About: http://data.cimple.eu/claim-review/f2d5a467561bbc698e8a909071fc91deaca98acb8bbf45155a4e5eaf     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Dec 06 2024 14:20:41 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: వరదలకు సంబంధించిన వీడియో చెన్నై లోని మెరీనా బీచ్ కు సంబంధించింది కాదు బీచ్లో వరదలు పోటెత్తుతున్న వీడియో Claim :చెన్నైలోని మెరీనా బీచ్లో వరదలు పోటెత్తుతున్న వీడియో వైరల్గా మారింది Fact :వైరల్ వీడియో పాతది, భారతదేశానికి సంబంధించింది కాదు ఫెంగల్ తుఫాను కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో తీవ్ర విధ్వంసం జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా భారీ వర్షం కురిసింది. తుపాను కారణంగా చెన్నైలో విమాన, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అనేక జాతీయ రహదారులు జలమయం కావడంతో తమిళనాడులోని దక్షిణ ప్రాంతాల నుంచి చెన్నైకి సంబంధాలు తెగిపోయాయి. రైలు సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, చెన్నైకి వెళ్లే రైళ్లను అరక్కోణం మీదుగా దారి మళ్లించారు, దీంతో ఆరు నుండి ఎనిమిది గంటలు ఆలస్యం అయ్యాయి. తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడ్డాయి, భారీ వర్షపాతం కారణంగా పెద్ద రాయి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో 7 మంది మరణించారు. ఈ సమయంలో వరదలతో నిండిన వీధులను చూపించే ఓ వీడియో 'మెరీనా బీచ్, చెన్నై' అనే వీడియోపై క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వైరల్ అయింది. వీధుల్లో భారీగా నీరు నిలిచిపోవడం వీడియోలో కనిపిస్తోంది. వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో భారతదేశంలోని చెన్నై కు సంబంధించింది కాదు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి వచ్చింది. మేము వైరల్ వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వీడియో సెప్టెంబర్ 2024 నుండి ఆన్లైన్లో ఉన్నట్లు మేము కనుగొన్నాము. సెప్టెంబర్ 3, 2024న ‘Flash floods in Jeddah, Saudi Arabia after heavy rains’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన X పోస్ట్ని మేము కనుగొన్నాము Disaster News అనే ఎక్స్ ఖాతాలో ‘Massive flooding due to rainstorm in Jeddah in the Makkah Province, Saudi Arabia (02.09.2024)’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. న్యూస్ఫ్లేర్లో 'భారీ వర్షం జెద్దా వీధులను ముంచెత్తింది' అనే టైటిల్ తో ప్రచురించిన అదే వీడియోను కూడా మేము కనుగొన్నాము https://www.newsflare.com/ ఈ వీడియో చెన్నైకి సంబంధించింది కాదని, సౌదీ అరేబియాకు చెందినదని తమిళనాడు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అధికారిక X ఖాతా లో వివరించింది. గత సెప్టెంబరులో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వరదల సమయంలో తీసిన వీడియో ఇదని చెన్నైలోని మెరీనా బీచ్కు సంబంధం లేదని పేర్కొన్నారు. ‘Saudi Arabia: Heavy Rain has flooded the streets of Jeddah’ అనే టైటిల్తో MSNలో వీడియోను షేర్ చేశారు. భారీ వర్షాల కారణంగా జెడ్డా ఆకస్మిక వరదలను ఎదుర్కొంది. రహదారులు నీట మునిగాయి, విద్యాసంస్థలు మూతపడ్డాయని అందులో తెలిపారు. వైరల్ వీడియో భారతదేశంలోని చెన్నైకి చెందినది కాదు. ఇది సౌదీ అరేబియాలోని జెడ్డాకు సంబంధించింది కాదు. ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now News Summary - fact check viral video not belongs to chennai marina beach it's from saudi arabia Claim : చెన్నైలోని మెరీనా బీచ్లో వరదలు పోటెత్తుతున్న వీడియో వైరల్గా మారింది Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Claim Source : Social Media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software