schema:text
| - Sat Feb 15 2025 14:37:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: జెప్టో 10 నిమిషాలలో కారును డెలివరీ చేయడం లేదు. టెస్ట్ డ్రైవ్ కు కారును తీసుకుని వస్తున్నారు
జెప్టో 10 నిమిషాలలో కారును డెలివరీ చేస్తోందనే
Claim :
జెప్టో సర్వీసు ద్వారా 10 నిమిషాలలో కారును డెలివరీ చేస్తారుFact :
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉందిప్రముఖ నగరాల్లో యాప్స్ ద్వారా కోరిన వస్తువులు ప్రజల చెంత చేరుతూ ఉంటాయి. జెప్టో, బ్లింక్ ఇట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆ కోవకే చెందినవి.
క్విక్ కామర్స్ విభాగంలో Zepto దూసుకుపోతోంది. డేటా సెన్సార్ టవర్ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, ఆహారాలు, పానీయాల విభాగంలో మొబైల్లలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన రెండవ మొబైల్ యాప్గా గత సంవత్సరం నిలిచింది. US ఫాస్ట్ ఫుడ్ చైన్ అయిన మెక్డొనాల్డ్స్ అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్ గా నిలిచింది. Zepto ప్రత్యర్థి Blinkit ఈ విభాగంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్లలో పదవది. ఈ కేటగిరీలోని ఇతర భారతీయ కంపెనీలు ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీలైన జొమాటో ఐదవ స్థానంలో, స్విగ్గీ తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి. ఫండింగ్ విషయంలో కూడా జెప్టో మంచి పురోగతిని సాధిస్తూ ఉంది.
ఇక ఈ కంపెనీ నిమిషాల వ్యవధిలో మీకు కావాల్సిన వస్తువులను అందిస్తామంటూ ప్రచారం చేస్తూ ఉంది. అయితే కారును కూడా 10 నిమిషాల్లో జెప్టో డెలివరీ చేస్తుందనే యాడ్ సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది.
Zepto ఇప్పుడు 10 నిమిషాల్లో స్కోడా కార్లను డెలివరీ చేస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్లను షేర్ చేస్తున్నారు. ఈ యాడ్ లో జెప్టో డెలివరీ బాయ్ స్కోడా షోరూమ్ కు వెళతారు. అక్కడకు వెళ్లి సార్ ఆర్డర్ తీసుకోడానికి వచ్చానని చెబుతాడు. కొన్ని క్షణాల తర్వాత ఓ ట్రక్కులో కారును తీసుకుని వెళ్లడం వీడియోలో చూడొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. కార్లను జెప్టో 10 నిమిషాలలో డెలివరీ చేయడం లేదు.
మేము Zepto సంస్థ అధికారిక Instagram ఖాతాకు వెళ్లాము. అందులోని వీడియోను కూడా గమనించాం. వీడియోలో స్కోడా కైలాక్ అనే నిర్దిష్ట కారు మోడల్ని చూపించారు, కానీ ఇతర వివరాలను అందించలేదు. స్కోడా కుషాక్ను యాడ్ లో భాగంగా చూపించినా కంపెనీ కార్లను విక్రయిస్తోందని లేదా డెలివరీ చేస్తుందని చెప్పలేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ ను చేసాము. అప్పుడు మాకు అనేక వార్తా నివేదికలు కనిపించాయి.
హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్ లో స్కోడాతో జెప్టో సంస్థ భాగస్వామ్యమైందని, వినియోగదారులకు 10 నిమిషాల్లో టెస్ట్ డ్రైవ్లను అందించిందని కథనంలో ఉంది.
Zepto తన SUV కారును టెస్ట్ డ్రైవ్ కోసం ఆసక్తిగల కస్టమర్ల ఇంటి వద్దకు తీసుకురావడానికి స్కోడాతో జతకట్టింది. స్కోడా కైలాక్ మార్కెట్లో ఉన్న కొత్త సబ్-ఫోర్-మీటర్ SUVలలో ఒకటి. అందులో భాగంగా '10 నిమిషాలలో టెస్ట్ డ్రైవ్లను' అందిస్తూ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Skoda Partners With Zepto In India For Test Drives Of The Kylaq అనే టైటిల్ తో కార్ దేఖో వెబ్సైట్ లో కూడా కథనాన్ని మేము చూశాం.
ఇందులో కూడా టెస్ట్ డ్రైవ్ కోసం జెప్టో డెలివరీ చేస్తోంది కానీ, డైరెక్ట్ గా కారును డెలివరీ చేస్తున్నట్లు తెలపలేదు.
కైలాక్ కారు వేగవంతమైన టెస్ట్ డ్రైవ్ల కోసం స్కోడా Zeptoతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 10 నిమిషాల్లో కైలాక్ టెస్ట్ డ్రైవ్లను ఆర్డర్ చేయవచ్చని నివేదించారు. రెగ్యులర్ టెస్ట్ డ్రైవ్లు, కైలాక్ డెలివరీలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. కైలాక్ ధరలు రూ. 7.89 లక్షల నుండి రూ. 14.40 లక్షల మధ్య ఉన్నాయి.
ఇదే తరహా కథనాలను మేము పలు వెబ్సైట్లలో చూశాం.. కానీ ఎందులో కూడా కార్లను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నట్లుగా తెలపలేదు.
Zepto సంస్థ కార్లను డెలివరీ చేస్తామని స్పష్టంగా చెప్పనప్పటికీ, కొందరు వ్యక్తులు యాడ్ ను చూసి ఊహాగానాల్లో భాగమయ్యారు.
Zepto సహ వ్యవస్థాపకుడు CEO ఆ,దిత్ పాలిచా వైరల్ పోస్టులపై స్పందించారు. ప్రస్తుతానికి, Zepto కేవలం స్కోడా కైలాక్ టెస్ట్ డ్రైవ్లను మాత్రమే అందిస్తుంది, కార్లను డెలివరీ చేయడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అలాంటిది వీలవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కాబట్టి, జెప్టో 10 నిమిషాలలో కారును డెలివరీ చేస్తోందనే వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. కేవలం టెస్ట్ డ్రైవ్ ను మాత్రమే అందిస్తూ ఉంది.
Claim : జెప్టో సర్వీసు ద్వారా 10 నిమిషాలలో కారును డెలివరీ చేస్తారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story
|