About: http://data.cimple.eu/claim-review/07c6467449fcd587f32a5fcb58fd07dcf3b0eb4ab6ab0b18024d6f17     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • వాస్తవ తనిఖీ: క్లోరాక్స్ కు ఇదివరకే కరోనావైరస్ గురించి తెలుసు మరియు కరోనావైరస్ కొత్త వైరస్ కాదు అని చెప్పే పోస్ట్ తప్పుదారిపట్టిస్తోంది విశ్వాస్ న్యూస్ పరిశోధన జరిపింది మరియు ఈ వైరల్ పోస్ట్ తప్పుదారిపట్టిస్తోంది అని కనుగొనింది. - By: Pallavi Mishra - Published: May 6, 2020 at 02:32 PM సామాజిక మాధ్యమములో ఉన్న ఒక వైరల్ పోస్ట్ క్లోరాక్స్ కరోనావైరస్ ను చంపుతుంది అని మరియు కొత్త కరోనావైరస్ ఏదీ లేదని తెలిపే ఒక టెక్స్ట్ తో సహా క్లోరాక్స్ లేబుల్ చిత్రాన్ని చూపుతోంది. విశ్వాస్ న్యూస్ పరిశోధన జరిపింది మరియు ఈ వైరల్ పోస్ట్ తప్పుదారిపట్టిస్తోంది అని కనుగొనింది. క్లెయిమ్ చెరిల్ రాబిన్సన్ అనే యూజర్ ద్వారా ఫేస్బుక్ పై షేర్ చేయబడిన ఒక వైరల్ పోస్ట్ ఈ విధంగా ఉంది: “నా స్నేహితురాలు ఒకరు తన క్లోరాక్స్ వైప్స్ వెనుక వ్రాసి ఉన్నదానిని చదివారు. మీకు తెలుసా! ఈ వైప్స్ చంపుతాయి అని జాబితా చేయబడిన వాటిల్లో హ్యూమన్ కరోనావైరస్ కూడా ఉంది. నేను మా వైప్స్ ను పరీక్షించాను, వాటిపై కూడా అలాగే వ్రాసి ఉంది. ఇప్పుడు నా సందేహం ఏమిటంటే, వార్తా మీడియా వారు మనకు చెబుతున్న విధంగా “కొత్త వైరస్” ఏదీ లేదు.” ఈ పోస్ట్ లో క్లోరాక్స్ కిల్స్ హ్యూమన్ కరోనావైరస్ అని వ్రాసి ఉన్న క్లోరాక్స్ చిత్రము కూడా ఉంది. ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ను మీరు ఇక్కడ చూడవచ్చు. పరిశోధన నోవెల్ కరోనావైరస్ రోగుల కేసులు పెరుగుతున్న ఈ సమయములో దీని గురించిన తప్పుడు సమాచారం కూడా పెరుగుతోంది. ఒక ఫేస్బుక్ పోస్ట్ లో క్లోరాక్స్ డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ లేబుల్ పై హ్యూమన్ కరోనావైరస్ అని వ్రాసి ఉండటాన్ని చూపుతోంది మరియు క్లోరాక్స్ లేబుల్ పై ఇదివరకే కరోనావైరస్ గురించి పేర్కొనబడింది కాబట్టి ఎలాంటి కొత వైరస్ లేదు అని కూడా చెబుతోంది. విశ్వాస్ న్యూస్ పరిశోధన జరిపినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వారి వెబ్సైట్ పై మాకు ఈ విధంగా కనిపించింది “నోవెల్ కరోనావైరస్ (2019-nCoV) యొక్క ఈ వ్యాప్తి డిసెంబర్ 31, 2019 న వూహాన్, చైనా నుండి మొదట ప్రారంభం అయింది.” “నోవెల్ కరోనావైరస్” అనబడే కరోనావైరస్ యొక్క ఈ కొత్త జాతి గురించి డిసెంబర్ 31, 2019 న తెలిసింది మరియు దీని గురించి ఇది వరకు తెలియరాలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారము, కరోనావైరస్ (CoV) వైరస్ ల ఒక పెద్ద కుటుంబము, ఇవి సాధారణ జలుబు నుండి మరింత తీవ్రమైన వ్యాధుల వరకు ఉండే అనారోగ్యాలను కలిగిస్తాయి, ఉదా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోం (ఎంఈఆర్ఎస్- CoV) మరియు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం (ఎస్ఏఆర్ఎస్- CoV). నోవెల్ కరోనావైరస్ (nCoV) మానవులలో ఇదివరకు గుర్తించబడని ఒక కొత్త జాతి. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారము, హ్యూమన్ కరోనావైరస్ లు మొట్టమొదటిగా 1960ల మధ్యలో గుర్తించబడ్డాయి. ప్రజలకు ఇన్ఫెక్షన్ కలిగించే ఏడు కరోనావైరస్ లు: 229E (ఆల్ఫా కరోనావైరస్) NL63 (ఆల్ఫా కరోనావైరస్) OC43 (బీట కరోనావైరస్) HKU1 (బీట కరోనావైరస్) MERS-CoV (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోం లేదా ఎంఈఆర్ఎస్ కలిగించే ది బీట కరోనావైరస్) SARS-CoV (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం లేదా ఎస్ఏఆర్ఎస్ ను కలిగించే బీటా కరోనావైరస్) 2019 నోవెల్ కరోనావైరస్ (2019-nCoV) కరోనావైరస్ కుటుంబములో 2019 నోవెల్ కరోనావైరస్ అనేది ఒక కొత్త జాతి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కి సమర్పించిన డాక్యుమెంట్లు క్లోరాక్స్ వైప్స్ ఉత్పత్తులు సాధారణ హ్యూమన్ కరోనావైరస్ అయిన హ్యూమన్ కరోనావైరస్ 229E పై పరీక్షింపబడ్డాయి కాబట్టి వాటి లేబుల్స్ పై జాబితాలో “హ్యూమన్ కరోనావైరస్” అని వ్రాసుకోగలిగారు అని తెలుపుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు వివరించారు. విశ్వాస్ న్యూస్ వారు క్లోరాక్స్ సంస్థలో కన్స్యూమర్ కేస్ విభాగములో పనిచేసే ఎంఎస్.పాట్రిషియా తో మాట్లాడారు. క్లోరాక్స్ ఉత్పత్తులలో కొన్ని ఇలాంటి జాతికి చెందిన కొన్ని వైరస్ లను ఎదుర్కొనుటలో సమర్థవంతమైనవని, కొత్త కరోనావైరస్ ఇదివరకు గుర్తించబడలేదు అని ఆమె చెప్పారు निष्कर्ष: విశ్వాస్ న్యూస్ పరిశోధన జరిపింది మరియు ఈ వైరల్ పోస్ట్ తప్పుదారిపట్టిస్తోంది అని కనుగొనింది. - Claim Review : క్లోరాక్స్ కు ఇదివరకే కరోనావైరస్ గురించి తెలుసు మరియు కరోనావైరస్ కొత్త వైరస్ కాదు. - Claimed By : Cheryl Robinson - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software