ఉంది
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story
|