schema:text
| - Sat Jan 25 2025 16:15:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కంటెంట్ క్రియేటర్ సృష్టించిన వీడియోను తప్పుడు వాదనతో వైరల్ చేస్తున్నారు
డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా లాంటి వాటితో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతరుల జీవితాలు
Claim :విదేశాల్లో ఉద్యోగాల సాకుతో హిందూ బాలికలను ఓ వర్గానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేయగా రక్షించిన దృశ్యాలు
Fact :వైరల్ వీడియో కంటెంట్ క్రియేటర్ల సృష్టి
డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా లాంటి వాటితో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతరుల జీవితాలు ఏమైపోతాయా అని కూడా ఆలోచించకుండా ఈ పనులు చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను నాశనం చేశాయి. అనాథాశ్రమం లేదా ఉద్యోగాలు అందించే ఏజెన్సీ లాంటి వాటితో అమాయక ప్రజలను వేధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను రవాణా చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం మధ్యప్రాచ్యం అంతటా 2.1 మిలియన్ల వలసదారులు గృహ కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఢిల్లీలో ఫారిన్ కంట్రీ జాబ్ కాల్ సెంటర్ పేరుతో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు హిందూ అమ్మాయిలను పిలిపించి అరబ్ దేశాలకు విక్రయిస్తున్నారని, ఓ వ్యక్తి ఇంట్లో బందీలుగా ఉన్న బాలికలను రక్షించే వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. “Do you want a job? అంటూ ఇంగ్లీష్ లో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
"ఢిల్లీలో, విదేశాల్లో జాబ్, కాల్ సెంటర్లో ఉద్యోగాలు పేరుతో, ఓ కమ్యూనిటీకి చెందిన వారు స్వయంగా జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీలను నడుపుతున్నారు. వారు ఉద్యోగాల సాకుతో కేవలం హిందూ అమ్మాయిలు, మహిళలను మాత్రమే పిలిచి వారిని విక్రయిస్తున్నారు. వాళ్లను అరబ్ దేశాలకు పంపిస్తూ ఉన్నారు. ఈరోజుల్లో హిందూ సమాజంలోని ఆడపిల్లలు పాశ్చాత్య సంస్కృతి మత్తులో ఉన్నారు, దాని వల్లే అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఒక యువకుడు ఓ ఇంట్లోని ముగ్గురు అమ్మాయిలను కాపాడాడు. అందరూ ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కాంటాక్ట్ లకు, గ్రూప్ లకు పంపండి. పాశ్చాత్య సంస్కృతి పిచ్చిలో ఉన్న అమ్మాయిలందరికీ షేర్ చేయండి, ఇలాంటి తోడేళ్ళ వలలో చిక్కుకోండి. " అంటూ ఆ పోస్టును వైరల్ చేస్తున్నారు.
“జాగ్రత్తగా ఉండండి ఢిల్లీలో ఉద్యోగ కాల్ సెంటర్లో విదేశీ ఉద్యోగ నియామకం పేరుతో కొందరు వ్యక్తులు స్వయంగా జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీని నడుపుతున్నారు, అందులో వారు ఉద్యోగాల సాకుతో అమ్మాయిలు మరియు మహిళలను మాత్రమే పిలిచి వారందరినీ అరబ్ దేశాలకు అమ్మేస్తున్నారు. నేటి కాలంలో అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతి మత్తులో ఉన్నారు, దీని కారణంగా నేడు ఢిల్లీలో ఒక యువకుడు ఏదో విధంగా ఢిల్లీలోని ఒక ఇంటి నుండి ముగ్గురు అమ్మాయిలను చెర నుండి విడిపించాడు, అందరూ ఏ స్థితిలో ఉన్నారో చూడండి. పాశ్చాత్య సంస్కృతి పట్ల పిచ్చి ఉన్న కుటుంబంలోని అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి తోడేళ్ల వలలో చిక్కుకోకండి.” అంటూ వాట్సాప్ లో కూడా ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. దావా తప్పు. జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ నెపంతో అమ్మాయిలను అరబ్ దేశాలకు పంపిన వాస్తవ సంఘటన అయితే కాదు. వైరల్ వీడియో నటీనటులతో తెరకెక్కించిన వీడియో.
వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా.. 0.22 సెకన్ల వద్ద డిస్క్లైమర్ ను మనం గమనించవచ్చు. వీడియో వినోద ప్రయోజనాల కోసం రూపొందించారని వివరించారు.
“Disclaimer: The content made in this video should be considered for entertainment purposes only, Information contained herein is not intended to be a source of advice or credit analysis with respect to the information presented, any action you take inspiring from this video is strictly at your own risk and we will not be liable for any losses and damages in connection with the use of information available in this video. We respect every individual, profession, and organization any roleplay we perform is solely to entertain you and not intended to hurt the sentiments of any person in the community. “ అంటూ డిస్క్లైమర్ ఉంది.
ఈ వీడియోలోని కంటెంట్ కేవలం వినోద ప్రయోజనాల కోసం మాత్రమే పరిగణించాలని అందులో స్పష్టంగా తెలిపారు. ఈ వీడియోలో అందుబాటులో ఉన్న సమాచారానికి సంబంధించి ఎటువంటి వాటికి మేము బాధ్యత వహించము.. మేము ప్రతి వ్యక్తిని, వృత్తిని, సంస్థను గౌరవిస్తాము, మేము చేసే ఏ సన్నివేశమైనా మిమ్మల్ని అలరించడానికి మాత్రమే. సంఘంలోని ఏ వ్యక్తి మనోభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశించలేదని వివరణ ఇచ్చారు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఆ వీడియో నవీన్ జంగ్రా అనే యూట్యూబ్ ఛానెల్లో ప్రచురించారని మేము కనుగొన్నాము. “Ye देखो केसे लड़कियों ko utaya Jata Hai or Bad m kya kiya Jata hai || Naveen Jangra New Video” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
యూట్యూబ్ ఛానెల్ బయోలో ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూడొచ్చు. ఈ వీడియో ఓ కంటెంట్ క్రియేటర్ సృష్టి అని తేలింది.
వైరల్ వీడియోలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఓ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ పేరుతో బాలికలను అరబ్ దేశాలకు పంపిన వాస్తవ ఘటన కాదు. ఇది కంటెంట్ క్రియేటర్ సృష్టించిన స్క్రిప్టెడ్ వీడియో. వీడియోలో ఉన్న వారు నటీనటులు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
News Summary - Women being trafficked video
Claim : విదేశాల్లో ఉద్యోగాల సాకుతో హిందూ బాలికలను ఓ వర్గానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేయగా రక్షించిన దృశ్యాలు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story
|