schema:text
| - Sun Nov 24 2024 14:36:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: టెక్సాస్ నుండి వలసలకు సంబంధించిన వైరల్ చిత్రం ఇటీవలిది కాదు
టెక్సాస్ నుండి అమెరికాలోని ఇతర నగరాలకు వలస వెళుతున్నారని ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. వేల మంది వలసదారులు వంతెనను దాటుతున్నట్లు చూపించే చిత్రం షేర్ చేయబడుతోంది.
టెక్సాస్ నుండి అమెరికాలోని ఇతర నగరాలకు వలస వెళుతున్నారని ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. వేల మంది వలసదారులు వంతెనను దాటుతున్నట్లు చూపించే చిత్రం షేర్ చేయబడుతోంది.
ఈ చిత్రం “టెక్సాస్ నుండి NYC, DC, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, చికాగోలకు చాలా బస్సులు వెళ్ళబోతున్నాయని నేను అనుమానిస్తున్నాను. ఆ నగరాలు సిద్ధంగా ఉండాలి. మీరు దానికే ఓటు వేశారు." అని వైరల్ పోస్టులు ఉన్నాయి.
“I suspect Texas is going to be sending a lot of buses to NYC, DC, Boston, San Francisco, Los Angeles, and Chicago. Get ready for the flood in those cities. You voted for it.” అంటూ పోస్టులు పెట్టారు.
“I suspect Texas is going to be sending a lot of buses to NYC, DC, Boston, San Francisco, Los Angeles, and Chicago. Get ready for the flood in those cities. You voted for it.” అంటూ పోస్టులు పెట్టారు.
పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఈ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంది కాదు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మేము 2018 నుండి కొన్ని ఫలితాలను కనుగొన్నాము. మేము Guillermo Arias.com అనే వెబ్సైట్ని చూశాము. ఇందులో వైరల్ ఇమేజ్తో పాటు అనేక ఇతర చిత్రాలు కూడా ఉన్నాయి. సెంట్రల్ అమెరికన్ మైగ్రంట్స్.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రయాణిస్తున్నారని వెబ్సైట్ పేర్కొంది.
వలస వచ్చిన వారిలో గ్వాటెమాల, హోండురాస్, ఎల్ సాల్వడార్ నుండి వస్తున్న వారు ఉన్నారు. తీవ్ర హింస, అభద్రత, పేదరికం ఎదుర్కొన్న ప్రజలు ఉన్నారని కూడా పేర్కొంది.
సెప్టెంబరు 2019లో ప్రచురించబడిన AFP నివేదిక ప్రకారం, యుఎస్కి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సెంట్రల్ అమెరికన్ వలసదారులను కవర్ చేసినందుకు ఫోటో జర్నలిజం ఈవెంట్ లో "వీసా పోర్ ఎల్'ఇమేజ్"లో గిల్లెర్మో అరియాస్ బహుమతిని గెలుచుకున్నారు. అక్టోబరు 27, 2018న డ్రోన్ ద్వారా ఈ ఫోటోను తీశానని చెప్పాడు.

dw.com ప్రకారం, 2018-2019లలో వేలాది మంది వలస వచ్చారు. మధ్య అమెరికా నుండి వచ్చారు. చాలా మంది తమ దేశాలలో పేదరికం, హింస నుండి తప్పించుకునే ప్రయత్నంలో US సరిహద్దుకు వెళుతున్నారు. సరిహద్దులను రక్షించడానికి అమెరికా దళాలను పంపింది.
News Summary - Viral image claiming emigration from Texas not recent
Claim : Image shows immigrants from Texas recently
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|