About: http://data.cimple.eu/claim-review/dcf73239e0263cb42e5a928363948e3000505a018d2584e44423409f     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Jul 19 2024 12:31:56 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ శివతాండవాన్ని పఠించారని వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారు. ఆయన వేదికపై ఎలాంటి భజనలు, కీర్తనలు పాడలేదు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. Claim :హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగా భజన చేశారు Fact :కర్ణాటకలోని బీజాపూర్ లో అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో ఓవైసీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ భజనలను ఆలపించారని తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ. అసదుద్దీన్ ఒవైసీ తన మాటలతో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ వేదికపై భజన చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. Malathi Reddy 2.0 అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశారు. “మాధవీ లత గారు పోటీ చేస్తారు అనగానే సాహెబ్ గారి నోటినుండి శివ తాండవ స్తోత్రం అద్భుతంగా చెప్పారు సార్, మత ఘర్షణలు లేకుండ చూసుకుంటే మీరే మళ్లీ గెలుస్తారు-నా సొంత అభిప్రాయం” అనే వాదనతో వీడియోను అప్లోడ్ చేశారు. ఇదే వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్లు పోస్ట్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ భజనలు పాడుతున్నారంటూ వీడియోను ప్రమోట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో 2022 నుండి ఇంటర్నెట్లో ఉన్నట్లు మేము కనుగొన్నాము. అసలు వీడియోలో అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన ఎలాంటి భజనలు చేయలేదు. మేము మొదట “Asaduddin Owaisi Chanting Bhajan” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. కానీ దీనికి సంబంధించిన వార్తలు లేదా ఇతర సంబంధిత కథనాలు కనుగొనలేకపోయాం. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన తర్వాత, అక్టోబర్ 26, 2022న న్యూస్ 18 ఉర్దూ లైవ్ స్ట్రీమ్ వీడియోను యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసింది. “Asaduddin Owaisi addressing a public meeting in Bijapur, Karnataka city. Why Amit Shah will not continue the survey of border areas where there are non-Muslims? After all, on what basis are Amit Shah and the BJP people doubting the Muslims of the border areas? - Barrister Asaduddin Owaisi” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ బహిరంగ సభలో ప్రసంగించిన అదే వీడియోను పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ముస్లిమేతరులు ఉన్న సరిహద్దు ప్రాంతాల సర్వేను అమిత్ షా ఎందుకు కొనసాగించరు? అని అసదుద్దీన్ ఒవైసీ పలు ప్రశ్నలను సంధించారు. కర్ణాటక నగరంలోని బీజాపూర్లో అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభలో ప్రసంగించారనే విషయం తెలుసుకోడానికి మేము సెర్చ్ చేసినప్పుడు.. ఒవైసీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో అక్టోబర్ 26, 2022న “మోదీ జీ, క్యా బీజాపూర్ పాకిస్థాన్ హై?” అనే క్యాప్షన్తో అదే వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. 'బీజాపూర్, కర్ణాటక కా దిల్ హై, బీజాపూర్ కర్ణాటక కా ఇతిహాస్ హై ఔర్ బీజాపూర్ కే గోల్ గుంబజ్ కర్ణాటక కీ ఖుబ్సూర్తీ కి మిసాల్ హై.' అంటూ చెప్పుకొచ్చారు అసదుద్దీన్. బీజాపూర్ కర్ణాటకకు హృదయం వంటిదని, కర్ణాటక చరిత్రలో ఒక భాగమని చెప్పుకొచ్చారు అసదుద్దీన్. మీరు వైరల్ వీడియోను నిశితంగా గమనిస్తే.. ఆయన ముఖ కదలికలు, హావభావాలు చాలా అసహజంగా ఉన్నాయని మీరు గుర్తించవచ్చు. అలాగే ఆయన పెదవుల కదలికకు, వస్తున్న సౌండ్ కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించాం. కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారు. News Summary - Fact Check Viral video showing Asaduddin Owaisi at a public meeting makes false claim of him chanting Shiv Tandav Claim : Hyderabad MP Asaduddin Owaisi is chanting bhajan Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social Media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software